పార్వతీపురం
Jump to navigation
Jump to search
పార్వతీపురం | |
---|---|
పట్టణం | |
![]() పార్వతీపురం ప్రధాన రహదారి | |
నిర్దేశాంకాలు: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°ECoordinates: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పురపాలక సంఘం |
• నిర్వహణ | పార్వతీపురం పురపాలకసంఘం, బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (BUDA) |
• శాసన సభ్యుడు | Alajangi Jogarao |
విస్తీర్ణం | |
• మొత్తం | 7.24 km2 (2.80 sq mi) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 53,844 |
• సాంద్రత | 7,400/km2 (19,000/sq mi) |
భాష | |
• అధికారక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 535 501 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 91–8963 |
వాహనాల నమోదు కోడ్ | AP35 (Former) AP39 (from 30 January 2019)[3] |
జాలస్థలి | పార్వతీపురం పురపాలక సంఘం |
పార్వతీపురం, (వినండి: // ( listen)), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం.
భౌగోళికం[మార్చు]
రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 523 కి.మీ, సమీప నగరమైన విజయనగరానికి ఉత్తరంగా 87 కి.మీ దూరంలోవుంది.
జనాభా గణాంకాలు[మార్చు]
2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 53,844.
పరిపాలన[మార్చు]
పార్వతీపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు[మార్చు]
జాతీయ రహదారి 16 పై గల శ్రీకాకుళం నుండి ఈ ఊరికి రహదారి వుంది. జార్సుగూడ-విజయనగరం లైన్‌లో పార్వతీపురం వుంది. పార్వతీపురం రైల్వే స్టేషన్, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనే రెండు స్టేషన్లున్నాయి. సమీప విమానాశ్రయం 150 కి.మీ దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
దేవాలయాలు[మార్చు]
- కాశీవిశ్వనాథ దేవాలయం, అడ్డపుసిల: 5 కి.మీ దూరంలోగల చారిత్రక ఆలయం,
- శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తోటపల్లి: చిన్న తిరుపతిగా పేరొందినది.
- సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, బెలగాం: 1888లో నిర్మించబడింది.
- కేథలిక్ చర్చి,పార్వతీపురం.
జలాశయాలు, ఆనకట్టలు[మార్చు]
- ఝంజావతి రబ్బరు ఆనకట్ట: 15 కి.మీ దూరంలో వుంది. జలయజ్ఞం లో భాగంగా 2006 లో నిర్మించబడింది
- తోటపల్లి జలాశయం:నాగావళి నదిపై 2015 లో నిర్మించబడింది.
ప్రముఖ వ్యక్తులు[మార్చు]
- ఉప్మాక నారాయణమూర్తి -(1896 -1962) సాహితీ వేత్త, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
- ఎస్.వి.జోగారావుగా - ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
- గణేష్ పాత్రోగా - ప్రసిధ్ధి చెందిన సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
- వేపా కృష్ణమూర్తి
- గొబ్బూరి వెంకటానంద రాఘవరావు
- పంతుల జోగారావు
- బెలగాం భీమేశ్వరరావు - బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.

Wikimedia Commons has media related to Parvathipuram.
వెలుపలి లంకెలు[మార్చు]
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- Pages using infobox settlement with bad settlement type
- Pages including recorded pronunciations
- Commons category link is on Wikidata
- ఆంధ్రప్రదేశ్ జిల్లాల ముఖ్యపట్టణాలు
- పార్వతీపురం మన్యం జిల్లా మండల కేంద్రాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- పార్వతీపురం మన్యం జిల్లా
- పార్వతీపురం మన్యం జిల్లా పట్టణాలు