కదిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
Map
నిర్దేశాంకాలు: 14°06′29″N 78°09′40″E / 14.108°N 78.161°E / 14.108; 78.161Coordinates: 14°06′29″N 78°09′40″E / 14.108°N 78.161°E / 14.108; 78.161
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండలంకదిరి మండలం
విస్తీర్ణం
 • మొత్తం25.88 km2 (9.99 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం89,429
 • సాంద్రత3,500/km2 (8,900/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1015
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8494 Edit this on Wikidata )
పిన్(PIN)515591 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

కదిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం లోని గ్రామం.ఇది కదిరి పురపాలక సంఘ ముఖ్య పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం. కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచింది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. ఇక్కడి ప్రసిద్ధిచెందిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం వుంది.

భౌగోళికం[మార్చు]

పట్టణ విస్తీర్ణం 25.88 చ.కి.మీ (9.99 చ. మై). జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుండి ఉత్తర దిశలో 45 కి.మీ దూరంలో, సమీప నగరమైన అనంతపురం నుండి ఈశాన్య దిశలో 92 కి.మీ దూరంలో వుంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం జనాభా మొత్తం: 89,429, జన సాంద్రత 3,500/చ.కి.మీ (8,900/చ. మై.).[2]

పరిపాలన[మార్చు]

కదిరి పురపాలక సంఘం పట్టణ పరిపాలన చేస్తుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

జాతీయ రహదారి 42 పై వుంది, పాకాల - ధర్మవరం రైలు మార్గములో ఉంది.

పరిశోధన సంస్థలు[మార్చు]

  • కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం: కదిరి-3 వేరుశనగ వంగడం ఇక్కడే అభివృద్ధిచేయబడింది. కదిరి-3 వంగడం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండించే రకం. కదిరి-2, కదిరి- 71-1 రకాలు కూడా విరివిగా పండిస్తారు.

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయం[మార్చు]

శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయ ప్రధాన గోపురం

లక్షీనరసింహాస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి, ప్రహ్లాదుని సమేతంగా దర్శనం ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవస్థానానికి సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థం (కోనేరు), ద్రౌపది తీర్థం, కుంతి తీర్ఠం, పాండవ తీర్థం, వ్యాస తీర్థం మొదలగునవి. [3]

చంద్రవదన మొహియార్ సమాధి[మార్చు]

చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యథార్థ సంఘటన, సుమారు 500-600 సంవత్సరాలకు పూర్వం చంద్రవదన రాజకుమారి కదిరికి రాగా, మొహియార్ ఆమెను ప్రేమించాడు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధనముతో ఒకటైనారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామరస్యనికి ప్రతీక. వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి పురపాలక సంఘం ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పినది.15వ శతాబ్దం విజయనగర సామంత రాజు శ్రీరంగరాయులు ఏకైక పుత్రిక చంద్రవదన కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతూ పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మొహియార్‌ దుకాణం ముందునుంచే వెళ్లింది.ఆమె దృష్టి వజ్రాలకన్నా వాటిని విక్రయిస్తున్న మొహియార్‌పైన పడింది.అతని ఠీవి, దర్పాన్ని చూస్తూ, ఆమె పులకితురాలైంది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి, గుండెల్లో ముద్రవేసుకున్నాడు.పరస్పర ఆకర్షణల మధ్య మధుర ప్రేమలు పంచుకున్నారు.ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చి తనస్థితి, స్థాయినీ గుర్తుతెచ్చుకుని వేగంగా కదిలి తన నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్‌ చుట్టూ తిరుగుతూనే ఉంది. కొన్ని నిముషాలు మెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనని మొహియార్‌ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతీక్షణం చంద్రవదనే మదిలో తలపురేపుతూ. నిద్రాహారాలను దూరం చేసింది. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే ఉంది. కానీ తన స్థాయి వేరు మతం వేరు. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసురాక విలవిలలాడింది.ఒకరోజు మొహియార్‌ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంతఃపుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదన ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండటంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. అతను ప్రక్కనవున్న గోడకు తలపగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చనిపోయిన వ్యకి ఫలానా అని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి అతని స్థితిని చూసి చలించిపోయి. ఆమె కూడా అమాంతంగా మొహియార్‌ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇదంతా చూసిన శ్రీరంగనాయకులు మొదట వారిద్దరి మధ్య జరిగిన స్పందన, ప్రేమలను అర్థం చేసుకుని తన కొలువులోని గురువులు, పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన, మొహియార్‌ల శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించదలచి ముస్లింల సమైక్యతను చాటుతూ వారి సమాధులను అటు హిందూ, ఇటు ముస్లిం సంప్రదాయ ప్రకారం నిర్మించాడు.ఆనాటి పాతర్లపట్నమే నేటి 'పట్నం' నేటి కదిరిని అప్పుడు ఖాద్రి అనేవారు. 13వ శతాబ్దంలో శ్రీరంగరాయల పూర్వీకుడు రంగనాతిప్పానాయుడు శ్రీఖాద్రి అనే పేరుతో పట్టణం నిర్మించాడని చెపుతారు. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అభివృద్ధి అప్పటినుంచి జరుగుతూ వస్తోంది. సుమారు 10 ఎకరాలాలో పెద్ద ఆలయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలో నాలుగు మండపాలు, చిన్న చిన్న ఆలయాలున్నాయి. నలువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఒక గోపురాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో ముస్లిం పాలకులు నిర్మించారు.చంద్రవదన మొహియార్‌ల సమాధి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు, అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు.[4]

ఇతరాలు[మార్చు]

  • శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, కదిరి
  • శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం, కదిరి: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి స్వహస్తాలచే ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం ఇక్కడ అలరారుతోంది.[5]
  • యోగి వేమన సమాధి, కటారుపల్లి: 12 కి.మీ దూరంలో వుంది.
  • తిమ్మమ్మ మర్రిమాను: ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 20 మైళ్ళ దూరంలో వుంది.
  • యోగి వేమన జలాశయము,ముదిగుబ్బ
  • సి.జి. ప్రాజెక్టు :సుమారు 22 మైళ్ళ దూర
  • బట్రెపల్లి జలపాతం: సుమారు 10 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.
  • నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Wayback Machine" (PDF). web.archive.org. 2015-11-13. Archived from the original on 2015-11-13. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఈనాడు ఆదివారం: 2003 మార్చి 9
  4. http://www.prabhanews.com/life/article-11750 Archived 2013-01-31 at Archive.today ఆంధ్రప్రభ 6.7.2009
  5. ఈనాడు జిల్లా ఎడిషన్, 2013 అక్టోబరు 11. 10వ పేజీ.

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కదిరి&oldid=3798306" నుండి వెలికితీశారు