శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, కదిరి
| శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం | |
|---|---|
| భౌగోళికాంశాలు : | 14°07′N 78°10′E / 14.12°N 78.17°E |
| పేరు | |
| ప్రధాన పేరు : | శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం |
| ప్రదేశం | |
| దేశం: | భారత దేశం |
| రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా: | శ్రీ సత్యసాయి జిల్లా |
| ప్రదేశం: | కదిరి |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | లక్ష్మీనరసింహస్వామి |
| ఇతిహాసం | |
| నిర్మాణ తేదీ: | 13వ శతాబ్దం |
శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నెలకొని ఉన్న ఆలయం.కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇది ఒక చారిత్రాత్మక ఆలయం మరియు ఇక్కడ ఒక శాలివాహన లిపి ఉంది. కృష్ణ దేవరాయలను ఇక్కడ అభివృద్ధి చేసి సందర్శించారు . శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్యకశప మహారాజును సంహరించడానికి వచ్చారు ఆలయ చరిత్ర ప్రకారం మొదటి మూలం ఇక్కడ ఉంది, శ్రీ నరసింహ స్వామి కదిరి చెట్టు నుండి వచ్చాడు మరియు అది ఒక స్వయంభువు. కాబట్టి ఈ ప్రదేశాన్ని కదిరి అని పిలుస్తారు. మరియు మేము ఇక్కడ ఆండాళ్ మాతను చూస్తాము మరియు తెలుగులో ఆమెను సాహులా చిన్నమ అని వింటాము. మరియు ఆమె నరసింహ స్వామికి గొప్ప భక్తురాలు మరియు వివాహం తర్వాత అత్త మరియు ఆడపడుచు ఆమెను చాలా వేధిస్తున్నాడు చిన్నమ నరసింహ స్వామి ఆమెను కాపాడటానికి ప్రతిసారీ సహాయం చేసేవాడు. చివరకు ఒక రోజు అత్త గ్రహించింది స్వామి తన వెనుక ఉన్నాడని. ఆమె క్షమించమని అడిగింది ఎంక సామి వారిని దర్శించాలి అని వచ్చిన చిన్నమా స్వామి లో ఐక్యం ఏంది మరియు చిన్నమ విగ్రహాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చారు. మరియు ఇక్కడ బృగు కోనేరు అనే పేరుతో ఒక కోనేరు ఉంది చల పురాతనం చల పురాతన కోనేరు ఇక్కడ పురాతన రాతి కళ చాలా ప్రత్యేకమైనది ప్రతీ శిలకు ఒక్క కథ శ్రీ బృగు మహర్షి గారు ఎక్కడ ఆ కోనేరులో స్నానం ఆచరించి స్వామిని అర్చించారు అని చబుతారు మరియు ఇది నవ నరసింహ దేవస్థానంలో ఒకటి.
విశేషాలు
[మార్చు]ఈ దేవాలయం ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్నది. ఇది 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.[1]
ఉత్సవాలు
[మార్చు]ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.
ఆలయ విశిష్టత
[మార్చు]ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
వెళ్ళే మార్గం
[మార్చు]శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉంది. ఇది పాకాల—ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో స్టేషను కూడా ఉంది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు ఆదివారం: 9 మార్చి 2003