పులివెందుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
Map
నిర్దేశాంకాలు: 14°25′N 78°14′E / 14.42°N 78.23°E / 14.42; 78.23Coordinates: 14°25′N 78°14′E / 14.42°N 78.23°E / 14.42; 78.23
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంపులివెందుల మండలం
విస్తీర్ణం
 • మొత్తం87.17 km2 (33.66 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం65,706
 • సాంద్రత750/km2 (2,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08568 Edit this on Wikidata )
పిన్(PIN)516390 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పులివెందుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.

గ్రామ చరిత్ర[మార్చు]

పూర్వం ఇక్కడ వారు ఆరు మాసాల పాటు తపమాచరించారని, ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. ఇక్కడ రాజ రెడ్డి కళాశాల స్థాపించబడిఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తొలి శాసనం (1509) పులివెందుల పట్టణానికి సమీపంలోని శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో ఉంది. రాజకీయంగా ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది.

గ్రామ నామ చరిత్ర[మార్చు]

పులివెందుల పేరు "పులి మందల" అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.[2]

భౌగోళికాంశాలు[మార్చు]

పులివెందుల 14°25′00″N 78°14′00″E / 14.4167°N 78.2333°E / 14.4167; 78.2333 వద్ద ఉంది.[3] సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తులో గలదు (895 అడుగులు).

జనగణన వివరాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 65,706.

పరిపాలన[మార్చు]

పులివెందుల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది.

  • జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, 2006లో, వై.ఎస్.రాజశేఖరరెడ్డి చే ఇక్కడ స్థాపించబడింది.
  • AP IIIT R.K. VALLEY (RGUKT),ఇడుపులపాయ
  • ఆహార విజ్ఞానశాస్త్ర, సాంకేతిక కళాశాల
  • ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం

ప్రముఖులు[మార్చు]

  • పులివెందుల నబీసాయిబు-వర సిద్ధి వినాయక చెక్క భజన సంఘం స్థాపకుడు
వై.యస్. రాజశేఖరరెడ్డి: ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి,

వ్యవసాయం[మార్చు]

ఇక్కడ ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం
  • శ్రీ మిట్టమల్లేశేశ్వర స్వామివారి ఆలయం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. pp. 62, 63. Archived from the original (PDF) on 2016-04-05. Retrieved 2 July 2018.
  3. Falling Rain Genomics.Pulivendla

వెలుపలి లింకులు[మార్చు]