Jump to content

గుడివాడ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
గుడివాడ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
ప్రధాన కార్యాలయంగుడివాడ
మండలాల సంఖ్య9

గుడివాడ రెవెన్యూ డివిజను, కృష్ణాజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 9 మండలాలు ఉన్నాయి.గుడివాడ నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

పరిపాలన

[మార్చు]

గుడివాడ రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలన పరిధిలో 9 మండలాలు ఉన్నాయి.గుడివాడ పట్ణణం డివిజను కేంద్రంగా ఉంది.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజినల్ అధికారి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉంటాడు.ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరిస్తాడు.[1]

రెవెన్యూ డివిజను లోని మండలాలు

[మార్చు]
  1. గుడివాడ మండలం
  2. గుడ్లవల్లేరు మండలం
  3. కైకలూరు మండలం
  4. కలిదిండి మండలం
  5. మండవిల్లి మండలం
  6. ముదినేపల్లి మండలం
  7. నందివాడ మండలం
  8. పామర్రు మండలం
  9. పెదపారుపూడి మండలం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Krishna District Mandals" (PDF). Census of India. pp. 523–532. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]