బాలయోగి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలయోగీశ్వర దేవాలయం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామం ఉంది.

బాలయోగి దేవాలయం
పేరు
ఇతర పేర్లు:బాలయోగి
ప్రధాన పేరు :బాలయోగి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి జిల్లా
ప్రదేశం:కోనసీమ ముమ్మిడివరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:బాలయోగి
ముఖ్య_ఉత్సవాలు:మహ శివరాత్రి,కార్తిక మాసం.
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీస్తు శకం 1950

చరిత్ర[మార్చు]

1952 సంవత్సర ప్రాంతం లో ముమ్మిడివరం లో శ్రీ బాలయోగి మౌనముద్రలో ఉంటూ ధ్యానసమాధి స్థితికి చేరుకుని అన్నపానాలు విసర్జించి తాపసి గా ఉండేవారు. బాలయోగీ వారిని భక్తులు దైవస్వరుపుని గా పూజించారు. అదే సమయాన జిల్లాలో ఉన్నతాధికారిగా పనిచేసే శ్రీ బాలకృష్ణ అయ్యర్ గారు శ్రీ బాలయోగిని దర్శించి, అతని తపోదీక్షకు ఆశ్చర్య పోయి బాలయోగి భక్తునిగా మారి బాలయోగికి మందిరం నిర్మించ కృషిచేశారు.[1]

మహ శివరాత్రి పర్వదినం[మార్చు]

మహ శివరాత్రి రోజున భక్తులకు దర్శనం ఇచ్చేవారు ,తరువాత రోజున మరలా మందిరానికి తాళాలు వేస్తారు.బాలయోగి దర్శనానికి ఇచ్చిన రోజున యోగ సమాధి స్థితిలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఎవరితోనూ మాట్లాడుట, కదలికలు ఉండేవి కావు ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు.1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు.బాలయోగి దర్శనం ఇచ్చిన రోజున యోగ సమాధి స్థితిలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు ఎవరితోనూ మాట్లాడుట, కదలికలు ఉండేవి కావు బాలయోగి ఇప్పటికి దైవాంశ సంభూతునిగా ఈ ప్రాంత భక్తులు కొలుస్తారు.

ప్రయాణ సదుపాయం[మార్చు]

అమలాపురం నుండి 20కి. మీ దూరంలో ఉంది, కాకినాడ నుండి,యానం బ్రిడ్జ్ మీదుగా ముమ్మిడివరం లోని బాలయోగీంద్రుల మందిరము చేరవచ్చును 40 కి.మీ. దూరము. బస్సు సౌకర్యము కలదు. అమలాపురం నుండి 12 కి.మీ దూరములో ముమ్మిడివరము చేరుకొనవచ్చును.

మరణం[మార్చు]

1984 వ సంవత్సరంలో బాలయోగి సిద్ది పొందినట్లు నిర్వాహకులు ప్రకటించిణారట. ఆప్పటి నుండి మహ శివరాత్రి కార్యక్రమాలు ఆగిపోయినవి.

మూలాలు[మార్చు]

  1. "ఆత్మ యోగి ముమ్మిడివరం బాలయోగి - శిఖామణి". ఆంధ్రజ్యోతి. 2012.