పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు | |
---|---|
తరహా | పబ్లిక్ |
స్థాపన | 1895 లో లాహోర్ |
ప్రధానకేంద్రము | ఢిల్లీ, భారతదేశం |
కీలక వ్యక్తులు | చక్రవర్తి, ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ |
పరిశ్రమ | బ్యాంకింగ్ ఇన్స్యూరెన్స్ పెట్టుబడి మార్కెట్ |
వెబ్ సైటు | www.pnbindia.com |
పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank - PNB)ను 1895లో లాహోర్ లో లాలా లజపతి రాయ్ గారు స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. భారతీయులు భారతదేశంలో స్థాపించిన బ్యాంకులలో ఇది మొదటిది. 1969, జూలై 19 నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయబడిన 14 బ్యాంకులలో ఇది ఒకటి[1].
చరిత్ర
[మార్చు]భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12 న లాహోర్ లొ రూ .2 లక్షల అధీకృత మూలధనం, రూ .20,000 వర్కింగ్ క్యాపిటల్ తో తన కార్యకలాపాలను ప్రారంభించింది. లాలా లజపతిరాయ్, ఇ.సి.జెస్సావాలా, బాబూ కాళీ ప్రసోనో రాయ్, లాలా హర్కిషన్ లాల్, సర్దార్ దయాల్ సింగ్ మజిథియా వంటి దేశభక్తులు భారతీయులు నిర్వహించే మొదటి బ్యాంకును స్థాపించడం ద్వారా వ్యక్తీకరించడంలో ధైర్యాన్ని ప్రదర్శించారు.
1882 నాటి ఇండియన్ కంపెనీల చట్టం VI ప్రకారం ఏర్పాటైన ఈ బ్యాంకు వివేకవంతమైన బ్యాంకింగ్ సాంప్రదాయిక వ్యవస్థతో దేశంలోని ప్రధాన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా తనను తాను దృఢంగా నిలిచింది.బ్యాంకు చరిత్రలో వివిధ కాలాల్లో 7 ప్రైవేటు రంగ బ్యాంకులను స్వాధీనం చేసుకోవడం/విలీనం చేయడం ద్వారా బ్యాంకు అభివృద్ధికి దోహద పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో గణనీయమైన పురోగతిని సాధించి తన వినియోగదారులకు సేవలను అందిస్తున్నది[2].
బ్యాంకు కాలరేఖ
[మార్చు]- 1895 : లాహోర్‌లో బ్యాంకు స్థాపన.
- 1904 : కరాచి, పెషావర్ లలో శాఖల స్థాపన.
- 1939 : భగవాన్‌దాస్ బ్యాంకు విలీనం.
- 1947 : దేశవిభజన ఫలితంగా కరాచిలో ఉన్న బ్యాంకు ఆస్తులను పోగొట్టుకుంది. పాకిస్తాన్ లో కూడా బ్యాంకు కార్యక్రమాలను కొనసాగించింది.
- 1961 : యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం.
- 1963 : బర్మా (ప్రస్తుత మయాన్మార్) ప్రభుతం రంగూన్ (ప్రస్తుతం యాంగాన్) లో బ్యాంకును జాతీయం చేసింది.
- 1965 : భారత్-పాక్ యుద్ధం ఫలితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని శాఖలను స్వాధీనం చేసుకుంది.
- 1969 : భారత ప్రభుత్వం దీనితో పాటు మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
- 1976 లేదా 1978 : లండన్ లో బ్యాంకు శాఖ స్థాపన.
- 1988 : హిందుస్థాన్ కమర్షియల్ బ్యాంకు విలీనం.
- 1993 : న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం. (ఇది 1980 లో జాతీయం చేయబడింది)
ఇతర సంస్థలు
[మార్చు]పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర సహాయక (సబ్సిడరీలు) గా ఉన్న సంస్థలు.[3]
- పిఎన్ బి గిల్ట్స్
- పిఎన్ బి హౌసింగ్ ఫైనాన్స్.
- పిఎన్ బి ఇన్వెస్ట్ మెంట్ సర్వీసెస్.
- పిఎన్ బి ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్.
- పిఎన్ బి లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ జాయింట్ వెంచర్స్.
- ప్రిన్సిపల్ పిఎన్ బి అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ.
- ప్రిన్సిపల్ ట్రస్టీ కంపెనీ.
- అసెట్స్ కేర్ ఎంటర్ ప్రైజెస్.
- ఇండియా ఫాక్టరింగ్ & ఫైనాన్స్ సొల్యూషన్స్.
బయటి లింకులు
[మార్చు]- Official site Archived 2008-09-17 at the Wayback Machine
- PNB cut home loan rates
- PNB Net Banking ( How-To Portal for PNB Net Banking )
మూలాలు
[మార్చు]- ↑ Anwesha Ganguly, qz com. "The history of PNB: Born in Lahore 123 years ago, it's unravelling thanks to Nirav Modi". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-05.
- ↑ "Brief overview of Punjab National Bank | Daily Tools". dailytools.in. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.
- ↑ "PNB: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of PNB - NDTVProfit.com". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-05.