పెనుకొండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెనుకొండ
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో పెనుకొండ మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో పెనుకొండ మండలం యొక్క స్థానము
పెనుకొండ is located in Andhra Pradesh
పెనుకొండ
ఆంధ్రప్రదేశ్ పటములో పెనుకొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°05′00″N 77°35′00″E / 14.0833°N 77.5833°E / 14.0833; 77.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము పెనుకొండ
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,383
 - పురుషులు 28,280
 - స్త్రీలు 27,103
అక్షరాస్యత (2011)
 - మొత్తం 62.75%
 - పురుషులు 74.36%
 - స్త్రీలు 50.39%
పిన్ కోడ్ 515110

పెనుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 515110.[1]

చరిత్ర[మార్చు]

క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.[2]

పెనుకొండ దుర్గం[మార్చు]

పెనుకొండ దుర్గం


పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది.

పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఈ దుర్గ ప్రశస్తి గురించిన ఒక గేయం:

చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ

రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ

వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ

పెనుకొండలో చూడదగిన ప్రదేశములు[మార్చు]

కోట ముఖద్వారం
సీత తీర్థం కోనేరు, పెనుకొండ దుర్గం
పెనుకొండ ఆర్ టి సి బస్ డిపో
బెంగుళూరు-హైదరాబాదు జాతీయ రహదారి పై నుండి పెనుకొండలో కల గాలిమరలు
 1. బాబా ఫక్రుద్దీన్ దర్గా
 2. పెనుకొండ కోట : బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి.
 3. యెర్రమంచి గేటు : ఇందులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారు. పెనుకొండ లొ 365 దేవాలయాలు వుండెవని చరిత్ర చెబుతోంది. వీటిని కృష్ణదేవరాయలవారు నిర్మించారు.
 4. పెనుకొండ పెద్దకొండ : పెనుకొండ కొండ మీదకు ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును 2012 వ సంవత్సరంలొ ఎర్పాటు చెయడం జరిగినది. ముఖ్యంగా పెనుకొండ కొండపై నిర్మించబడిన నరసింహ స్వామివారిదేవాలయము, కోనేరు, చెరువు, శత్రు దుర్భేధ్యమైన కోట చూడదగిన ప్రదేశములు. ఇక్కద నరసింహస్వామివారి దేవాలయం ముందు విశాలమైన మైదానము వున్నది. ఇది వాహనములు నిలుపుటకు, విడదికొరకు అనువైన ప్రదేశము.
 5. షేర్ ఖాన్ మసీదు
 6. జామియా మసీదు
 7. పాంచ్ బీబీ దర్గా
 8. బాబయ్యకొండ (ఛిల్లాపహడ్)
 9. గగన మహాల్
 10. గాలి గోపురం
 11. తిమ్మరుసు బందీఖానా
 12. కుంభకర్ణ విగ్రహం
 13. కాళేశ్వరస్వామి ఆశ్రమం

ప్రముఖులు[మార్చు]

సంధ్యావందనం శ్రీనివాసరావు

రాజకీయ ప్రముఖులు[మార్చు]

రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో ఒకడైన పరిటాల రవీంద్ర ఈ నియోజక వర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు.

పరిటాల రవి

పెనుకొండ శాసనసభ నియొజకవర్గము[మార్చు]

పెనుకొండ గ్రామపంచాయితీ సర్పంచులు[మార్చు]

 • మస్తాన్ సాబ్
 • వై.ఎన్.కుమార్
 • చంద్రగిరి జయలక్ష్మమ్మ

ముఖ్య కార్యాలయములు[మార్చు]

కార్యాలయం పేరు చిరునామా ఫోన్
రెవెన్యూ డివిజన్ కార్యాలయము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
డివిజినల్ సూపరింటెండెంటు ఆఫ్ పోలీస్ (డి.యస్.పి) వారి కార్యాలయము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
పంచాయితీరాజ్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
ప్రభుత్వ ఆసుపత్రి పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
రహదారులు & భవనములు (R&B) డిప్యూటి ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయము (R&B) బంగళా 9440818386
తహసిల్దార్ వారి కార్యాలయము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
అగ్నిమాపక కేంద్రము పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
రైల్వే ష్టేషన్ పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
RTC బస్ స్టాండ్ పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
పోలిస్ ష్టేషన్ పాత N.H.రోడ్డు, బి.టి.ఆర్.కాలనీ త్వరలోనే పొందగలరు
సబ్ జైలు పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
అటవీ శాఖ పాత N.H.రోడ్డు త్వరలోనే పొందగలరు
భారతీయ ష్టేట్ బ్యాంక్ సంత మార్కెట్ త్వరలోనే పొందగలరు
ఆంధ్రాబ్యాంక్ కోట లోపల త్వరలోనే పొందగలరు
వైశ్యా బ్యాంక్ షేర్ ఖాన్ మసీదు రోడ్డు త్వరలోనే పొందగలరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆర్.డి.వో.కార్యాలయం వెనుక త్వరలోనే పొందగలరు
అనంత గ్రామీణ బ్యాంక్ మెయిన్ రోడ్డు త్వరలోనే పొందగలరు
ఎ.డి.సి.సి. బ్యాంక్ నేతాజి రోడ్డు త్వరలోనే పొందగలరు

వినోదము[మార్చు]

 1. వెంకటేష్వర సినీ కాంప్లెక్స్ : ఇది పెనుకొండ మెయిన్ బజారులో కలదు, ఇందులో రెండు సినిమా హాళ్ళు కలవు 1)వెంకటేశ్వర, 2) శ్రీనివాస
 2. గణేష్ సినిమాహాల్ : ఇది ఊరిలో కొద్దిగా లోపలికి వున్నది.

ఇక్కడ ఒక సంవత్సరం వరకు చూడదగిన పున్యక్షేత్రాలు వున్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014. 

యితర లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=పెనుకొండ&oldid=1755481" నుండి వెలికితీశారు