వల్లూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వల్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
వల్లూరు is located in ఆంధ్ర ప్రదేశ్
వల్లూరు
అక్షాంశరేఖాంశాలు: 14°33′11″N 78°42′36″E / 14.553013°N 78.71006°E / 14.553013; 78.71006
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కడప జిల్లా
మండలం వల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి ఆదిమూలం శారద
జనాభా (2011)
 - మొత్తం 3,162
 - పురుషుల సంఖ్య 1,541
 - స్త్రీల సంఖ్య 1,621
 - గృహాల సంఖ్య 892
పిన్ కోడ్ 516 293
ఎస్.టి.డి కోడ్ 08562

వల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల గ్రామము. [1]

గ్రామాలు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

చోళకాలం చరిత.. కాకతీయుల వైభవం.. విజయనగర శిల్ప వైవిధ్య వికాసాలకు సంకేతంగా నిలిచిన నగరం అలనాటి వల్లభాపురం.. ప్రస్తుత వల్లూరు.కడప జిల్లాలో వల్లూరు, కమలాపురం, సంబటూరు, కోగటం, తిప్పలూరు, అంబవరం, గోటూరు, ఎర్రగుడిపాడు, కలమల తదితర ప్రాంతాల్లో లభిస్తున్న శాసనాలు, ఆలయాలు నాటి వైభవాన్ని మనకు తెలుపుతున్నాయి.

తొలి తెలుగు శాసనాలైన కలమల, ఎర్రగుడిపాడు, ప్రాచీన తెలుగుభాషా చరిత్రను అవగాహనకు నిలువెత్తు ఆధారాలైన తిప్పలూరు, గోటూరు, అంబవరం వంటి శాసనాలెన్నో లభ్యమైన ఈ ప్రాంతంలో గత సాక్ష్యాలు బయల్పడుతూనే ఉన్నాయి. ప్రాచీన భాషా చరితను తెలుసుకోవాలంటే కడప శాసనాలు పరిశీలించక తప్పదన్న భాషా శాస్త్ర పరిశోధకులు అభిప్రాయంతో ఏకీభవించని వారు లేరు.

గోటూరు శిలాశాసనము[మార్చు]

క్రీ.శ. 1 లేదా 2 శతాబ్దాల నాటిదైన స్మరణ ఛాయాస్తూప శాసనం బయల్పడింది. ఇదే కాలానికి చెందినదిగా గంగపేరూరులో రెండో శతాబ్దానికి చెందిన శాసనం గతంలో బయల్పడినట్లు శాసన పరిశోధకుడు చెబుతున్నారు. ఆలయాల ప్రాచీనతను గుర్తించిన అధికారులు వారసత్వ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. కేంద్ర రావస్తు శాఖాధికారులు గోటూరు శాసనాన్ని పరిశీలించి ఆ స్థలంలో లభ్యమైన ఇటుకలు పరిశీలించారు. శాసన పరిశోధకులు శాసనాన్ని రికార్డు చేసుకున్నారు. ప్రాచీన కాలంలో ఇక్కడ గ్రామం పరిసర ప్రాంతాల్లో శ్మశానం ఉన్నట్లు తెలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

అలనాటి వల్లభాపురం.. ప్రస్తుత వల్లూరు.

  1. మబ్బు దేవాలయం:- ఈ ఆలయం వల్లూరు ప్రాంత గత వైభవానికి ప్రత్యక్షసాక్షిగా నిలుచుచున్నది. 13వ శతాబ్దంలో అంబదేవుడు వల్లూరును రాజధానిగా చేసుకొని పాలించాడనటానికి ఇది ఏకైక ఋజువు. వల్లూరులో సర్వే నంబరు-240లో, 5 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణాన్ని కాపాడుకొనదానికి, 13వ ఆర్థిక సంఘం, రు.26 లక్షల నిధులు మంజూరు చేసినది. [2]

శిల్పి ఉలి అంచుల ఓంకృతులు పలికిన సుందర దేవతామూర్తులు, ఎన్నో పూజలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాది వైభవాలందుకున్న దేవతామూర్తులు అడుగడుగునా సాగు భూముల్లో కనిపిస్తూ తమ స్థితిని తెలుసుకోమంటున్నాయి. వల్లూరును సాంస్కృతిక పట్టణంగా భావించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జనాభా (2001) - మొత్తం 27,577 - పురుషుల సంఖ్య 13,864 - స్త్రీల సంఖ్య 13,713
అక్షరాస్యత (2001) - మొత్తం 58.95% - పురుషుల సంఖ్య 73.75% - స్త్రీల సంఖ్య 44.06%
జనాభా (2011) - మొత్తం 3,162 - పురుషుల సంఖ్య 1,541 - స్త్రీల సంఖ్య 1,621 - గృహాల సంఖ్య 892

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప, 26 అక్టోబరు 2013, 15వ పేజీ. [2] ఈనాడు కడప; 2014,జూన్-20;10వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=వల్లూరు&oldid=2051596" నుండి వెలికితీశారు