నార్పల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్పాల
—  మండలం  —
అనంతపురం పటంలో నార్పాల మండలం స్థానం
అనంతపురం పటంలో నార్పాల మండలం స్థానం
నార్పాల is located in Andhra Pradesh
నార్పాల
నార్పాల
ఆంధ్రప్రదేశ్ పటంలో నార్పాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°43′14″N 77°48′38″E / 14.720432°N 77.81044°E / 14.720432; 77.81044
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం నార్పాల
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,728
 - పురుషులు 26,456
 - స్త్రీలు 25,272
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.11%
 - పురుషులు 63.15%
 - స్త్రీలు 36.51%
పిన్‌కోడ్ 515425

నార్పల (ఆంగ్లం: Narpala), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము


నార్పల మండలంలోని గూగూడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, కుళ్లాయి స్వామి మకాన్(చావిడి) ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.ఇవి హిందూముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచాయి.

   ప్రతి సంవత్సరం మొహరం పండుగను ఇక్కడ అత్యంత కోలాహలంగా జరుపుతారు.

జిల్లానలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. రెండు ఆలయాలను భక్తితో పూజిస్తారు.

    గూగూడుకు దగ్గరలో చండ్రాయునిపేటలో రామచారి, లక్షణాచారి అనే ఇద్దరు సోదరులుఒక పీరును తయారుచేసి పూజించాలనుకున్నారు. పీరు తయారయిన తరువాత ఆగ్రామం తగుల బడిపోవటంతో అది పీరు ప్రభావమనుకుని దానిని దగ్గరున్న బావిలో పడవేశారు. ఒక గొర్రెల కాపరి తిరుమల కొండన్నకు దాహనికై బావిలో దిగినపుడు ఆ పీరు కనిపించింది. దాన్ని అతడు తీసుకొనివచ్చి మొహరం ఉత్సవాల్లో ప్రదర్శించాడు. అపుడు దాన్ని కుహూళ్ల స్వామి అనేవారు.క్రమేపి అది కుళ్లాయి స్వామిగా మారిపోయింది.1922లో కుళ్లాయిస్వామి మకాన్ నిర్మించారు.
     గుహూడు అనే పేరుగల ముని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించేవాడట. ఆయన పేరు మీదుగా ఈ గ్రామానికి గూగూడు అనే పేరు వచ్చినట్లు పూర్వీకులు చెపుతుంటారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. చామలూరు
 2. నడిమిదొడ్డి
 3. వెంకటంపల్లె
 4. నార్పల
 5. దుగ్గుమర్రి
 6. బొందలవాడ
 7. సిద్దరాచెర్ల
 8. దుర్గం
 9. బండ్లపల్లె
 10. బీ.పప్పూరు
 11. గూగూడు

హావేలి సోదనపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. హవేలీ సోదనపల్లె
 2. నర్సాపురమ్
 3. కెసెపల్లి
 4. మద్ధలపల్లి
 5. నాయనపల్లి
 6. రొటరీపురం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]