ఉప్మాక నారాయణమూర్తి
స్వరూపం
ఉప్మాక నారాయణమూర్తి (1896 - డిసెంబరు 21, 1962) ప్రముఖ సాహితీ వేత్త, అవధాని, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
జననం
[మార్చు]వీరు పార్వతీపురం దగ్గర బెలగాంలో 1896లో సంవత్సరం జన్మించారు. వీరికి చిన్నతనంలోనే భారత ఇతిహాసాలపై పట్టు సంపాదించారు. మద్రాసులో బి.ఎ. తెలుగులో ప్రథములుగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. మొదటి తరగతి న్యాయవాదిగా శిక్షణ పొంది పార్వతీపురంలో న్యాయవాదిగా నలభై సంవత్సరాలు పనిచేశారు. తెలుగు సాహితీ ప్రక్రియలలో అత్యంత కష్టమైన అష్టావధానాన్ని సునాయాసంగా జరిపేవారు. తన ప్రజ్ఞాపాటవాలతో అనేక పట్టణాలలో శతావధానాలు గావించి పేరు ప్రఖ్యాతులు, మన్ననలు పొందిన సాహితీ సామ్రాట్. వీరు 'ఆత్మానందకవి' బిరుదాంకితులు. తనకు ఇష్టమైన 'ఉత్పలమాల'లో 'మాలికా రామాయణం' రచన చేశారు.
మరణం
[మార్చు]వీరు 1962 డిసెంబరు 21 న పరమపదించారు.