తెలినీలాపురం

వికీపీడియా నుండి
(తేలినీలాపురం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెలినీలాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం టెక్కలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 247
 - పురుషుల సంఖ్య 106
 - స్త్రీల సంఖ్య 141
 - గృహాల సంఖ్య 97
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
పచ్చని పైరులతో, వింజామరలు వీచే వృక్ష సంపదతో, జలపుష్పాలతో నిండిన చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పదహారణాల పల్లెటూరు తేలినీలాపురం.

తెలినీలాపురం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము.[1] తేనినీలాపురం గ్రామం శ్రీకాకుళం పట్టణానికి 65 కి.మీ దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం పోవు జాతీయ రహదారి పై టెక్కలి నుండి 7 కి.మీ దూరంలో ఉంది.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ పేరు వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో పూర్వం రెండు కులాల వారు నివసించేవారు. 'తెలుకల మరియు రెడ్డిక' అనే ఈ రెండు కులాలకు ఆ వూళ్లో ఇంచుమించు అన్ని రంగాల్లోనూ సమాన ప్రాతినిధ్యం ఉండేది. ఊరికి ఎవరి కులానికి సంబంధించిన పేరు వారు పెట్టుకోవాలని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి పెద్దల సమక్షంలో సంధి కుదిరింది. అదేంటంటే తెలుకల కులానికి చెందిన పేరులో తొలి రెండక్షరాలు, రెడ్డి కులంలో మెజారిటీ ప్రజల ఇంటిపేరైన 'నీలాపు' అనే పదం వచ్చేట్టుగా ఆ గ్రామానికి తేలి+నీల+పురం కలిపి తేలినీలాపురంగా మార్చారు. తర్వాత కాలంలో రెడ్డి కులస్థులు ఏ కారణం చేతనో ఈ వూరినుండి వలసపొయ్యారు.

గ్రామం గురించి[మార్చు]

ఈ గ్రామం చాలా చిన్నది. కేవలం 120 ఇళ్లు, 850 మంది జనాభా కలిగి ఉంది. వేములవాడ, విశ్వనాథపురం, శ్రీరంగం అనే మూడు ఊళ్లు తేలినీలాపురం పంచాయతీలోకి వస్తాయి. తేలినీలాపురం పక్కనే రాజగోపాలపురం ఉంది. ఇక్కడా 40 ఇళ్లకు మించి వుండవు. చూడ్డానికి ఈ రెండూళ్లు ఒక్కటే అనిపిస్తుంది. విచిత్రం ఏమంటే రకరకాల పక్షుల ఆవాసానికి తేలినీలాపురం అనుకూలంగా ఉంటుంది. అయితే వీటిని చూడ్డానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌, గెస్ట్‌హౌస్‌లు రాజగోపాలపురంలో ఉన్నాయి. ఈ ఊరి చుట్టూ 8 చెరువులున్నాయి. దగ్గర్లోనే సముద్రం కూడా ఉంది. 15 కిలోమీటర్ల దూరంలో బానవపాడు బీచ్‌ ఉంది. ఈ బీచ్‌కి, తేలినీలాపురం గ్రామానికి మధ్య ఉన్న కాకరాపల్లి, మేఘవరం, తంపర గ్రామాల్లో రకరకాల విదేశీ పక్షులు కనిపిస్తాయి. పక్షులకు కావలసిన ఆహారం కూడా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

వలస పక్షులు[మార్చు]

ప్రతి సంవత్సరం 3000 పెలికాన్ మరియు స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరములనుండి ఒకే గగన మార్గములో వచ్చుచున్నట్లు తెలియుచున్నది. 15 సంవత్సరముల క్రితం ఇవి 10000 ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 3000 లకు పడిపోయింది. టెక్కలి పట్టణ పరిసర ప్రాంతాలైన తేలినీలాపురం, ఇజ్జువరం, నౌపడ ప్రాంతాలు వలస వచ్చే పక్షుల స్థావరాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతములకు ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశముల నుండి సుమారు 113 రకముల విదేశీపక్షులు వచ్చుచున్నట్లు తెలియుచున్నది.

విశేషాలు[మార్చు]

  • ప్రతి సంవత్సరం 3000 పెలికాన్ మరియు స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది.
  • ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరములనుండి ఒకే గగన మార్గములో వచ్చుచున్నట్లు తెలియుచున్నది. 15 సంవత్సరముల క్రితం ఇవి 10000 ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 3000 లకు పడిపోయింది.
  • టెక్కలి పట్టణ పరిసర ప్రాంతాలైన తేలినీలాపురం, ఇజ్జువరం, నౌపడ ప్రాంతాలు వలస వచ్చే పక్షుల స్థావరాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతములకు ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశముల నుండి సుమారు 113 రకముల విదేశీపక్షులు వచ్చుచున్నట్లు తెలియుచున్నది.
  • సుమారు 700 మచ్చల పెలికాన్ లు, 1200 రంగుల స్టార్క్స్ సుమారు 7000 కి.మీ ప్రతి సంవత్సరం ప్రయాణిస్తాయి.

ఈ పక్షులు సెప్టెంబరు నెలలో ఇచటికి వచ్చి గ్రుడ్లు పెట్టి పొదిగి సుమారు 7 నెలలు ఉంటాయి. అవి వాటి పిల్లలతో మే నెలలో వాటి మాతృ దేశానికి వెళ్ళి పోతాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 247 - పురుషుల సంఖ్య 106 - స్త్రీల సంఖ్య 141 - గృహాల సంఖ్య 97

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]