స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్‌బిఐ లోగో

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన అనుబంధ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (State Bank of Patiala) ఒకటి. దీని ప్రారంభ నామం పాటియాలా స్టేట్ బ్యాంక్. దీని 1917, నవంబర్ 17 న స్థాపించారు. ఈ బ్యాంకు స్థాపించినది భూపిందర్ సింగ్. ఇతను స్వాతంత్ర్యానికి పూర్వం సంస్థానాలలో ఒకటైన పాటియాలా సంస్థానపు మహారాజు. ఆ కాలంలో మామూలు బ్యాంకుగానే కాకుండా పాటియాలా రాజ్యపు కేంద్ర బ్యాంకుగా కూడా విధులను నిర్వహించేది.

స్వాతంత్ర్యం అనంతరం పాటియాలా బ్యాంకు పంజాబ్ ప్రభుత్వపు అనుబంధంగా మారినది. 1960, ఏప్రిల్ 1 న ఇది స్టేట్ బ్యాంక్ గ్రూపులో భాగమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 750కి పైగా బ్రాంచీలు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఈ బ్యాంకు బ్రాంచీలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర స్టేట్ బ్యాంకు అనుబంధ బ్యాంకుల మాదిరిగానే ఈ బ్యాంకు కూడా స్టేట్ బ్యాంకు గ్రూపునకు సంబంధించిన లోగోనే ఉపయోగిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]