మందస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం మండలానికి సంబంధించినది. గ్రామ వ్యాసం కొరకు మందస (గ్రామం) చూడండి. మండల ముఖ్యకేంద్రం మందస.మందస చారిత్రక పట్టణం.ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం,రాజా వారి కోట,ప్రక్కనే ఉన్న చిట్టడవి,అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి. (క్రిందన ఉన్న మందస లింకులో వివరాలు చూడగలరు).మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే పాండవులు చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల వాసుదేవ ఆలయంలో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.

మందస, శ్రీకాకుళం జిల్లా, మందస మండల కేంద్రము. .[1] సుమారు 15000 జనాభా కల ఈ గ్రామము మేజరు పంచాయితీ.గ్రామంలో 33 వీధులు ఉన్నాయి.ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష.మంజూషమంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్థం.అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామల మైన ఈ ప్రాంతం 800 ఏళ్ళ నుండి మందస సంస్థానానికి ముఖ్య పట్టణం.ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నాయి.గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం, జగన్నాధస్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, చండేశ్వరాలయం, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.ప్రసిద్ధ మహేంద్ర గిరి యాత్ర ప్రతి శివరాత్రికి ఇక్కడినుంచే ప్రారంభం అవుతుంది.

మందసలోని వాసుదేవ పెరుమాళ్ దేవాలయం.

బయటి లింకులు[మార్చు]


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=మందస&oldid=2736003" నుండి వెలికితీశారు