పాలకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాలకొండ వద్ద తూర్పు కనుమలు
Map

పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్,పాలకొండ మండలానికి ప్రధాన కేంద్రం.[1] పాలకొండ మేజర్ పంచాయతీ హోదాతో కలిగిన పట్టణం. పిన్ కోడ్ నం. 532 440., యస్.టీ.డీ.కోడ్ = 08941.

ఇది నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘం. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించింది.1881లో ప్రచురితమైన భారతదేశ ఇంపీరియల్ గెజెటర్ ప్రకారం 1,300 కి.మీ.2 (502 చదరపు మైళ్ళు) వైశాల్యంతో పాలకొండ తాలూకా వైజాగ్ జిల్లాలో ఉండేది. సాగు భూములు నాగావళి నదిపై అధారపడి ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో 150 కి.మీ.2 వైశాల్యంగల అభయారణ్యం ఉంది. ఇక్కడ కోయ, సవర, ఇతర కొండజాతులకు చెందిన సుమారు 11,000 జనాభా 106 గ్రామాలలో నివసిస్తున్నారు.1891లో 2,01,331 జనాభాతో పోలిస్తే, 1901లో 2,15,376 జనాభా ఉంది.


పాలకొండ సంస్థాన చరిత్ర :-

నాటి మద్రాసు ప్రెసిడెన్సీ యందు వైజాగపటం జిల్లా యందు సిక్కోలు ప్రాంతమునందు కొండజమీందారులతొ పాలకొండ సంస్థానము కూడా ప్రాచీనమైనదే. 108 జిరాయితీ గ్రామములు, 68 వ్యవసాయ గ్రామములు,49 అగ్రహారములు విస్తీర్ణము కలిగినది .వీరు విజయనగర సంస్థానమునకు లోబడి యుండి యుద్ధ సమయంలో సహకరించుటయే కాకుండా సాలునకు 52 వేల రూపాయలు కప్పము కూడా చెల్లించేవారు.

ఈ సంస్థానము కూడా జయపుర పాలకులు రూపొందించినదే. ఈ సంస్థానము ఏ చెడు ఘడియలు యందు అవతరించినదొ కానీ అనేక అరిష్టములు ఆవరించి పీడించి అంతరింప చేసెను. ఏ పాలకులు పట్టుమని పది సంవత్సరములు పాలించలేకపోయెను. పాలించిన కాలమున పరిసర రాజ్యములతొ కలహములు , కుటుంబ కలహములు కలిసి చుట్టుముట్టి పాలకొండ సంస్థానమును బ్రష్టు పట్టించెను.

పాలకొండ సంస్థాన పాలకులు కోదు లేక జాతాపు అను కొండజాతి వారు. జయపుర సంస్థానమును పాలకులు రాజా విశ్వంభరదేవు ( 1672 -1676 ) గారు ఈ కుటుంబము వారి మూలపురుషుడు అయిన దన్నాయి అనువారి కుమారుని నరేంద్రనాయుడు అను బిరుద ముతొ పాలకొండ, వీరఘట్టములకు జమీందారులు. ఈయన విలువిద్యయందు ఏకలవ్యునికి మించినవారని అందురు. కొండజమీందారులలొ తిరుగుబాటుదారులను అణిచివేత యందు విజయనగర పూసపాటి వారి పక్షము వహించుట వలన వీరు తిరుగుబాటుదారులతొ చేరలేదు. కానీ 1794 లొ పాలకొండ జమీందారు విజయరామరాజు విదేశీ ప్రభుత్వముపై కుట్రలు చేయుటవలన అధికారమునుండి తప్పించి ఈయన కుమారుడైన సీతారామరాజు నకు సంస్థాన భాద్యతలను 1796 లొ అప్పగించారు . ఈయన 1798 లొ మరణించుటవలన సోదరుడైన వెంకటపతిరాజునకు జమీందారీ సంక్రమించినది. పదవీభ్రష్టులైన విజయరామరాజు కొంత సేనను ప్రోగుచేసి వీరఘట్టము కేంద్రముగా చేసుకొని అరాచకచర్యలను చేయుచూ విదేశీ సేనలకు చిక్కకుండా అటవీప్రాంతంలో సంచరించెను.

విజయరామరాజు కొరకు విదేశీ సేనలు గాలింపు చర్యలు తీవ్రమగుటవలన నాగాపురము నకు పారిపోయారు. ఆసమయంలో వెంకటపతిరాజునకు కేవలం తొమ్మిది సంవత్సరాల వయస్సు మాత్రమే. అందువలన దీవానుగారయిన ఎల్లుమహంతి పరశురామపాత్రుడు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. 1803 లొ వెంకటపతిరాజునకు పూర్తి బాధ్యత చేపట్టారు కానీ వెంకటపతిరాజునకు వ్యసనాలకు దుబారా ఖర్చులు చేయుటవలన వార్షిక కప్పము చెల్లించలేక తరచుగా సంస్థానము జప్తులు జరుగుట దీవానుగారు జామీను వహించి జప్తునుండి ముక్తి కలుగుట జరుగుతుండేవి.ఇందువలన భేదాభిప్రాయాలు కలుచుండెడివి. విశ్వాసపాత్రుడయిన దీవానును జగన్నాథపాత్రుడను ఆయన సోదరుని

వెంకటరాయుడను మేనల్లుడు పాపారాయుడు సాయుధ సేనతొ వచ్చి  1828 లొ హత్య చేశారు. అక్కడితో రాజగు వెంకటపతిరాజునకు జమీందారీపై పట్టు కొల్పొయారు. తిరుగుబాటుదారులు , దోపిడీదారులు రెచ్చిపోయారు. ప్రజలు మొండికెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటపతిరాజు అక్టోబరు 1828 లొ మరణించారు.

