సాలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


సాలూరు
—  మండలం  —
విజయనగరం జిల్లా పటములో సాలూరు మండలం యొక్క స్థానము
విజయనగరం జిల్లా పటములో సాలూరు మండలం యొక్క స్థానము
సాలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
సాలూరు
సాలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో సాలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°32′00″N 83°13′00″E / 18.5333°N 83.2167°E / 18.5333; 83.2167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రము సాలూరు
గ్రామాలు 81
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,05,389
 - పురుషులు 51,107
 - స్త్రీలు 54,282
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.09%
 - పురుషులు 61.55%
 - స్త్రీలు 43.02%
పిన్ కోడ్ {{{pincode}}}

సాలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] (వినండి: Listeni//) సాలూరు వంశధార ఉపనదైన వేగావతి ఒడ్డున ఉంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. ఈ ఊరిలో పురాతనమైన పంచముఖేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రంహేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడకు దగ్గరలోనే శంబరపోలమాంబ,పారమ్మకొండలాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్, పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి.... ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి .. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం. ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే .. [[ thumbnail|center|saluru ]] ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ పట్రయుని సీతారామశాస్త్రి గారి దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు ..

పురపాలక సంఘం[మార్చు]

సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరంలో రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు. సాలూరు పట్టణంలో పువ్వుల పెంపకం, లారీల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.

1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలో జరిగిన ఉన్నత మార్పుల వల్ల, 2002 సంవత్సరం నుండి పట్టణంలో 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతులో ఉంది.

సాలూరు శాసనసభా నియోజకవర్గం[మార్చు]

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గంగా 1951 సంవత్సరం నుండి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. ఇది వెనుకబడిన తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడింది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి

సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక:

పట్టణ ప్రముఖులు[మార్చు]

అంగజాల జగన్నాథయ్య[మార్చు]

అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామము.[1].[1] వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో లారీలు లేదా రైలు ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.

పోతుబరి పెదనారాయణ[మార్చు]

సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు. రాజుల వద్ద పనిచేసే కాలంలో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు. సాలూరుపట్టణంలో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు, భజనలు చేసేవారు. వీరి కుమారుడు పోతుబరి విష్ణుమూర్తి గారు కూడా ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు. అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాథలకు ఉండడానికి ఒక అనాథ సంఘం నిర్మించారు. అనాథ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు. శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పనిచేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు. ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు, అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు. శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రిని నడిపేవారు. ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు. పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు. ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .

పవిత్ర స్థలాలు[మార్చు]

 • పంచ ముఖేశ్వరాలయం :
 • జగన్నాథస్వామి గుడి
 • కన్యకా పరమేశ్వరి గుడి
 • శ్యామలాంబ గుడి
 • ముత్యాలమ్మ తల్లి గుడి
 • వేణు గోపాలస్వామి గుడి
 • శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధం)
 • శ్రీ రామాలయం
 • అయ్యప్ప స్వామి ఆలయం
 • శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం
 • శ్రీ బంగారమ్మతల్లి గుడి
 • శ్రీ సాయిరామ్ గుడి
 • శ్రీ కోట దుర్గ దేవి గుడి
 • శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారి గుడి
 • శ్రీ కొత్తమ్మ తల్లి వనం
 • శ్రీ నూకాలమ్మ తల్లి గుడి
 • కోట లోపల కొలువున్న సర్వమంగాలా దేవి
 • శ్రీ సత్తమ్మ తల్లి గుడి
 • శ్రీ దేశమ్మ తల్లి గుడి
 • శ్రీ పర దేశమ్మ తల్లి గుడి
 • శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి
 • శ్రీ గంగమ్మ తల్లి గుడి
 • శ్రీ లక్ష్మి పేరంటాల గుండం
 • శ్రీ సత్యసాయి బాబా ధ్యాన మందిరం
 • శ్రీ కల్కి భగవాన్ మందిరం

క్రైస్తవ దెవాలయాలు[మార్చు]

 • రోమను కేథలిక్ చర్చి
 • St. పాల్ లుథర్న్ చర్చి
 • ది లివింగ్ చర్చ్ ఆఫ్ ఇండియా
 • ఆబ్బాఫాధర్ బైబిల్ బిలీవియర్స్
 • పెనూయోలు ప్రార్థన మందిరం

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • సాలూరు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,05,389 - పురుషులు 51,107 - స్త్రీలు 54,282

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]Vijayanagaram.jpg

విజయనగరం జిల్లా మండలాలు

కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస

 1. 1.0 1.1 1.2 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=సాలూరు&oldid=2359513" నుండి వెలికితీశారు