బైలడీలా
బైలడీలా పర్వత శ్రేణి | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | పేరు లేని శిఖరం, దెంతెవాడ జిల్లా, చత్తీస్‌గఢ్ |
ఎత్తు | 1,276 మీ. (4,186 అ.) |
కొలతలు | |
పొడవు | 70 కి.మీ. (43 మై.) SW-NE |
వెడల్పు | 25 కి.మీ. (16 మై.) NW-SE |
భౌగోళికం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | Chhattisgarh |
Range coordinates | 18°42′00″N 81°13′10″E / 18.70000°N 81.21944°E |
అధిరోహణం | |
సులువుగా ఎక్కే మార్గం | Hike |
బైలడీలా పర్వత శ్రేణి చత్తీస్‌గఢ్‌లో విస్తరించిన ఒక పర్వత శ్రేణి. దక్కను పీఠభూమికి ఈశాన్యంలో తూర్పు కనుమల నుండి 200 కి, మీ. పశ్చిమంగా ఈ పర్వత శ్రేణి మొదలైంది. ఎద్దు మూపురం ఆకారంలో ఉండడం చేత దీనికి ఆ పేరు వచ్చింది. దెంతెవాడ జిల్లా లోని కిరండూల్ పట్టణం ఈ పర్వత శ్రేణి ఉంది.[2]
భౌగోళికం
[మార్చు]బైలడీలా శ్రేణి దక్కను పీఠభూమిలో నైఋతి నుండి ఈశాన్య దిశగా విస్తరించింది. ఇంద్రావతి నదికి దక్షిణాన 70 కి.మి.. పొడవిన ఈ శ్రేణి ఉంది.[3] దెంతెవాడకు 40 కి.మీ. దూరంలో ఈ శ్రేణి ఉంది..[4] ఈ శ్రేణిలో 1,276 మీ. ఎత్తున్న శిఖరం చత్తీస్‌గఢ్లోకెల్లా ఎత్తైన బిందువు. ఒకప్పుడు ఈ కొండలు దట్టమైన అడవులతో నిండి ఉండేవి. కానీ ఇక్కడ లభించే ఇనుప ఖనిజం కోసం పెద్ద యెత్తున గనులు తవ్వడంతో కొండలపై చాలా చోట్ల గాట్లు పడ్డాయి.[5]
బైలడీలా పర్వత శ్రేణులలో 14 చోట్ల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ 14 నిక్షేపాలలో రెండు నిక్షేపాలు కిరండూల్ దగ్గర, ఒక నిక్షేపం బచేలీ దగ్గర ఉన్నాయి. కిరండూల్ & బచేలీ ఇనుప గనుల నుంచి విశాఖపట్నం ఓడరేవుకి రైలు మార్గం ద్వారా ఇనుప ఖనిజం రవాణా అవుతోంది.
మూలాలు
[మార్చు]- ↑ Bailadila range highest point (1276m), Highest point in Chhattisgarh
- ↑ "Bailadila Hills, Dantewada district, Chhattisgarh" (PDF). Archived from the original (PDF) on 2020-10-30. Retrieved 2020-06-14.
- ↑ Sunder lal Hora (1949). "Geographical Features of the Flora of the Bailadila Range in Bastar State" (PDF). Retrieved 2020-07-13.
- ↑ The Journal of the Bombay Natural History Society - Google Books
- ↑ "National Mineral Development Corporation, Dantewada district, Chhattisgarh". Archived from the original on 2017-03-01. Retrieved 2015-10-21.