రామచంద్రపురం (కోనసీమ జిల్లా)

వికీపీడియా నుండి
(రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 16°51′N 82°01′E / 16.85°N 82.02°E / 16.85; 82.02Coordinates: 16°51′N 82°01′E / 16.85°N 82.02°E / 16.85; 82.02
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మండలంరామచంద్రాపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం13.98 km2 (5.40 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం43,657
 • సాంద్రత3,100/km2 (8,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1026
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)533255 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం.

భౌగోళికం[మార్చు]

జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి నైరుతి దిశలో 34 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 43,657.[2]

పరిపాలన[మార్చు]

రామచంద్రపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళ్లే రహదారిపై వుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

రాయవరం మునసబుగా ప్రసిద్ధులైన ఉండవిల్లి సత్యనారాయణమూర్తి స్థాపించి, పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్టు గ్రాడ్యుయేట్ కేంద్రం స్థాయిలో సాగుతుంది. నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించబడింది. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.

ప్రముఖులు[మార్చు]

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి అసిస్టెంట్ ఎడిటర్
జె.వి.రాఘవులు (జెట్టి వీర రాఘవులు): తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

వ్యవసాయం[మార్చు]

వరి, చెరుకు ప్రధాన పంటలు

పరిశ్రమలు, వ్యాపారం[మార్చు]

80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ, బీరు ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో ఇంకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.

ఇతర విశేషాలు[మార్చు]

కాకర్లపూడి కోట[మార్చు]

కాకర్లపూడి వంశానికి చెందిన కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ.ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు.ఆ కోటలో ఇప్పటికీ వారి వంశస్థులు నివసిస్తున్నారు.[3]

ఇవీ చూడండి[మార్చు]

రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 29 August 2014.
  3. "ramachandrapuram-kota". mountainvalley.in. Retrieved 2021-07-18.

వెలుపలి లంకెలు[మార్చు]