గుంతకల్లు
Guntakal | |
---|---|
నిర్దేశాంకాలు: 15°10′N 77°23′E / 15.17°N 77.38°ECoordinates: 15°10′N 77°23′E / 15.17°N 77.38°E | |
Country | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Anantapur |
విస్తీర్ణం | |
• మొత్తం | 51.90 కి.మీ2 (20.04 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 432 మీ (1,417 అ.) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,26,270 |
• సాంద్రత | 2,400/కి.మీ2 (6,300/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 515801 |
టెలిఫోన్ కోడ్ | +91–8552 |
వాహనాల నమోదు కోడ్ | AP–02 |
జాలస్థలి | guntakal |
గుంతకల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదాతో ఉన్న పట్టణం.ఇదే పేరుగల మండలానికి కేంద్రం.పెద్ద రైల్వే జంక్షన్ తో కూడిన పట్టణం
చరిత్ర[మార్చు]
బ్రిటీష్ ఈస్టిండియా, ఆపైన బ్రిటీష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలుమార్గాలు వేయడం, రైలు ప్రయాణాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో జంక్షన్‌గా గుంతకల్లు ప్రాభవం పొందింది.1893లో సికింద్రాబాద్‌కి ప్రయాణం చేస్తూ గుంతకల్లు బంగళాలో బసచేసిన ఆంగ్ల సైనికుల్లో ఒక యువతిని, ఒక మహిళని అత్యాచారం చేయబోగా అడ్డుకున్న గేట్ కీపర్ గొల్ల హంపన్నను కాల్చిచంపారు. వారి వ్యభిచరించడానికి హంపన్నను మధ్యవర్తిగా ఉపయోగించారని, ఆ సమయంలోనే హంపన్నకు-సైనికులకు వివాదం రేగి హంపన్న దాడిచేయబోగా కాల్చారని వాదించారు. ఈ వాదనను ప్రత్యేకంగా బ్రిటీషర్ల కోసం ఏర్పరిచిన జ్యూరీ అంగీకరించి నిర్దోషులని తీర్పునిచ్చింది. ఐతే ఇదంతా జాత్యహంకారంగా పరిగణించి హిందూ పత్రిక, నిష్కళంకులైన హంపన్న, స్త్రీల సంఖ్యపై కళంకం ఆపాదించినందుకు గ్రామస్థులు వ్యతిరేకిస్తూ గ్రామంలో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించారు.[3]
నేపథ్యం[మార్చు]
అనంతపురం తరువాత మూడవ పెద్ద పట్టణం గుంతకల్లు. దక్షిణ మధ్య రైల్వే లోని 5 ప్రధాన డివిజన్ లలో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా గుంతకల్లుకు పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉంది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లుకు ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లలో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన హజారత్ వలి మస్తాన్ దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము మొహర్రము తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.
దర్శనీయ ప్రదేశాలు[మార్చు]
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయస్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. శ్రావణమాసంలో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి శనివారం, మంగళవారం కసాపురం దేవాలయం భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరం తరువాత అరిగిపోయి ఉండడం స్వామి వారి మాహాత్మ్యం అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశీ విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది, కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వం గుంతకల్లు నుండి కసాపురంకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
మూలాలు[మార్చు]
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.