ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
పురుషోత్తమపురం- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రం[మార్చు]
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళే, ఒడిస్సానుండి వచ్చే సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
ప్రయాణికుల రవాణా సౌకర్యం[మార్చు]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి రామచంద్రపురము, కాకినాడ, విశాఖ పట్టణం, రాజమండ్రిలకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి. ఇచ్చాపురములో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు, ప్యాసింజరు రైల్లు ఆగును.
వైద్యసౌకర్యం[మార్చు]
- పడకలున్న ప్రభుత్వవైద్యశాలవున్నది.
- రెండు ప్రవేట్ వైద్యశాలలున్నాయి. (ఒకటి త్రినాథ్ రెడ్ది ఆసుపత్రి)
- మెరుగైన వైద్యసేవలకై 60కి.మీ.దూరంలో పలాస కు, 125 కి.మీ.దూరంలోవున్న శ్రీకాకుళం వెళ్ళవలెను.లేదా బరంపురము వెళ్లవలెను.
విద్య[మార్చు]
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల
- నగరసంస్ధ ఉన్నతపాఠశాల
- ప్రభుత్వజూనియరు కళాశాల
- ప్రభుత్వడిగ్రి కాలేజి
- జ్ఞానభారతి ఇంగ్లిషు మిడియం స్కూలు
- శాంతినికేతన్ ఇంగ్లీసు మిడియం స్కూలు.
- ఒరియా పాఠశాల
- బోర్డుస్కూలు.
ప్రచార కేంద్రం[మార్చు]
- దూరవాణి రిలే కేంద్రము ఉంది.
- టెలిఫోన్ ఆఫిసు ఉంది.
ప్రార్ధానా మందిరాలు[మార్చు]
- నర్మదేశ్వరస్వామి ఆలయము
- జగన్నాధస్వామి ఆలయము
- స్వేచ్ఛావతి అమ్మవారిగుడి
- మసిదు
- శివాలయం,, దుర్గాదేవి గుడుల సముదాయము.
పాదయాత్ర జ్ఞాపిక స్తూపం[మార్చు]
స్వర్గీయ డా.Y.S. రాజశేఖరరెడ్డిగారు కాంగ్రెసు ప్రతిపక్షసభ్యుడుగా వున్నప్పుడు, 2003 లో రంగారెడ్డిజిల్లాలో చెవెళ్ళ నుండి, ఏప్రిల్ 9 వతేదిన పాదయాత్ర ప్రారంభించి, 68 రోజులు, 1470 కి.మీ నడచి ఇచ్చాపురంలో తన పాదయాత్రముగించిన చోట, ప్రజాప్రస్ధాన విజయవాటికలో ఒక జ్ఞాపిక స్తూపాన్ని నిర్మించారు.
బ్యాంకులు[మార్చు]
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
- ఆంధ్రబ్యాంక్
వసతి గృహాలు[మార్చు]
- సూర్యాలాడ్జి:మెయిన్ రోడ్డులో బరంపురంవెళ్ళువైపు ఉంది.
- మరో లాడ్జి శ్రీరామా లాడ్జి: పాత బస్టాండుకు దగ్గరలో ఉంది.
సినిమాథియెటరులు -ఇతరాలు[మార్చు]
- ఒక్కప్పుడు 3 సినిమా థియెటరులుండేవి.ప్రస్తుతం మూడింటిని మూసివేశారు.
- నగర సంస్ధవారి పార్కు ఉంది.
- హెడ్ పొస్టాఫిసు ఉంది.
- సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
ప్రజలజీవన విధానం[మార్చు]
ఈ పట్టణానికి సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు తెలుగు, ఒరియా రెండుభాషలు మాట్లాడుతారు.భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది లని పిలుస్తారు.
మండలంలోని పట్టణాలు[మార్చు]
- ఇచ్చాపురం
పట్నం జనాభా : 32662. వార్డులు : 23
ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గం[మార్చు]
- పూర్తి వ్యాసం ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గము . ఇక్కడ 1, 30, 708 ఓటర్లు ఉన్నారు. (2001 సెన్సెస్స్ )
శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం[మార్చు]
ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్ధికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.
స్వేచ్చావతి అమ్మవారు[మార్చు]
ఇక్కడ ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేస్తారు
పీర్లకొండ[మార్చు]
హిందూ-ముస్లింల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-ఒడిషా ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో గంధకం, పొటాష్ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు ఒడిషాలోని భువనేశ్వర్, ఇటు ఆంధ్రాలోని విశాఖపట్నం వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-15.
వెలుపలి లంకెలు[మార్చు]
- https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/
- http://srikakulammedical.info/nextpage.htm[permanent dead link]