కిరండూల్
కిరండూల్ | |
---|---|
పట్టణం | |
జనాభా (2001) | |
• Total | 19,053 |
భాషలు | |
• అధికార | హిందీ, Chhattisgarhi |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 494556 |
కిరండూల్ చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణం బైలడీలా పర్వత శ్రేణులలో ఉంది. ఈ పట్టణం యొక్క పూర్వ నామం కిరణ్‌దుర్గ్. కాలక్రమంలో కిరండూల్‌గా మారింది. ఈ ప్రదేశం నాణ్యమైన ముడి ఇనుముకు ప్రసిద్ధి.
నేపధ్యము
[మార్చు]1040 - 1950 మధ్యకాలంలో జపాన్ దేశం నుండి వచ్చిన ఒక బృందం ఇక్కడి ఇనుప ఖనిజం నాణ్యతను పరిశీలించుటకు వచ్చింది. తరువాత భారత జాతీయ ఖణిజాభివృద్ది సంస్థ, జపాన్ దేశ సహకారంతో ఇక్కడ మొదటిసారిగా ఇనుము శుద్ధి పరిశ్రమను ప్రారంభించింది.
సంస్కృతీ సంప్రదాయాలు
[మార్చు]ఇక్కడ ఖనిజ పరిశ్రమ వేళ్ళూనుకోడంతో పలు ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీనితో దేశంలో అనేక ప్రాంతాలనుండి ప్రజలు జీవనోపాధి వెతుక్కుటూవచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దీనితో ఇక్కడ మిశ్రమ సంస్కృతి కానవస్తుంది. ప్రజల ప్రధాన భాష హింది. దీనితో బాటు ఆంగ్లము, బెంగాలీ. తెలుగు, తమిళం, ఇతర ప్రధాన భాషలు మాట్లాడేవారిని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ప్రజలు రాముడు, సీతను పూజిస్తారు. పట్టణంలో ఒక రామాలయము, కపిలాలయము, తొమ్మిది చర్చిలు, రెండు మసీదులు ఉన్నాయి. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలు వారివారి భాషా సమితులను ఏర్పరుచుకున్నాయి. దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.
పర్యాటకము
[మార్చు]కెకే లైన్ గా పిలవబడే కొత్తవలస కిరండూల్ రైలు మార్గం పర్యాటక ప్రియులకు స్వర్గదామము. ఈ మార్గంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొర్రా గుహలు, అరకులోయ ఉన్నాయి. విశాఖపట్నం నుండి కిరండూల్ ప్రయాణం కొండలు, కోనల మధ్య మరపురానివిధంగా సాగుతుంది. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది.