కృష్ణపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కృష్ణపట్నం
రెవిన్యూ గ్రామం
కృష్ణపట్నం is located in Andhra Pradesh
కృష్ణపట్నం
కృష్ణపట్నం
నిర్దేశాంకాలు: 14°16′59″N 80°07′01″E / 14.283°N 80.117°E / 14.283; 80.117Coordinates: 14°16′59″N 80°07′01″E / 14.283°N 80.117°E / 14.283; 80.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంముత్తుకూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,889 హె. (7,139 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,686
 • సాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (0861 Edit this at Wikidata)
పిన్(PIN)524344 Edit this at Wikidata

కృష్ణపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం లోని గ్రామం. దగ్గరలోని కృష్ణపట్నం ఓడరేవు వలన, కరోనాకు మందు వలన ప్రసిద్ధి కెక్కింది.

గ్రామనామ వివరణ[మార్చు]

కృష్ణపట్నం లో కృష్ణ అన్న పదం పురుషనామసూచి, పట్నం అంటే ఒక అర్ధంలో సముద్రతీరం కావున సముద్రతీరంలోని గ్రామం.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది మండల కేంద్రమైన ముత్తుకూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

జనగణన గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1722 ఇళ్లతో, 5686 జనాభాతో 2889 హెక్టార్లలో విస్తరించి ఉంది[2]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి ముత్తుకూరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల ముత్తుకూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు నెల్లూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నెల్లూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి.

భూమి వినియోగం[మార్చు]

కృష్ణపట్నంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2806 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 22 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 21 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 30 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 30 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కృష్ణపట్నంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 26 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కృష్ణపట్నంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశనగ

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఉప్పు, ఎండుచేపలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

మనుమసిద్ధేశ్వరుడి ఆలయం[మార్చు]

శ్రీ సిద్ధేశ్వరాలయంలో, 2014, మార్చి-24, సోమవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. స్థానికులు, స్థానికేతర భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. పల్లకీసేవలో స్త్రీల సంఖ్య పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ప్రతివారం, ప్రత్యేక పూజలు జరుగుచూ ఉండటంతో, భక్తుల రద్దీ పెరుగుతున్నది. [2] కామాక్షీదేవి ఆలయం, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, గ్రామదేవత పోలేరమ్మ ఆలయం ఉన్నాయి.

గ్రామ విశేషాలు[మార్చు]

 • శృంగార కవి శ్రీనాధుడు ఇక్కడ నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి. నెల్లూరి నెరజాణ అనే పదం శ్రీనాధుడి సృష్టేనని ఇక్కడి వారంటారు.
 • కృష్ణపట్నం దగ్గర నేలటూరులో, ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించారు.
 • ఈ గ్రామం నుండి కడప జిల్లాలోని ఓబులవారిపల్లె వరకూ రైల్వే లైను నిర్మాణం జరుగుచున్నది. మొత్తం లైను పొడవు 93 కి.మీ. అంచనా వ్యయం రు.750 కోట్లు. ఈ లైనులో కడప జిల్లా పరిధిలో 3 స్టేషన్లూ, నెల్లూరు జిల్లాలో 6 స్టేషనులూ వచ్చును. ఈ రైలు మార్గం కొరకు, ప్రధాన రహదార్లపై, 15 వంతెనలూ, చిన్న వంతెనలు 120 దాకా నిర్మాణం చేయవలసి ఉంటుంది.[3]
 • ఈ మార్గంలోనే దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గుహ (దేశంలో రెండవ స్థానం) ఒకటి తగుల్తుంది.

ఆనందయ్య మందు[మార్చు]

బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి మూలికల మందు తయారు చేసి కొందరికి ఇచ్చారు.

ఈ మందులో వాడే మూలికలు

 1. అల్లం
 2. తాటిబెల్లం
 3. తేనే
 4. నల్లజిలకర్ర
 5. తోకమిరియాలు
 6. లవంగాలు
 7. వేప
 8. నేరేడు
 9. మామిడి
 10. నేల ఉసిరి
 11. కొండపల్లేరు
 12. కుప్పింటాకు
 13. తెల్లజిల్లేడు పువ్వు
 14. పట్టా
 15. బుడ్డబుడస ఆకు
 16. ముళ్ళ వంకాయ.[ఆధారం చూపాలి]

మూలాలు[మార్చు]

 1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. ఈనాడు కడప, 13 అక్టోబరు 2013. 3వ పేజీ.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,మార్చి-25; 2వపేజీ.