తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో గల పక్షుల సంరక్షణా కేంద్రం.[1] ప్రతి సంవత్సరం సైబీరియా ప్రాంతం నుండి పెలికన్, స్టార్క్ పక్షులు ఇక్కడికి వలసవచ్చి సంతానోత్పత్తి చేసి సంతానంతో తిరిగి వెళతాయి.

వలస పక్షులు

[మార్చు]

ప్రతి సంవత్సరం 3000 పెలికాన్, స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైంది. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరాలనుండి ఒకే గగన మార్గములో వస్తున్నట్లు తెలుస్తుంది. 15 సంవత్సరాల క్రితం ఇవి 10000 ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 3000 లకు పడిపోయింది.[2] టెక్కలి పట్టణ పరిసర ప్రాంతాలైన తేలినీలాపురం, ఇజ్జువరం, నౌపడ ప్రాంతాలు వలస వచ్చే పక్షుల స్థావరాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశాల నుండి సుమారు 113 రకాల విదేశీపక్షులు వస్తున్నట్లు తెలుస్తుంది.

పర్యాటక కేంద్రం

[మార్చు]

సైబీరియా దేశం నుంచి వలస వచ్చే ఈ పక్షులు ప్రతి ఏటా ఒడిశా రాష్ట్రంతోపాటు జిల్లా నలుమూలలకు చెందిన పర్యాటకుల్ని ఆనందానికి గురిచేస్తుంటాయి. ప్రధానంగా ఫెలికాన్‌, పెంటైడ్‌ స్టార్క్స్‌ అనే రెండు జాతుల పక్షులు ఈ ప్రాంతానికి వస్తుంటాయి. అక్టోబరు నెలలో సైబీరియా దేశంలో వాతావరణం అతి ఉష్ణ ప్రాంతంగా ఉండడంతో శీతల ప్రాంతంగా భావించే ఇక్కడికి వలస వస్తుంటాయి. సుమారు 4,500 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణం చేస్తాయి. ఏటా వేలాది పక్షులు ఇక్కడకు వచ్చి స్థానికంగా ఉన్న చింత చెట్లపై నివాసం ఏర్పరుచుకుని కన్నుల పండువగా కనువిందు చేస్తుంటాయి. ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు ఇక్కడే వాటి విడిది. గుడ్డు దశ నుంచి రెక్కలొచ్చి ఎగరడానికి ఎదిగే వయసు వరకు ఈ పక్షులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ముఖ్యంగా గూడ కొంగలు ఆహారాన్ని సేకరించే తీరు అత్యద్భుతం. సమీపంలోని సముద్ర అలలపై కనిపించే చేపల్ని పసిగట్టి, వాటిని ముక్కున కరుచుకుని గూటికి తీసుకొస్తాయి. పిల్లలకు ఆహారాన్నిచ్చే దృశ్యం వీనుల విందుగా ఉంటుంది.[3]

ఆరు నెలలపాటు సంతానోత్పత్తి గావించుకునే ఈ పక్షులు సైబీరియా దేశం నుండి ఈ ప్రాంతానికి వస్తుంటాయి. టెక్కలి మండలంలో తేలి నీలాపురంతోపాటు ఇచ్ఛాపురం మండలంలో తేలుకుంచి గ్రామంలోనూ ఈ పక్షులు విడిది చేస్తుంటాయి. సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న ఈ పక్షులను స్థానికులు వలస దేవుళ్లుగా భావిస్తున్నారు. ఈ పక్షులు రాకతో తమకు మంచి పంటలు లభిస్తాయని ఈ ప్రాంత రైతుల నమ్మకం. దీంతో పక్షులకు వీరే రక్షణ కల్పించడం గమనార్హం. పక్షుల జీవన క్రమం ఈ ప్రాంతీయులను ఆనందానికి గురిచేస్తుంది.

సుదూర ప్రయాణం

[మార్చు]

సుమారు 700 మచ్చల పెలికాన్ లు, 1200 రంగుల స్టార్క్స్ సుమారు 7000 కి.మీ ప్రతి సంవత్సరం ప్రయాణిస్తాయి.ఈ పక్షులు సెప్టెంబరు నెలలో ఇచటికి వచ్చి గ్రుడ్లు పెట్టి పొదిగి సుమారు 7 నెలలు ఉంటాయి. అవి వాటి పిల్లలతో మే నెలలో వాటి మాతృ దేశానికి వెళ్ళి పోతాయి.

మూలాలు

[మార్చు]
  1. "Sites - Important Bird Areas (IBAs)". Bird Life International. Archived from the original on 14 జూలై 2014. Retrieved 1 July 2014.
  2. Sumit Bhattacharjee (10 April 2006). "A 12,000 km flight from Siberia". The Hindu. Archived from the original on 20 ఏప్రిల్ 2006. Retrieved 1 July 2014. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. నేడు వలస పక్షుల దినోత్సవం

ఇతర లింకులు

[మార్చు]