ఈసీ గంగిరెడ్డి
ఈసీ గంగిరెడ్డి ( ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి) గుర్తింపు పొందిన వైద్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అతనికి అల్లుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈసీ గంగిరెడ్డి 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి ఈసీ తులసమ్మ దంపతులకు జన్మించాడు. 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లెలగూడూరులోని ఆర్‌సీఎం స్కూలులో.. 6, 7, 8 తరగతులు పులివెందుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదివారు. 9, 10, 11 తరగతులు వేముల జెడ్పీ పాఠశాలలో, పీయూసీ తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివాడు. బెనారస్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చేశారు. తొలుత వైఎస్ రాజారెడ్డి ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేశారు. ఆ తర్వాత సొంతంగా పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు.[1]
2001లో పులివెందులలో ఎంపీటీసీ–1 స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన గంగిరెడ్డి పులివెందుల మండల పరిషత్ అధ్యక్షుడిగా చేశారు. పులివెందుల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. 2003 రబీలో ప్రభుత్వం తమకు విత్తనాలు ఇవ్వడం లేదంటూ రైతులు గంగిరెడ్డికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆయన వేలాది మంది రైతులతో కలిసి పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశాడు. కలెక్టర్ హామీతో ఆ తర్వాత ఆందోళన విరమించారు.
ఆయన పులివెందులలో గుర్తింపు పొందిన వైద్యుడుగా పేరు ఉండాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ వ్యాధి వచ్చిన ఈసీ గంగిరెడ్డి దగ్గరికి వచ్చేవారు. ఈసీ గంగిరెడ్డి 2021 వ సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.
మూలాలు
[మార్చు]- ↑ "డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు". Sakshi. 2020-10-04. Retrieved 2023-06-29.