అరకు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అరకు
—  kantabamsguda  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం దుంబిరిగూడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,279
 - పురుషుల సంఖ్య 1,086
 - స్త్రీల సంఖ్య 1,193
 - గృహాల సంఖ్య 574
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
అరకు లోయ
నాట్యం చేస్తున్న గిరిజనులు.

అరకు, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము.[1]

అరకు లోయ 18.3333° N 82.8667° E[2] సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.

అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటాక ఆకర్షణ. తూర్పు కనుమలులో ఉన్న అరకులో కొన్ని తెగల వారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.

ప్రయాణ మార్గాలు[మార్చు]

విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే (ఈస్ట్ కోస్టు రైల్వే) లైను కొత్తవలస-కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లో ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి (ఉదయం సుమారు 6:50AM ) . అది అలా కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషను వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషను అంటారు. ఇక వెళ్లే దారిలో బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణంలో చూడవచ్చు. అరుకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి .

ప్రయాణానికి అనువైన సమయం మొత్తం సంవత్సరంలో ఎప్పుడైన వెళ్ళవచ్చు. వేసవిలో వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు . శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం ఐతే పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు వర్షాని తడవని బట్టలు, గొడుగులు పట్టుకెళ్ళటం మంచిది.

వర్తక వాణిజ్యాలు గిరిజనులు తయారు చేసే వస్తువులు అమ్ముతారు . గిరిజనాభివృధ్ధి సంస్థ అమ్మే స్వచ్ఛమైన తేనె మొదలైనవి కొనవచ్చు.

తిరుగు ప్రయణం: బస్సు ప్రయాణం మంచిది. లేదంటే ఒక వాహనంఅద్దెకు తీసుకుంటే అన్నీ చూడవచ్చు. వచ్చే దారిలో త్యాడ/టైడా (Tyada) లో జంగిల్ బెల్స్, అనంతగిరి కాఫీ తోటలు లాంటివి చూడవచ్చు. సుందరమైన ఈ ప్రదేశం మన రాష్ట్ర పర్యాటకులనే కాకుండా అనేక రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటోంది.

పాలనా విభాగాలు[మార్చు]

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవిన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది పాడేరు రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

చూడవలసిన ప్రదేశాలు[మార్చు]

 • అరకు విశఖపటణం ఫొటొలు
 • బొర్రా గుహలు
 • పద్మాపురం గార్డెన్స్
 • ట్రైబల్ మ్యూజియం
 • చాపరాయి
 • మత్స్యగుండ౦
 • కవిటి వాటర్ ఫాల్స్
 • రణ జల్లెడ వాటర్ ఫాల్స్
 • అనంత గిరి వాటర్ ఫాల్స్
 • త్యాడ/టైడా (Tyada) జంగిల్ బెల్స్
 • అరకు

ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండ చుట్టు పక్కల చిన్న, చిన్నవి కొన్ని ఆకర్షణలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 279 - పురుషుల సంఖ్య 1, 086 - స్త్రీల సంఖ్య 1, 193 - గృహాల సంఖ్య 574

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2115.[3] ఇందులో పురుషుల సంఖ్య 1016, మహిళల సంఖ్య 1099, గ్రామంలో నివాసగృహాలు 479 ఉన్నాయి.

చిత్రమాలిక[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 279 - పురుషుల సంఖ్య 1, 086 - స్త్రీల సంఖ్య 1, 193 - గృహాల సంఖ్య 574

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. Falling Rain Genomics.Araku
 3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13
"https://te.wikipedia.org/w/index.php?title=అరకు&oldid=2228478" నుండి వెలికితీశారు