Jump to content

మైలవరం (ఎన్టీఆర్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 16°45′24.192″N 80°38′29.256″E / 16.75672000°N 80.64146000°E / 16.75672000; 80.64146000
వికీపీడియా నుండి
మైలవరం (ఎన్టీఆర్ జిల్లా)
మైలవరం వద్ద పంటపోలాలు
మైలవరం వద్ద పంటపోలాలు
పటం
మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) is located in ఆంధ్రప్రదేశ్
మైలవరం (ఎన్టీఆర్ జిల్లా)
మైలవరం (ఎన్టీఆర్ జిల్లా)
అక్షాంశ రేఖాంశాలు: 16°45′24.192″N 80°38′29.256″E / 16.75672000°N 80.64146000°E / 16.75672000; 80.64146000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్
మండలంమైలవరం
విస్తీర్ణం14.57 కి.మీ2 (5.63 చ. మై)
జనాభా
 (2011)
21,763
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు10,796
 • స్త్రీలు10,967
 • లింగ నిష్పత్తి1,016
 • నివాసాలు5,669
ప్రాంతపు కోడ్+91 ( 08865 Edit this on Wikidata )
పిన్‌కోడ్521230
2011 జనగణన కోడ్588931

మైలవరం ఎన్టీఆర్ జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. బుడమేరు (కృష్ణా జిల్లాలో గల ఒక నది) మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నదిని విజయవాడ దుఖః దాయినిగా చెప్పవచ్చు. ఈ నది వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద డ్యాం నిర్మించారు. ఈ డ్యాం నుండి ఒక కాలువను నిర్మించారు. ఈ కాలువ బుడమేరు డైవర్సన్ ఛానల్ (బిడిసి) గా పిలువబడుతుంది. ఈ కాలువ వెలగలేరు నుండి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానదిపై ప్రవాహం నకు కలుపబడుతుంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5669 ఇళ్లతో, 21763 జనాభాతో 1457 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10796, ఆడవారి సంఖ్య 10967. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3083 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 889. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588931. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[2] [3]

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 65 మీ ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

పుల్లూరు 4 కి.మీ, తోలుకోడు 7 కి.మీ, వెల్వడం 8 కి.మీ గణపవరం 11 కి.మీ, నగులూరు (నాగులూరు) 11 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మైలవరంలో తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) సౌకర్యం ఉంది. ఉప తపాలా కార్యాలయము సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మైలవరం ఉప తపాలా కార్యాలయము విజయవాడ తపాలా విభాగం పరిధిలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మైలవరం నుండి విజయవాడ-జగదల్ పూర్ (ఛత్తీస్ ఘడ్ ) లను కలిపే జాతీయ రహదారి సౌకర్యం ఉంది. రైల్వేస్టేషను; రామవరప్పాడు, సత్యన్నారాయణ పురం, విజయవాడ 25 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 10, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

  • లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
  • వేములూరి వెంకటరత్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల:- ఈ కళాశాల 37వ వార్షికోత్సవం, 2014, నవంబరు-8న కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.
  • వి.వి.ఆర్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
  • జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల భవనాన్ని 1979లో నిర్మించారు. నూతన భవన నిర్మాణం అవస్యం.
  • వివేకానంద ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల, జిల్లాలో ఉత్తమ పాఠశాల పురస్కారానికి ఎంపికైనది. ఈ పాఠశాలలో, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో, గత 8 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధించడమేగాక, 3 సంవత్సరాల నుండి వరుసగా 10 జి.పి.యే. సాధించినందువలన, ఈ పురస్కారానికి ఎంపికైనది. 2015,సెప్టెంబరు-5వ తెదీనాడు, గురుపూజోత్సవం సందర్భంగా, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.వి.శ్రీనివాసరావు, ఈ పురస్కారాన్ని, కృష్ణా జిల్లా పాలనధికారి బాబు.ఏ, జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావుల చేతులమీదుగా అందుకున్నారు.
  • లీలావతి ప్రాథమికోన్నత పాఠశాల.
  • స్థానిక తారకరామనగర్ లోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  • శాఖా గ్రంథాలయం.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మైలవరంలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 16 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఆరుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 9 మందుల దుకాణాలు ఉన్నాయి.

బ్యాంకులు

[మార్చు]
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు:- మైలవరం గ్రామములో ఈ బ్యాంకుశాఖను 2010,సెప్టెంబరు-28వ తేదీనాడు ప్రారంభించారు.
  • సప్తగిరి గ్రామీణ బ్యాంక్:- స్థానిక నూజివీడు రహదారిలోని శ్రీ రామాలయం వద్ద ఈ బ్యాంక్ శాఖ కార్యాలయాన్ని, 2015,సెప్టెంబరు-30వ తేదీనాడు లాంఛనంగా ప్రారంభించారు.

తపాలా కార్యాలయం

[మార్చు]

ఈ గ్రామంలోని తపాలా కార్యాలయం, 1930, మార్చి-29న బ్రాంచి పోస్టాఫీసుగా ప్రారంభమైంది. ఈ కార్యాలయ 84వ వార్షికోత్సవాలు, 2014,మార్చి-29, శనివారం నాడు జరిగాయి. 1950లో సబ్-పోస్టాఫీసుగానూ, పలు రకాల రూపాంతరాల అనంతరం, ప్రస్తుతం, ఏ-క్లాస్ సబ్-పోస్టాఫీసుగా ఉంది. ఈ కార్యాలయ పరిధిలో 13 బ్రాంచ్ పోస్టాఫీసులుండగా, 30 గ్రామాలకు సేవలందిస్తున్నారు. దీని పరిధిలోని పుల్లూరు బ్రాంచ్ పోస్టాఫీసు, వ్యాపార లావాదేవీలలో, రాష్ట్రంలోనే ప్రథమస్థానములో ఉంది. త్వరలో పోస్టాఫీసు బ్యాంకింగ్ విధానం గూడా రానున్నది. శాతవాహనుల కాలంలో, కొండపల్లి నుండి ఇక్కడకు టపా వచ్చేది.

