పొందూరు
Ponduru | |
---|---|
![]() Weaving at Ponduru | |
Country | India |
State | Andhra Pradesh |
District | Srikakulam |
Area | |
• Total | 11.07 km2 (4.27 sq mi) |
Population (2011) | |
• Total | 12,640 |
• Density | 1,100/km2 (3,000/sq mi) |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 532 168 |
Telephone code | +91–8941 |
Vehicle Registration | AP30 (Former) AP39 (from 30 January 2019)[2] |
పొందూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం. పొందూరు శ్రీకాకుళంకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు. పొందూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేలో హౌరా, చెన్నై మార్గంలో ఉంది. ఇచ్చట కంప్యూటరీకరణ కలిగిన ఉప తపాలా కార్యాలయం ఉంది. పొందూరుకు 7 కి.మీ దూరంలో బాలయోగీశ్వరస్వామి ఆశ్రమం ప్రసిద్ధి చెందింది.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పొందూరు పట్టణంలో మొత్తం జనాభా 12,640, అందులో 6,111 మంది పురుషులు కాగా, 6,529 మంది స్త్రీలు ఉన్నారు.[3]
పొందూరు ఖద్దరు[మార్చు]
పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఒకవిధమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి దానిని రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఈ దారాలనుపయోగించి మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. మహాత్మా గాంధీ కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. పొందూరు ఖాదీ దేశమంతటా ఖాదీ బట్టలు వేసుకునే వారికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు ముఖ్యమైనవి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాల తోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆధారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు ఉన్నారు. అమెరికా, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరుగుతాయి.
మాజీ స్వాతంత్ర్య సమరయోధుడు చౌదరి సత్యనారాయణ 1942లో దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మాగాంధీకి పొందూరు ఖాదీతో తయారు చేసిన ధోతిని బహుమతిగా ఇచ్చారు. గాంధీ ఇక్కడ ఉత్పత్తి చేయబడిన ఖాదీ సొగసుకు ముగ్ధులయ్యారు.[4]ఈ ప్రదేశంలో ఖాదీ వస్త్రాల తయారీలో అనుసరించిన విధానం అధ్యయనం చేయడానికి గాంధీ, తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు.
ప్రముఖులు[మార్చు]
- ఘండికోట బ్రహ్మాజీరావు - ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త.
- పమ్మిన రమాదేవి - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత - 2016
- వి.కృష్ణదాసు - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత
- పమ్మిన కూర్మారావు - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత
- ఎచ్చిన గోపాలరావు - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత - 2007
చిత్రమాలిక[మార్చు]
పొందూరులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు, ఖద్దరు నేత దృశ్య చిత్రాలు
-
ఉపరాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ద్వారా అవార్డు స్వీకరిస్తున్న పమ్మిన కూర్మారావు
-
భారత రాష్ట్రపతి డా.శంకర్ దయాళ్ శర్మ ద్వారా అవార్డు స్వీకరిస్తున్న వి.కృష్ణదాసు
-
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ద్వారా జాతీయ అవార్డు స్వీకరిస్తున్న గోపాలరావు
-
2016 సెప్టెంబరు 5 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పమ్మిన రమాదేవి.
-
పొందూరులో ఖద్దరు నేస్తున్న దృశ్యం.
-
పొందూరులో నేసిన ఖద్దరు పంచె
-
చేనేత విధానం
మూలాలు[మార్చు]
- ↑ "District Census Handbook - Srikakulam" (PDF). Census of India. pp. 26–28, 54. Retrieved 11 January 2016.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/2811_PART_A_DCHB_SRIKAKULAM.pdf[bare URL PDF]
- ↑ Rao, K. Srinivasa (7 May 2011). "Ponduru khadi may become extinct". The Hindu.
బయటి లింకులు[మార్చు]

- All articles with bare URLs for citations
- Articles with bare URLs for citations from March 2022
- Articles with PDF format bare URLs for citations
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Commons category link is on Wikidata
- పొందూరు మండలంలోని గ్రామాలు
- శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రాలు
- శ్రీకాకుళం జిల్లా పట్టణాలు