ముమ్మిడివరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముమ్మిడివరం
—  మండలం  —
ముమ్మిడివరం is located in ఆంధ్ర ప్రదేశ్
ముమ్మిడివరం
ఆంధ్రప్రదేశ్ పటములో ముమ్మిడివరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము ముమ్మిడివరం
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 66,180
 - పురుషులు 32,868
 - స్త్రీలు 33,312
అక్షరాస్యత (2001)
 - మొత్తం 72.66%
 - పురుషులు 79.24%
 - స్త్రీలు 66.20%
పిన్ కోడ్ 533216
ముమ్మిడివరం
—  రెవిన్యూ గ్రామం  —
ముమ్మిడివరం is located in ఆంధ్ర ప్రదేశ్
ముమ్మిడివరం
అక్షాంశరేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ముమ్మిడివరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 68,586
 - పురుషుల సంఖ్య 34,389
 - స్త్రీల సంఖ్య 34,197
 - గృహాల సంఖ్య 19,459
పిన్ కోడ్ 533 216
ఎస్.టి.డి కోడ్

ముమ్మిడివరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 533 216. ముమ్మిడివరం దగ్గరలో ఉన్న పట్టణం అమలాపురం. జూలై 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకాలో ఉండేది. తరువాతి కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది.

భౌగోళిక మైన ఉనికి[మార్చు]

ముమ్మిడివరం 16.6500° N 82.1167° E.[2], సముద్రమట్టానికి మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది.

బాలయోగి దేవాలయం[మార్చు]

ముమ్మిడివరం బాలయోగి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లాలో చాలా ప్రాచుర్యం కలది.[3] ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది మహాశివరాత్రికి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు. నేటికి (2007) ఆయన బ్రతికి ఉంటే కనీసం 70 ఏళ్ళ వయస్సన్నా ఉంటుంది. పూర్వం రోజులలో, ఆయన గురించి ఎవ్వరో ఒకరు ఏదో ఒకటి చెప్పేవారు. క్రమేపీ ఆయన గురించిన వార్తలు రావటం మానేశాయి.

శాసనసభ నియోజక వర్గం[మార్చు]

ముమ్మిడివరం షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. 1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో 1,35,049 ఓటర్లు ఉన్నారు.

శాసన సభకి ఎన్నికైన అభ్యర్థులు[4]

  • 1978 - మోకా విష్ణు ప్రసాద రావు
  • 1983 - వల్టాటి రాజసక్కుబాయి
  • 1985 - పందు కృష్ణ మూర్తి
  • 1989, 1994 - బత్తిన సుబ్బారావు
  • 1999 - చెల్లి వివేకానంద
  • 2004 - పైనిపి విశ్వరూప

చేరుకొనే విధానం -రవాణ వ్యసస్థ[మార్చు]

ముమ్మిడివరం అమలాపురానికి 13 కి.మీ దూరంలో ఉంది. యానాంకి 20 కి.మీ దూరంలో, జిల్లా రాజధాని కాకినాడకి 45 కి.మీ., రామచంద్రపురంకి 63 కి.మీ. దూరంలో ఉంది. ఆర్.టి.సి. వారి సౌజన్యంతో తరచు బస్సు సౌకర్యం ఉంది. దగ్గరలోని రైలు స్టేషను రాజమండ్రి, లేదా కాకినాడ.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 68,586 - పురుషుల సంఖ్య 34,389 - స్త్రీల సంఖ్య 34,197 - గృహాల సంఖ్య 19,459

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,348.[5] ఇందులో పురుషుల సంఖ్య 10,877, మహిళల సంఖ్య 11,471, గ్రామంలో నివాసగృహాలు 5,573 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]