శ్రీకాకుళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

  ?శ్రీకాకుళం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
మారుపేరు: చిక్కోలు
శ్రీకాకుళంలొ నాగావళి నది
శ్రీకాకుళంలొ నాగావళి నది
అక్షాంశరేఖాంశాలు: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 20.89 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా(లు) శ్రీకాకుళం జిల్లా
జనాభా
జనసాంద్రత
1,25,939[2] (2011 నాటికి)
• 6,029/కి.మీ² (15,615/చ.మై)
భాష(లు) తెలుగు
ప్రణాళికా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము
పురపాలక సంఘం విజయనగరం నగరపాలక సంస్థ
కోడులు
పిన్‌కోడు

• 532 001
వెబ్‌సైటు: http://cdma.ap.gov.in/SRIKAKULAM/


శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రము.[3] ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.[4]

శబ్ద ఉత్పత్తి శాస్త్రం[మార్చు]

ఈ నగరాన్ని భారత స్వాతంత్ర్యానికి ముందు సిక్కోలు అని పిలిచేవారు.[4]

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 125,939. ఇందులో 62,546 మగవారు, 63,393 ఆడవారు ఉన్నారు.[2] 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.[5]

పౌర పరిపాలనన[మార్చు]

పురపాలక సంఘ పూర్వపు అధ్యక్షులు

శ్రీకాకుళం పురపాలక సంఘము 1856 లో స్థాపించారు.[1] సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి ఇప్పటివరకు (13-12-2007) క్రమముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము 1 లక్షా 17 వేల జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది . ఈ పురపాలక సంఘ నగరపాలక సంస్థగా మార్పు చెందింది.

పురపాలక సంఘ అధ్యక్షులు[మార్చు]

 1. 1905 - 1911 : టి.వి.శివరావుపంతులు
 2. 1912 - 1915 : ఎస్.ఆదినారాయణరావు
 3. 1915 - 1918 : డి.శంకరశాస్త్రులు
 4. 1918 - 1921 : ఎం.రెడ్డిపంతులు
 5. 1921 - 1926 : చట్టి పూర్ణయ్యపంతులు
 6. 1926 - 1927 : ఎమ్.వి.కామయ్యశెట్టి
 7. 1927 - 1929 : చట్టి పూర్ణయ్యపంతులు
 8. 1929 - 1931 : హెచ్.సూర్యనారాయణ
 9. 1931 - 1938 : ఎం.వి.రంగనాథం
 10. 1938 - 1942 : చల్లా నరశింహనాయుడు
 11. 1946 - 1949 : బి.వి.రమణ శెట్టి
 12. 1949 - 1952 : గైనేటి.వెంకటరావు
 13. 1952 - 1956 : ఇప్పిలి.లక్ష్మినారాయణ
 14. 1956 - 1961 : పసగాడ సూర్యనారాయణ
 15. 1962 - 1963 : మాటూరు.రామారావు
 16. 1963 - 1964 : ఎల్.సూర్యలింగం
 17. 1967 - 1970 : ఎమ్.ఎ.రవూఫ్
 18. 1970 - 1972 : ఇప్పిలి వెంకటరావు
 19. 1981 - 1992 : అంధవరపు వరహానరసింహం
 20. 1995 - 2000 : దూడ భవానీ శంకర్
 21. 2000 - 2005 : పైదిశెట్టి జయంతి
 22. 2005 - 2010 : ఎం.వి.పద్మావతి

వైద్యము[మార్చు]

 • జిల్లా కేంద్ర ఆసుపత్రి 400 పడకలతో ఉంది.
 • జిల్లాకి ఒక మెడికల్ కాలేజి (RIMS) పట్టణంలో ఉంది.
 • జిల్లా లోగల ఒక దంత వైద్యకళాశాల పట్టణం సమీప ంలోని "చాపురం" గ్రామం వద్ద ఉంది.
 • పట్టణంలో ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి.
 • పట్టణంలో 5 హెల్త్ సెంటర్లలో 1 పురపాలకసంఘం, 4 స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి .
 • ఇవి కాక అనేక ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి.
 • శ్రీకాకుళం పట్టణానికి 3 కి.మీ దూరంలోని రాగోలు వద్ద జెమ్స్ వైద్య కళాశాల ఉంది.
 • శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి నది ప్రక్కన కిమ్స్ ఆసుపత్రి ఉంది.