వెంకటపతిరాజునకు ఎనిమిది మంది భార్యలు. ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు.

పెద్దలక్ష్యీనరసయ్య పట్టమహిషి తాళికట్టిన భార్య. ఈమెకు సంతతి లేదు. ఇతరులు పెద్దజగ్గయ్య అను వేశ్య ఈమె పుత్రుడు కూర్మరాజనరేంద్రరావు. చిన్నజగ్గయ్య కుమారుడు విజయరామరాజు. వెంకటలక్ష్మయ్య కుమారుడు నీలాద్రిరాజునరేంద్రరావు. ఇతర భార్యలు సీతయ్య , చామలయ్య ,సుందరయ్య ,సుభద్రయ్య. వెంకటపతిరాజు మరణంతో సంస్థానాధిపత్యమునకు వివాదములు ప్రారంభమయ్యాయి. మైనరగు కూర్మరాజనరేంద్రరావుని వారసునిగా 1829 లొ కంపెనీ వారు గుర్తించి రాజాగారి వితంతు భార్యయగు చామలయ్యను ఎష్టేటు మేనేజర్ గా నియమించి ప్రభుత్వ పర్యవేక్షణలోనికి వచ్చినది. కానీ మైనరు జమీందారగు కూర్మరాజనరేంద్రరావు మరియు మేనేజరగు చామలయ్య మధ్య సఖ్యత లేదు. మిగిలిన భార్యల మధ్యకూడా సఖ్యత లేక ఎవరికివారు తమతమ కూటములు ఏర్పరుచుకొని వివాదములకు కారణభూతులయ్యారు.

తదుపరి మైనరగు కూర్మరాజు జమీందారునకు పద్మనాభాచార్యులను సంరక్షకునిగా నియమించారు కానీ వీరియోక్క అంతఃకలహములు పరాకాష్ట పొంది సంస్థానమునందు పూర్తిగా అల్లర్లు అరాచకములు అధికమయ్యాయి. 1831లొ కూర్మరాజు మేజరు అయినప్పటికి 93 వేల రూపాయలు కప్పము బకాయిలు ఉన్నాయి. కుట్రలు కుతంత్రాలు పెచ్చుమీరాయి. 1837 లొ కూర్మరాజును జమీందారీ నుండి తప్పించి 1846 వరకూ కలెక్టర్ అజమాయిషీలొ జమీందారీ పాలన సాగింది. తదుపరి జమీందారీని అర్భత్ నాట్ కంపెనీకి కవులునకు ఇచ్చారు మరికొంతకాలానికి ప్రభుత్వ పరమైనది. బ్రిటిష్ కంపెనీ వారు పాలకొండ జమీందారీ కుటుంబమునందు ముఖ్యపరివారమును ఖైదుచేసి రాయవేలూరు కొటయందు నిర్భందించారు. కూర్మరాజు నకు మరణశిక్ష విదించారు కానీ తదుపరి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయన తల్లి పెద్దజగ్గయ్యను గుత్తి కోటయందు ఖైదీ చేశారు. విజయరామరాజు ఇతరులను రాయవేలూరు యందు ఖైదు చేశారు.1843 లొ కూర్మరాజు గుత్తి కోటయందు మరణించారు. 1844 లొ నీలాద్రిరాజు రాయవేలూరు యందు మరణించారు. 1869 లొ మద్రాసు గవర్నర్ రాయవేలూరు సందర్శించినపుడు పాలకొండ కుటుంబ సభ్యులను పరామర్శించి  విజయరామరాజును విడుదల చేసి కృష్ణానదీ తీరమునందు నివాసం చేయవచ్చునని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ విజయరామరాజు ఆయన సవతి తల్లి సుభద్రయ్య, సవతి చెల్లెలు చంద్రయ్యమ్మ కూడా ఉన్నారు. కంపెనీ వారు నెలకు 17 రూపాయలనుండి 250 రూపాయలు వరకూ పెంచారు. పాలకొండ శేష జమీందారీ సభ్యులు ఇరవై శతాబ్దం వెలుగు చూడక రాయవేలూరు కోటయందు వీరి వంశము అంతరించింది.

గణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101

రవాణా సదుపాయాలు[మార్చు]

దగ్గరలోని రైల్వే స్టేషన్లు శ్రీకాకుళం, ఆముదాలవలస పార్వతీపురం. పొందూరు.

పాలకొండ శాసనసభ నియోజకవర్గం వివరాలు[మార్చు]

పాలకొండ పురపాలక సంఘం[మార్చు]

2014 ఎన్నికలు[మార్చు]

  • మొత్తం ఓటర్లు : 18420
  • పోలయిన ఓట్లు : 14215

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (26%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 పాలకొండ తెలుగుదేశం 15761 12
2014 పాలకొండ కాంగ్రెస్ 86 0
2014 పాలకొండ వై.కా.పార్టీ 3734 3

మూలాలు[మార్చు]

  1. "District Census Handbook-Srikakulam" (PDF). Census of India. pp. 26–28, 54. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాలకొండ&oldid=3425395" నుండి వెలికితీశారు