బ్యాంక్ ఆఫ్ బాంబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్యాంక్ ఆఫ్ బాంబే (Bank of Bombay) బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రెండవది, మిగిలినవి బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. బ్యాంక్ ఆఫ్ బాంబే 1840 ఏప్రిల్ 15న బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ చార్టర్ ప్రకారం స్థాపించబడింది. బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబై. బ్యాంక్ ఆఫ్ బాంబే వాణిజ్య బ్యాంకు చేసే కార్యకలాపాలతో పాటు, ఆ సమయంలో సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఎవరూ లేని కారణంగా బ్యాంక్ ఆఫ్ బాంబే ఆ విధులను కూడా నిర్వహించింది.

బ్యాంక్ ఆఫ్ బాంబే
పరిశ్రమబ్యాంకింగ్
ఆర్ధిక సేవలు
స్థాపన15 April 1840
Defunct27 January 1921
Fateవిలీనం బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్
Successorఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రధాన కార్యాలయం,
Areas served
బ్రిటీష్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ బాంబే, మరో రెండు ప్రెసిడెన్సీ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ విలీనం చేసి, పునర్వ్యవస్థీకరణ చేయబడిన బ్యాంకింగ్ సంస్థకు 1921 జనవరి 27 న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నామకరణం చేయబడింది. భారతదేశంలో కేంద్ర బ్యాంకింగ్ సంస్థగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 ఏప్రిల్ 30 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( భారతీయ స్టేట్ బ్యాంకు) పేరు మార్చబడింది[1].

చరిత్ర[మార్చు]

బ్యాంక్ ఆఫ్ బాంబే 1840 సంవత్సరం లో స్థాపించబడిన పాక్షిక ప్రభుత్వ బ్యాంకుగా, బొంబాయిలోని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి వడ్డీరేట్లను స్థిరీకరించడం, పరపతిని సమీకరించడం దీని ముఖ్యోద్దేశంగా,. యుద్ధాలు, కరువుల సమయంలో రుణాలు సేకరించడం, విపత్కర సమయాల్లో పనిచేసిందనేది ఈ బ్యాంకు ఒక విశిష్ట లక్షణం. బ్యాంక్ ఆఫ్ బాంబే క్లిష్టమైన వ్యాపార వాతావరణంలో నిలబడింది, ఉదాహరణకు పత్తి మిల్లుల వంటి తయారీ వ్యాపారాలకు నిధులు సమకూర్చింది. బ్యాంక్ ఆఫ్ బాంబే 1840 సంవత్సరం నుండి 1867 సంవత్సరాల అన్ని డాక్యుమెంట్స్ (పత్రాలు) నాశనం చేయబడ్డాయి, ఆ సమయంలో బ్యాంకు దివాళాకు కారణం అయినది . పత్రాలను ధ్వంసం దుండగులు చేయడం, వారి దుశ్చర్యలను దాచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. అయితే బొంబాయి ప్రభుత్వంతో కొన్ని రికార్డులు, సంభాషణల మార్పిడి, నోటీసులు వగైరా మహారాష్ట్ర స్టేట్ ఆర్కైవ్స్ లో లభ్యమయ్యాయి.[2]

సభ్యులు[మార్చు]

బ్యాంక్ ఆఫ్ బాంబే బోర్డు సభ్యులలో (డైరెక్టర్స్) చాలామ౦ది ప్రముఖ జాతీయవాదులు గా ఉన్నారు. బోర్డు డైరెక్టర్లలో ఒకరైన దిన్షా ఎడుల్జీ వాచా స్వాతంత్ర్యోద్యమంలో ఉండి, భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ఒకరు, బ్యాంక్ ఆఫ్ బాంబే వినియోగ దారుడు ఫిరోజ్షా మెహతా కూడా ఉన్నారు. 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( భారతీయ స్టేట్ బ్యాంకు) రూపాంతరం చెందింది. సెంట్రల్ డైరెక్టర్ బోర్డుగా దిన్షా ఎడుల్జీ వాచా నియమించిన తర్వాత, బ్యాంకింగ్ సేవలను భారతీయీకరించాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఆయనే[2].

