భారతీయ తపాలా వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ తపాలా వ్యవస్థ
తరహాభారత ప్రభుత్వ సంస్థ
స్థాపన1764
ప్రధానకేంద్రము
కీలక వ్యక్తులుI.M.G. ఖాన్, సెక్రటరీ, తపాలా
ఉద్యోగులు520191 (2007)[1]
వెబ్ సైటుwww.indiapost.gov.in

భారతీయ తపాలా లేదా భారతీయ తపాలా వ్యవస్థ (ఇండియా పోస్ట్) ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఇది 155,333 పోస్టాఫీసులతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాలా వ్యవస్థ (చైనా 57,000 రెండవ స్థానం). దీని విస్తృతమైన శాఖలతో తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల మాదిరి సర్వీసులు కూడా అందిస్తుంది.

చరిత్ర[మార్చు]

మైసూరులో పోస్టాఫీసు

ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై, కోల్కతా 1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు.

1839లో, North West Province సర్కిల్ ఏర్పాటయింది. 1860లో పంజాబ్ సర్కిల్, 1861లో బర్మా సర్కిల్, 1866లో సెంట్రల్ సర్కిల్, 1869లో సింద్ సర్కిల్ ఏర్పాటయినవి. తరువాత సర్కిల్స్ అవధ్ (1870), రాజ్ పుట్ (1871), అస్సాం (1873), బీహార్ (1877), తూర్పు బెంబాల్ (1878) and Central India (1879) లో ఏర్పడ్డాయి. 1914 సంవత్సరం కల్లా మొత్తం పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి.[2]

తపాలా బిళ్ళలు 1 జూలై 1852లో సింధ్ జిల్లాలో మొదలయ్యాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించేది; కానీ అమ్మేవారు కాదు. అన్ని తపాలా బిళ్ళలు కలకత్తాలో ముద్రించబడేవి; అన్నీ కూడా విక్టోరియా మహారాణి బొమ్మతోనే విడుదల అయేవి.

తపాలా వ్యవస్థ[మార్చు]

తపాలా వ్యవస్థ భారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ' తపాలా సర్వీస్ బోర్డు' అధినంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 23 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేయబడింది.

ఇతర సర్వీసులు[మార్చు]

పోస్టాఫీసులలో తపాలా సర్వీసులు కాకుండా, ఆర్థిక లావాదేవీలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా బ్యాంకులు లేని మారుమూల పల్లెలలో కేంద్రీకరించబడ్డాయి.

  • Public Provident నిధి
  • జాతీయ పొదుపు Certificate
  • కిసాన్ వికాస్ పత్రం
  • పొదుపు ఖాతా
  • నెలసరి ఆదాయ పధకము Monthly Income Scheme Archived 2008-03-15 at the Wayback Machine
  • Recurring పొదుపు ఖాతా
  • తపాలా పెట్టెలు

మూలాలు[మార్చు]

  1. "Indiapost - Actual staff strength official Indian Post website". Archived from the original on 2008-02-29. Retrieved 2008-03-27.
  2. Bayanwala, A.K. "Indian Postal History: 1947-1997". Stamps of India, New Delhi, India. Archived from the original on 2015-01-01. Retrieved 2006-05-23.

బయటి లింకులు[మార్చు]