బ్యాంక్ ఆఫ్ కలకత్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్యాంక్ ఆఫ్ బెంగాల్
గతంలోబ్యాంక్ ఆఫ్ కలకత్తా
పరిశ్రమబ్యాంకింగ్, ఆర్థిక సేవలు
స్థాపన2 June 1806; 218 సంవత్సరాల క్రితం (2 June 1806)
క్రియా శూన్యత27 January 1921; 103 సంవత్సరాల క్రితం (27 January 1921)
విధివిలీనం బ్యాంక్ ఆఫ్ కలకత్తా బ్యాంక్ ఆఫ్ మద్రాస్
వారసులుఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
బ్రిటిష్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ కలకత్తా (The Bank of Calcutta) (ప్రస్తుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్వగామి) 1806 జూన్ 2 న స్థాపించబడింది. భారతదేశపు మొదటి బ్యాంకు, 1809 జనవరి 2 న బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చబడింది. టిప్పు సుల్తాన్, మరాఠాలకు పై యుద్ధాలకు నిధులు సమకూర్చడానికి చేసిన ప్రయత్నం ఈ బ్యాంకు స్థాపనలో జనరల్ వెల్లెస్లీ ఉద్దేశ్యం.

చరిత్ర

[మార్చు]

1913 సంవత్సరంలో జాన్ మేనార్డ్ కీన్స్ దేశంలో బ్యాంకింగ్ స్థితిని సర్వే చేసిన తరువాత, ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ లో ఇలా వ్రాశాడు, "భారతదేశం వంటి దేశంలో ముఖ్యంగా బ్యాంకింగ్ కు చాలా ప్రమాదకరమైన దేశంలో, సాధ్యమైనంత సురక్షితమైన సూత్రాలపై బ్యాంకింగ్ నిర్వహించాలి." ఆసియాలో మొదటి బ్యాంకును కోల్ కతాలో బ్యాంక్ ఆఫ్ కలకత్తా బ్రిటిష్ వారు స్థాపించారు.బ్యాంక్ ఆఫ్ కలకత్తా భారతదేశం, ఆసియా లో మొదటి బ్యాంకు, 2 జనవరి 1809 న బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చబడింది.

1861 లో రంగూన్, 1862 సంవత్సరంలో పాట్నా, అదే సంవత్సరంలో మీర్జాపూర్, బెనారస్ లతో సహా బ్రిటిష్ వలస పాలనలో ఉన్న సుదూర ప్రాంతాల్లో కూడా ఈ బ్యాంకు శాఖలను ప్రారంభించింది.బ్యాంక్ ఆఫ్ కలకత్తా, మరో రెండు ప్రెసిడెన్సీ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బాంబే ,బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1921 జనవరి 27 న విలీనం చేసి, పునర్వ్యవస్థీక బ్యాంకింగ్ సంస్థ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్వాతంత్ర్యం తరువాత, 1955 సంవత్సరంలో ,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నియంత్రణను పొందింది. 30 ఏప్రిల్ 1955 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. [1]

మూలధనం

[మార్చు]

బ్యాంక్ ఆఫ్ కలకత్తా యుద్ధాలకు నిధులు సమకూర్చడానికి ఈట్ ఇండియా కంపెనీకి ఆర్థిక సహాయం అందించడానికి బ్యాంకును ఏర్పాటు చేశారు. రూ. 50 లక్షల మూలధనం (షేర్ క్యాపిటల్) తో ఈ బ్యాంకు ప్రారంభించబడింది. బ్యాంకు ప్రారంభంలో కంపెనీ ప్రయోజనాలకు సేవ చేయడం ప్రారంభించారు. బెంగాల్ మొత్తం వినియోగదారులకు సేవలను అందించడానికి 1809 సంవత్సరంలో బ్యాంకుకు ఒక చార్టర్ మంజూరు చేయబడింది. బ్రిటీష్ పార్లమెంటు మంజూరు చేసిన చార్టర్ షేర్ హోల్డర్లకు పరిమిత బాధ్యత, హక్కును అందించింది,తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చబడి, భారతదేశపు మొదటి జాయింట్ స్టాక్ బ్యాంక్ గా పేరు మార్చబడింది.

ప్రభుత్వ వాటా అల్పసంఖ్యాకంగా ఉన్నప్పటికీ బ్యాంకులో ప్రభుత్వ అధికారుల ఆధిపత్యం ఉండేది. మొదట్లో బ్యాంకు బోర్డులో ఒక భారతీయ డైరెక్టర్ మహారాజా సుఖ్మోయ్ రాయ్ చౌధోరి ఉండేవాడు. మిగిలిన వారంతా బ్రిటిష్ డైరెక్టర్లు, ఉద్యోగులు. బ్యాంకు భారతదేశంలో విలీనం చేయబడినప్పటికీ, ప్రయోజనాలు విదేశం కొరకు ఉండి,దాదాపు ఒక విదేశీ బ్యాంకుగా ఉంది, ఇది ఎక్కువగా శ్వేతజాతీయ ఖాతాదారులకు సేవలందిస్తుంది.[2]

వ్యాపారం

[మార్చు]

బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఉన్న ఖాతాదారులు ప్రసిద్ధులైన పండితుడు, రాజకీయ నాయకుడు దాదాభాయ్ నౌరోజీ, శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్, భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, విద్యావేత్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి వారు ఖాతాదారులలో ఉన్నారు. బ్యాంకు వ్యాపారం చేయడంలో ముఖ్యం గా వినియోగ దారులకు బ్యాంక్ విముఖత చూపింది, మూడు నెలలకు మించి అప్పు ఇవ్వకపోవడం, ఇది స్థానిక వ్యాపారవేత్తల వ్యాపారాలకు దారితీసింది, బ్రిటిష్, భారతీయ ప్రైవేట్ బ్యాంకులను ప్రారంభించడం వల్ల ఎక్కువ బ్యాంకు వైఫల్యాలకు దారితీసింది. దీనికి బ్రిటిష్ కంపెనీల భాగస్వామ్యంతో ద్వారకానాథ్ ఠాగూర్ స్థాపించిన యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ అత్యంత ఘోరమైన బ్యాంకు వైఫల్యం గా ఉదాహరణ గా పేర్కొనవచ్చును. [3]

మూలాలు

[మార్చు]
  1. "Bank of Calcutta, oldest bank of Asia never failed". 13 March 2020. Retrieved 27 August 2022.
  2. "List of 4 Banks in India Before Independence". Essays, Research Papers and Articles on Business Management (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-10. Retrieved 2022-08-27.
  3. "Bank of Calcutta - Google Arts & Culture". Google Arts & Culture (in ఫ్రెంచ్). Archived from the original on 2022-08-27. Retrieved 2022-08-27.