శ్రీకాకుళం రక్తనిథి

2006 శ్రీకాకుళంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైనది.

న్యాయము[మార్చు]

జిల్లాలో ఉన్న మొత్తము 19 న్యాయస్థానాలలో ఇక్కడ 1.జిల్లాకోర్టు, 2.మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పట్నంలో సుమారు 75 వరకు న్యాయవాదులున్నారు. రాజకీయంలో ఉన్నులంతా సుమారు న్యాయవాదులే. పట్నంలో ఒక న్యాయ కళాశాల ఉంది.

రవాణా[మార్చు]

శ్రీకాకుళం బస్ స్టాండు

శ్రీకాకుళం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు స్టేషను ఉంది. ఇందులో రెండు డిపోలు ఉన్నవి. జిల్లా కేంద్రం నుండి వివిధ నగరాలకు, ప్రాంతాలకు బస్సు సదుపాయం ఉంది.

శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషను[మార్చు]

శ్రీకాకుళం పట్నానికి రైల్వే స్టేషను లేదు .13 కి.మీ దూరములో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆమదాలవలసలో ఉంది. 2006 లో రెజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రము శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆఫీసు ఆవరణలో పెట్టారు. ఇది ప్రజలకు చాలా సదుపాయముగా ఉంది.

ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు[మార్చు]

అరసవల్లి దేవాలయ ప్రధాన ద్వారము
బలగలోని ఉత్తరేశ్వర దేవాలయంలోని విగ్రహం
 1. ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము - గుడి వీధి
 2. శ్రీ సుహ్మణ్యస్వామి ఆలయము - గుడి వీధి
 3. సంతోషిమాత ఆలయం - పాత శ్రీకాకుళం
 4. వెంకటేశ్వర ఆలయం (నారాయణ తిరుమల) - గుజరాతీపేట
 5. కోదండ రామస్వామి ఆలయం - కృష్ణా పార్కు
 6. అయ్యప్ప స్వామి ఆలయం - ఆదివారం పేట
 7. జమియా మసీదు - జి.టి.రోడ్
 8. శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం - అరసవిల్లి
 9. సాయిబాబా ఆలయం - విశాఖ బి.కాలనీ
 10. శివ బాలాజీ దేవాలయం - విశాఖ ఎ కాలనీ
 11. రాఘవేంద్ర స్వామి ఆలయం - ఆదివారం పేట
 12. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల - గుజరాతీపేట
 13. శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం - బలగ
 14. సాయిబాబా దేవాలయం - బొందిలీపురం

శ్రీకాకుళం లో పార్కులు[మార్చు]

బాపూజీ పార్కు
 • గాంధీ పార్కు, పాలకొండ రోడ్
 • శాంతినగర్ పార్కు, శాంతినగర్,
 • రివర్ వ్యూ పార్క్, గుడివీధి.
 • ఇందిరా గాంధీ పార్కు, గూనపాలెం
 • హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్, పాత శ్రీకాకుళం
 • చిన్న బరాటం వీధి పార్కు,
 • PSN కాలనీ పార్కు,
 • హడ్కో కాలనీ పార్కు
 • డైమండ్ పార్క్, న్యూ కాలనీ
 • LBS పార్కు, ఎల్.బి.యస్. కాలనీ
 • విజయాదిత్య పార్కు, సీపన్నాయుడు పేట,
 • కార్గిల్ విక్టరీ పార్క్, ఎ.పి.హె.బి.కాలనీ

శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య వ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 29 నవంబర్ 2014. Retrieved 16 February 2015.
 2. 2.0 2.1 "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
 3. "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 27. Retrieved 18 January 2015.
 4. 4.0 4.1 "Srikakulam Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration and Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 2 డిసెంబర్ 2014. Retrieved 16 February 2015.
 5. "Srikakulam City Population Census 2011 - Andhra Pradesh". Archived from the original on 2016-04-05. Retrieved 2016-07-02.

బయటి లింకులు[మార్చు]