నష్టాలు - దివాళా[మార్చు]

బొంబాయి ప్రత్తి వర్తకానికి ఎదుగుతున్న కేంద్రంగా, బ్రిటన్ కు అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నది. 1861 సంవత్సరంలో యు.ఎస్.లో అంతర్యుద్ధం ప్రారంభం కావడం వల్ల, ఆ కారణంగా ప్రత్తి సరఫరాను ప్రభావితం చేసింది, ఈ ప్రభావం ఇంగ్లాండ్ లో మాంద్యానికి దారితీసింది, దానిని లాంక్షైర్ కాటన్ కరువు అని పిలుస్తారు. బ్రిటన్ నష్టపోయినప్పటికీ, భారతదేశానికి మంచి సమయాన్ని సూచించింది. తూర్పు, ప్రాచ్య దేశాలకు ప్రత్తిని అత్యధికంగా సరఫరా చేసే దేశంగా ఆ సమయంలో ఆవిర్భవించింది. 1861లో 30 శాతం ఉన్న బ్రిటన్ ముడి పత్తి దిగుమతుల్లో భారతదేశం వాటా 1864 నాటికి 67 శాతానికి పెరిగింది. దీనితో బ్రిటిష్ వారి అవసరాలను తీర్చడానికి బొంబాయిలో అనేక పత్తి కంపెనీలు దుకాణాన్ని ఏర్పాటు చేశాయి, మూలధనానికి భారీ డిమాండ్ పెరిగింది, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందున, వ్యాపారం నుండి లాభాలు వృద్ధి చెందుతున్నందున బ్యాంక్ ఆఫ్ బాంబే వంటి బ్యాంకులు రైతులకు రుణాలు అధికమొత్తంలో ఇవ్వడం జరిగింది. ఈ రుణాలు పూచీకత్తుతో ఇవ్వక పోవడం, అప్పు తీసుకునే కంపెనీల వాటాలకు వ్యతిరేకంగా ఇవ్వబడ్డాయి. ఊహించిన విధంగా ఈ రుణాలలో చాలా వరకు తగినంత స్పెక్యులేషన్లో, ఈ కంపెనీల షేర్లు కూడా కొత్త గరిష్టాలను అధిరోహిస్తున్నాయి, అంటే వారు రుణాల కోసం పెద్ద సంఖ్యలను తాకట్టు పెట్టవచ్చు. 1862 సంవత్సరం లో, బ్రిటిష్ పార్లమెంటు కంపెనీల చట్టాన్ని ఆమోదించింది, ఈ చట్టం అన్ని విలీన సంస్థలకు పరిమిత బాధ్యతను విస్తరించింది. దీని అర్థం అప్పటి వరకు వారి అపరిమిత బాధ్యత కారణంగా అత్యంత జాగ్రత్తగా పనిచేయాల్సిన బ్యాంకులు, ఇప్పుడు వారి కఠినమైన రుణ నిబంధనలను సడలించే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. ఈ చట్టం ద్వారా ఆవిష్కరించబడిన "పరిమిత బాధ్యత ఉన్మాదం" భారతదేశంలోని బ్యాంకింగ్ రంగం పై ప్రభావం పడింది. 1865 సంవత్సరంలో, యు.ఎస్.లో అంతర్యుద్ధం ముగిసి, ఆ దేశం పత్తి సరఫరాలను తిరిగి ప్రారంభించింది. అకస్మాత్తుగా ఐరోపాకు ఎగుమతి చేయడానికి కావలసిన సరుకు డిమాండ్ రావడం జరిగింది. 1866 సంవత్సరంలో సంభవించిన కరువుతో భారతదేశంలో చాలా మంది పత్తి రైతులు ఆహార ధాన్యాలను పండించడానికి దారితీసింది. బొంబాయిలో ఆవిర్భవించిన అనేక పత్తి కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని,. వాటి షేర్లు నష్టపోవడం జరిగి ,వారిలో చాలా మంది బ్యాంకులతో సహా వారి రుణదాతలను వదిలి లిక్విడేషన్ లోకి వెళ్ళడం జరిగింది. మార్కెట్ దెబ్బతిన్న తరువాత కూడా అసంబద్ధమైన బ్యాంకింగ్ విధానాలను అవలంభిస్తూ, రుణాలు ఇవ్వడం కొనసాగిన బ్యాంక్ ఆఫ్ బాంబే ఆ మాంద్యం భరించి, చివరకు దివాళాకు దారితీసి, 1868 సంవత్సరంలో బ్యాంక్ లిక్విడేషన్ కు దారి తీసింది. ఆ సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బొంబాయి స్థాపించబడింది.[3]

మూలాలు[మార్చు]

  1. Apr 17, Vijay Singh /; 2017; Ist, 21:11. "SBI goes down memory lane with Bank of Bombay heritage gallery | Mumbai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 arZan. "Untold story of Bank of Bombay". Parsi Khabar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  3. "Backstory: The collapse of Presidency Bank of Bombay in 1868". cnbctv18.com (in ఇంగ్లీష్). 2022-02-07. Retrieved 2022-08-19.