పోస్టాఫీసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోస్టాఫీసు

పోస్టాఫీసు, భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగం. ప్రజలకు సంబంధించిన సర్వీసులు అన్నీ వీటి ద్వారానే నడుస్తున్నాయి.

రిజిస్త్రేషన్‌ స్టాంపు పేపర్లు[మార్చు]

పోస్టాఫీసులలో రిజ్రిస్టేషన్‌ స్టాంపు పేపర్లను విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.స్టాంపు పేపర్లు ఇప్పుడు రిజ్రిస్టార్ల కార్యాలయంలో లభ్యమవుతున్నాయి. కొందరు లైసెన్సుదారులు బయట స్టాంపు పేపర్లు విక్రయిస్తున్నారు. స్టాంపు పేపర్ల విక్రయదారులలో బినామీలు కూడా ఉంటున్నట్లు సమాచారం. కొందరు స్టాంపు పేపర్ల అసలు ధర కంటే ఎక్కువగా తీసుకుని వినియోగదారుల మోసగిస్తున్నారు.వీరిపై మాత్రం ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. గతంలో కొంతమంది ఆరోపణలు వచ్చినా యధావిధిగా వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటువంటి వ్యాపారానికి తెరదించడానికి పోస్టాఫీసుల్లో స్టాంపు పేపర్లను విక్రయించాలని సంకల్పించారు. పోస్టాఫీసులలో స్టాంపుపేపరు ధర ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేసే అవకాశం లేదు.

సరుకు రవాణా[మార్చు]

ఇప్పటి వరకు లాజిస్టిక్‌ పోస్ట్‌ ద్వారా తక్కువ బరువు గల సరుకును మాత్రమే రవాణా చేసే వారు. ఇప్పుడు 500 కిలోల నుంచి ఆపై బరువున్న సరుకును కూడా పోస్టల్‌ వ్యాన్‌ ద్వారా పూర్తి గ్యారంటీ విధానంలో రవాణా చేస్తున్నారు.ట్రాన్స్‌పోర్టు కంపెనీలు సరుకు రవాణాకు తీసుకునే రేటు కంటే పోస్టల్‌ వ్యాన్‌ ద్వారా రేటు తక్కువ.

లింకులు[మార్చు]