రైతు శిక్షణా కేంద్రం

[మార్చు]

మైలవరంలోని ఎన్.ఎస్.సి కాలనీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ఈ కేంద్రం భవనానికి, 2017,ఆగష్టు-8న శంకుస్థాపన నిర్వహించెదరు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పరిపాలన

[మార్చు]

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

పూర్తి వ్యాసం మైలవరం శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామం ఒక మేజరు పంచాయతీ, ఒక నియోజకవర్గ కేంద్రం. 2006లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఓర్సు హేమలత 500 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందింది. 18 వార్డులలో 11 వార్డులు ప్రతిపక్షం గెలుచుకోవటంతో, కొన్ని కారాణాలవలన 2008 జనవరి 31 నాడు ఈమెను, కలెక్టరు పదవి నుండి తొలగించారు. అప్పటి వరకూ ఉప సర్పంచిగా ఉన్న జూలూరి రాధాకృష్ణమూర్తిని ఇన్-ఛార్జ్ సర్పంచిగా నియమించారు. ఈ వ్యవహారం కోర్టుకెక్కటంతో, కేసు పరిష్కారం గాక, సర్పంచుల పదవీ కాలం ముగిసేదాకా ఉపసర్పంచే, సర్పంచి పదవిలో కొనసాగారు. ఆ రకంగా ఎన్నికలలో గెలిచిన సర్పంచి 17 నెలలు పాలించాడు
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో నందేటి కృష్ణవేణి సర్పంచిగా గెలుపొందింది. ఉపసర్పంచిగా షేక్ షహానబేగం ఎన్నికైనాడు.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ కోట మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక కోట వెనుకన ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు శ్రావణమాసం సందర్భంగా, జలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన మహిళలు, బిందెలతో నీటిని తెచ్చి, పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని పూలతో అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, అభిషేకాలు నిర్వహించారు.
  • శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-18, సోమవారం నాడు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించెదరు.
  • శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం ద్వారకా తిరుమల దత్తత దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిరవ్హించెదరు.
  • శ్రీ కంచి కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం, ద్వారకాతిరుమల దేవాలయానికి దత్త దేవాలయ. ఈ దేవాలయ పునర్నిర్మాణం పూర్తి అయినది. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2016, మార్చ్-9వ తెదీబుధవారం నుండి ప్రారంభమగును. పునఃప్రతిష్ఠ రోజున 20 వేలమందికి పైగా భక్తులకు అహా అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. సుదీర్ఘకాలం క్రితం నిర్మించిన ఆలయం కావడంతో, ఇబ్బందులు మొదలగుటచో, తన స్వంతస్థలం 400 గజాలను అదనంగా కలిపి మరీ ఈ ఆలయ పునర్నిర్మాణం చేసినట్లు ద్వారకా తిరుమల ఆలయ ఛైర్మన్ శ్రీ ఎస్.వి.సుధాకరరావు తెలిపినారు. ఈ పునర్నిర్మాణానికి ఆలయ నిధులు, విరాళాలు, మిగిలిన వ్యయం ద్వారకా తిరుమల దేవస్థానం అందజేసినది. మొత్తం 4 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో, ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది.
  • శ్రీరామాలయం:- ఈ ఆలయం స్థానిక నూజివీడు రహదారిపై ఉంది.
  • శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక నూజివీడు రహదారిపై ఉన్న ఈ ఆలయం, ద్వారకాతిరుమల దేవాలయానికి దత్తత దేవాలయం. ప్రతి సంవతరం ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఆలయంలో గత 23 సంవత్సరాలుగా హనుమద్దీక్షాధారణ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించుచున్నారు. 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు, 8 మండలాల నుండి వచ్చిన భక్తులు దీక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  • శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక రామకృష్ణ కాలనీలో ఉన్నది. ఈ ఆలయంలో 2017,జూన్-17వతేదీ శనివారంనాడు స్వామివారి జన్మదినం సందర్భంగా, ఉదయం నుండియే ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మద్యాహ్నంనుండి, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు.
  • శ్రీ లక్ష్మీగణపతి ఆలయం:- స్థానిక నూజివీడు రహదారిపై ఉన్న ఈ ఆలయంలో నిర్వహించుచున్న మహాయజ్ఞంలో భాగంగా, 2016, ఫిబ్రవరి-29వ తేదీ సోమవారంనాడు, శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. రామాలయంవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపం వద్ద, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, మూర్తి హోమం, మహా పూర్ణాహుతి, అనంతరం కళ్యాణం నిర్వహించారు. సుదీర్ఘంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద యెత్తున పాల్గొని స్వామివార్ని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మైలవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 289 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 20 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 34 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 17 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 61 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 3 హెక్టార్లు
  • బంజరు భూమి: 310 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 719 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 905 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 127 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మైలవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 56 హెక్టార్లు
  • చెరువులు: 70 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మైలవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

మామిడి, ప్రత్తి, వరి, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బ్రాస్ ఉత్పత్తి, బియ్యం

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]