Jump to content

తెలినీలాపురం

అక్షాంశ రేఖాంశాలు: 18°34′25.680″N 84°15′48.564″E / 18.57380000°N 84.26349000°E / 18.57380000; 84.26349000
వికీపీడియా నుండి
తెలినీలాపురం
పటం
తెలినీలాపురం is located in ఆంధ్రప్రదేశ్
తెలినీలాపురం
తెలినీలాపురం
అక్షాంశ రేఖాంశాలు: 18°34′25.680″N 84°15′48.564″E / 18.57380000°N 84.26349000°E / 18.57380000; 84.26349000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
మండలంటెక్కలి
విస్తీర్ణం2.44 కి.మీ2 (0.94 చ. మై)
జనాభా
 (2011)[1]
247
 • జనసాంద్రత100/కి.మీ2 (260/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు106
 • స్త్రీలు141
 • లింగ నిష్పత్తి1,330
 • నివాసాలు97
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్532212
2011 జనగణన కోడ్580998

తెలినీలాపురం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామం.[2] తేనినీలాపురం గ్రామం శ్రీకాకుళం పట్టణానికి 65 కి.మీ దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం పోవు జాతీయ రహదారి పై టెక్కలి నుండి 7 కి.మీ దూరంలో ఉంది. ఇది మండల కేంద్రమైన టెక్కలి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 97 ఇళ్లతో, 247 జనాభాతో 244 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 106, ఆడవారి సంఖ్య 141. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 580998[3].

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ పేరు వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో పూర్వం రెండు కులాల వారు నివసించేవారు. 'తెలుకల, రెడ్డిక' అనే ఈ రెండు కులాలకు ఆ వూళ్లో ఇంచుమించు అన్ని రంగాల్లోనూ సమాన ప్రాతినిధ్యం ఉండేది. ఊరికి ఎవరి కులానికి సంబంధించిన పేరు వారు పెట్టుకోవాలని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి పెద్దల సమక్షంలో సంధి కుదిరింది. అదేంటంటే తెలుకల కులానికి చెందిన పేరులో తొలి రెండక్షరాలు, రెడ్డి కులంలో మెజారిటీ ప్రజల ఇంటిపేరైన 'నీలాపు' అనే పదం వచ్చేట్టుగా ఆ గ్రామానికి తేలి+నీల+పురం కలిపి తేలినీలాపురంగా మార్చారు. తర్వాత కాలంలో రెడ్డి కులస్థులు ఏ కారణం చేతనో ఈ వూరినుండి వలసపొయ్యారు.

గ్రామం గురించి

[మార్చు]

ఈ గ్రామం చాలా చిన్నది. కేవలం 120 ఇళ్లు, 850 మంది జనాభా కలిగి ఉంది. వేములవాడ, విశ్వనాథపురం, శ్రీరంగం అనే మూడు ఊళ్లు తేలినీలాపురం పంచాయతీలోకి వస్తాయి. తేలినీలాపురం పక్కనే రాజగోపాలపురం ఉంది. ఇక్కడా 40 ఇళ్లకు మించి వుండవు. చూడ్డానికి ఈ రెండూళ్లు ఒక్కటే అనిపిస్తుంది. విచిత్రం ఏమంటే రకరకాల పక్షుల ఆవాసానికి తేలినీలాపురం అనుకూలంగా ఉంటుంది. అయితే వీటిని చూడ్డానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌, గెస్ట్‌హౌస్‌లు రాజగోపాలపురంలో ఉన్నాయి. ఈ ఊరి చుట్టూ 8 చెరువులున్నాయి. దగ్గర్లోనే సముద్రం కూడా ఉంది. 15 కిలోమీటర్ల దూరంలో బానవపాడు బీచ్‌ ఉంది. ఈ బీచ్‌కి, తేలినీలాపురం గ్రామానికి మధ్య ఉన్న కాకరాపల్లి, మేఘవరం, తంపర గ్రామాల్లో రకరకాల విదేశీ పక్షులు కనిపిస్తాయి. పక్షులకు కావలసిన ఆహారం కూడా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

వలస పక్షులు

[మార్చు]

ప్రతి సంవత్సరం 3000 పెలికాన్, స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరములనుండి ఒకే గగన మార్గములో వచ్చుచున్నట్లు తెలియుచున్నది. 15 సంవత్సరముల క్రితం ఇవి 10000 ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 3000 లకు పడిపోయింది. టెక్కలి పట్టణ పరిసర ప్రాంతాలైన తేలినీలాపురం, ఇజ్జువరం, నౌపడ ప్రాంతాలు వలస వచ్చే పక్షుల స్థావరాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతములకు ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశముల నుండి సుమారు 113 రకముల విదేశీపక్షులు వచ్చుచున్నట్లు తెలియుచున్నది.

విశేషాలు

[మార్చు]
  • ప్రతి సంవత్సరం 3000 పెలికాన్, స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది.
  • ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరములనుండి ఒకే గగన మార్గములో వచ్చుచున్నట్లు తెలియుచున్నది. 15 సంవత్సరముల క్రితం ఇవి 10000 ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 3000 లకు పడిపోయింది.
  • టెక్కలి పట్టణ పరిసర ప్రాంతాలైన తెలినీలాపురం, ఇజ్జువరం, నౌపడ ప్రాంతాలు వలస వచ్చే పక్షుల స్థావరాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతములకు ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశముల నుండి సుమారు 113 రకముల విదేశీపక్షులు వచ్చుచున్నట్లు తెలియుచున్నది.
  • సుమారు 700 మచ్చల పెలికాన్ లు, 1200 రంగుల స్టార్క్స్ సుమారు 7000 కి.మీ ప్రతి సంవత్సరం ప్రయాణిస్తాయి.

ఈ పక్షులు సెప్టెంబరు నెలలో ఇచటికి వచ్చి గ్రుడ్లు పెట్టి పొదిగి సుమారు 7 నెలలు ఉంటాయి. అవి వాటి పిల్లలతో మే నెలలో వాటి మాతృ దేశానికి వెళ్ళి పోతాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల టెక్కలిలోను, ప్రాథమికోన్నత పాఠశాల రావివలసలోను, మాధ్యమిక పాఠశాల రావివలసలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల టెక్కలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ శ్రీకాకుళంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల టెక్కలిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

తెలినీలపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 77 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 10 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 39 హెక్టార్లు
  • బంజరు భూమి: 23 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 85 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 76 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 72 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

తెలినీలపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 72 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

తెలినీలపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పెసర, మినుము

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-07-31.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

యితర లింకులు

[మార్చు]