వీరఘట్టం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వీరఘట్టం
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో వీరఘట్టం మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో వీరఘట్టం మండలం యొక్క స్థానము
వీరఘట్టం is located in ఆంధ్ర ప్రదేశ్
వీరఘట్టం
ఆంధ్రప్రదేశ్ పటములో వీరఘట్టం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°41′00″N 83°36′00″E / 18.6833°N 83.6000°E / 18.6833; 83.6000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము వీరఘట్టం
గ్రామాలు 39
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 65,616
 - పురుషులు 32,339
 - స్త్రీలు 33,277
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.66%
 - పురుషులు 66.05%
 - స్త్రీలు 43.45%
పిన్ కోడ్ {{{pincode}}}

వీరఘట్టం (ఆంగ్లం: Veeraghattam)), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] మరియు మండలము.అత్యంత బలసంపన్నుడు, తెలుగు వాడి కీర్తిని నలు దిశలు వ్యాపింపచేసినవాడు అయిన కోడి రామమూర్తి స్వగ్రామము ఈవూరే.

ముఖ్యమైన విషయాలు[మార్చు]

కోడి రామమూర్తి

మరియ గిరి[మార్చు]

వీరఘట్టం దగ్గరిలో వెంకమ్మపేట సమీపములో వెలసియున్న ఈ మరియ కొండ క్రిస్టియన్ లకు పవిత్రమైనది. ఈ గిరి పై మరియ మాత వెలసియున్నది. ప్రతి ఏటా జనవరి 30 తేదీన ఈ కొండపై మరియమాత ఉత్సవాలు జరుగుతాయి. మాతృత్వము ఈ సృస్టిలో గొప్పది, తీయనిది, ఇదొక మధురానుభవము. లోకకల్యాణముకోసం మానవ రూపములో భగవంతుడు మరియ మాతను తన తల్లిగా ఎన్నుకోవడము ఆమె జీవితములో గొప్ప వరము. పునీత అగస్తీను వారన్నట్లు మరియ మాత బాలయేసును శిష్యునిగా హృదయాన మొదట కన్నది, తరువాతనే గర్భాన కన్నది, అందుకే ఆమె జీవితము పునీతమైనది. దైవాన్నే తన గర్భాన్న నవమాసాలు మోసి రక్షకుడిని లోకానికి అందించింది. లోకకళ్యాణము కోసము ఒక సమిధిగా మారి తన జీవితాన్ని దైవానికర్పించిన గొప్ప భక్తురాలు. మరియ గిరి స్థాపించి 30 ఏళ్లు అయినప్పటికీ ఈ ఉత్సవాలు మాత్రము 15 సంవత్సరాలనుండి జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు 1993 నవంబరు 4 న ఒక కతోలిక పీఠం ఏర్పడి తద్వారా క్రైస్తవులంతా ఈ పండగను జరుపుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నము, ఒడిషా రాస్త్రములోని- రాయగడ, గంజాం జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

వీరఘట్టం మండల విశేషాలు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 65,616 - పురుషులు 32,339 - స్త్రీలు 33,277

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11"https://te.wikipedia.org/w/index.php?title=వీరఘట్టం&oldid=2006629" నుండి వెలికితీశారు