పారమ్మకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో అతిపెద్ద శివలింగాకరంలో వుండే కొండపై పార్వతీదేవి వెలసిన స్థానం శ్రీ పారమ్మ కొండ క్షేత్రం . ఇక్కడ ప్రతి శివరాత్రి సమయంలో ఆంధ్ర ఒడిషా నుండి భక్తులు వచ్చి కొండ శిఖరంపై వెలసిన అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ కొండకు 600 మీటర్ల రోడ్డు వేసి ఉంది అక్కడ పాండవుల గుహ ఉంది దేశంలోనే అతిపెద్ద శ్రీ చక్రం,పురాతన భువనేశ్వరి ఆలయం,సుబ్రమణ్యస్వామి ఆలయం,మహాదేవి ఆలయాలు ఉన్నాయి అక్కడ నుండి కొండపైకి 1500 మెట్లు వుంటాయి . కొన్ని వందల సంవత్సరాల పూర్వం జైనుల కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర .పాండవుల వనవాస సమయంలో ఇక్కడ కొన్నాళ్ళు వున్నారని ఇక్కడ ఉన్న గుహకు పాండవులగుహ అని పేరు .

కొన్ని విశిష్టమైన రోజులలో అమావాస్య పున్నమి అర్ద రాత్రులలో కొండపై జ్యోతులు దర్శనమిస్తాయని కొండక్రింద గ్రామాలలో గల గిరిజనులు చెప్తారు. ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో స్థానికులు గిరిజనులు కొండపై పూజలు నిర్వహిస్తారు....

విజయనగరం జిల్లా సాలూరు ప్రాతంలో అతి ఎత్తయిన కొండపై అతిపురాతనమైన పార్వతీదేవి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్ఠించి ఉండొచ్చు అని పురావస్తు శాక వారు నిర్థారించారు..అమ్మవారి విగ్రహం పై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు..ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అమ్మవారు వెలసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది.. చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరం పైఅమ్మవారి విగ్రహాన్ని కొన్ని వందల ఏళ్ళకు పూర్వం దేవతలు ప్రతిష్ఠించారు ... దేవతలు ఇక్కడ నిత్యం ధ్యానం చేస్తారు అంట. మహిమ గల అమ్మవారి విగ్రహం 36చేతులుశిరస్సుపైశివుడుకలిగిప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది... జైన్ లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాలలో కూడా మన అమ్మవారి చరిత్రవుంది ... అమ్మవారి రూపం ఒక్కోసమయంలో ఒక్కోలా ఉంటుంది.ఒకసారి నవ్వుతు ఒకసారిచిన్నపిల్లలా ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మలా ఇలా చాలా రకాలుగా అమ్మవారివిగ్రహంమారుతూమారుతూమనకుకనిపిస్తుంది... కొన్ని విశిష్టమైన రోజుల్లో మరియుఆమావాస్యరాత్రులలో కొండపైవెలుగులతో కూడిన జ్యోతుల కనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చుసినకొండక్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు... నిదర్శనంగా ఇప్పుడు కూడా అమ్మవారిని దేవతలు శక్తులు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం . కొండ మధ్యలో ఓ గుహ వుంది ఇక్కడ పాండవులు వనవాస సమయంలో కొద్దిరోజులు ఉన్నారట అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు... ఆ గుహలో చాలా పురాతన శివలింగం వుందంటా...కొండపై హనుమంతు అనే కోతి జాతి గుంపు ఒకటుంది ఇవి 3నుండి 5 అడుగుల ఎత్తు ఉంటాయి.. అప్పుడప్పుడు కొండపై ఎలుగుబంట్లు కనిపిస్తాయి. ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్దులు వస్తాయి అని నమ్మకం... సిద్దులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్దేస్వరి అని .. చేతిలో చక్రాలు వున్నాయి కనుక చక్రేస్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని వనదుర్గ అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు. కాని స్థానికులు మాత్రం పారమ్మతల్లి గానే కొలుస్తారు.. దేవతలచే నిత్యం పూజింపబడే అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రిరోజునమాత్రమే వేలమందిభక్తులు దర్శిస్తారు.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా అమ్మను సనాతన ధర్మపరిషత్ భక్తులు దర్శించి పూజలు చేస్తున్నారు ... మిగతారోజుల్లో ఈ కొండ ఎక్కడం చాలా కష్టం.. ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలిఅంటే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే.. (పారమ్మతల్లి చరిత్ర)