అక్షాంశ రేఖాంశాలు: 15°09′40″N 77°22′37″E / 15.161°N 77.377°E / 15.161; 77.377

గుంతకల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°09′40″N 77°22′37″E / 15.161°N 77.377°E / 15.161; 77.377
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంగుంతకల్లు
విస్తీర్ణం
 • మొత్తం389 కి.మీ2 (150 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,71,655
 • జనసాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి995


గుంతకల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,59,535 - పురుషులు 80,867 - స్త్రీలు 78,668, అక్షరాస్యత - మొత్తం 65.03% - పురుషులు 76.03% - స్త్రీలు 53.69%, పిన్ కోడ్ 515801

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కసాపురం
  2. సంగాల
  3. దోసలుడికి
  4. గుండాల
  5. అమీన్‌పల్లి
  6. కొంగనపల్లి
  7. శంకరబండ
  8. ఓబులాపురం
  9. వై.టి.చెరువు
  10. పాత కొత్తచెరువు
  11. నక్కనదొడ్డి
  12. తిమ్మాపురం
  13. గుంతకల్లు (గ్రామీణ)
  14. దోనిముక్కల
  15. నెలగొండ
  16. దంచర్ల
  17. నాగసముద్రం
  18. అయ్యవారిపల్లి

మండలం లోని దేవాలయాలు

[మార్చు]

మండలానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఇదే మండలానికి చందిన కసాపురం గ్రామంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా పేరుపొందింది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వం గుంతకల్లు నుండి కసాపురముకి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయస్వామి వెలసినాడు. నేట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయ 'వ్యూ' కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లుకు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages & Towns in Guntakal Mandal of Anantapur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-22.

వెలుపలి లంకెలు

[మార్చు]