టైడా
టైడా విశాఖపట్నంకు సమీపంలో తూర్పుకనుమల్లో దట్టమైన అడవుల్లో ఉన్న కుగ్రామం.[1] ఇది విశాఖ నుంచి అరకు వెళ్ళే దారిలో విశాఖ నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం అనేక వృక్ష, జంతు జాతులకు ఆలవాలం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా జంగిల్ బెల్స్ నేచర్ క్యాంప్ పేరుతో ఒక కుటీరాన్ని నిర్మించారు. సుమారు ఐదు ఎకరాల్లో విస్తరించబడి ఉన్న 18 కాటేజీలు ఒక పర్యావరణ హిత ప్రాజెక్టు.[2] అంటే పర్యావరణానికి హాని చేయకుండా పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసిన ఏర్పాటు. ఇక్కడి నుంచి చూస్తే అందమైన తూర్పు కనుమలను దర్శించుకోవచ్చు. పర్వతారోహణకు, వివిధ రకాలైన పక్షుల్ని సందర్శించేందుకు ఏర్పాట్లున్నాయి. బాణాలతో విలువిద్యను పరీక్షించుకోవడానికి కూడా సౌకర్యం ఉంది. బస చేయడానికి చుట్టూరా ప్రశాంతమైన వాతావరణంలో అందమైన కుటీరాలు నిర్మించారు. ఇంకా చెక్కతో చేసిన గుడిసెలు, చెట్లపై ఇళ్ళు ఉన్నాయి.[3]
ఈ క్యాంపు నుంచి ఉదయాన్నే నాలుగు కిలోమీటర్లు నడిస్తే దట్టమైన అడవిలోకి చేరుకోవచ్చు. దారిలో కొన్ని గిరిజన గ్రామాలు కూడా సందర్శించవచ్చు.[2]
-
అరకు లోయ
-
టైడా
-
టైడా స్టేషన్
-
టైడా
-
బేబీ మంకీ అమ్మతో..
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామంల్ అరకు నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. హైదరాబాదు నుంచి సుమారు 630 కిలోమీటర్లు. విశాఖ పట్నం నుంచి అరకు వెళ్ళే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Tyda, Araku Valley". aptourism.gov.in. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ. Archived from the original on 22 నవంబరు 2016. Retrieved 16 October 2016.
- ↑ 2.0 2.1 లాస్య, రామకృష్ణ. "అందాల అరకు లోయ(పర్యాటకం)". gotelugu.com. గో తెలుగు. Retrieved 17 October 2016.
- ↑ "Tyda - Araku Valley". telugu.nativeplanet.com. Retrieved 17 October 2016.
- ↑ "Tyda Nature Camp, Araku Valley". trawell.in. trawell. Retrieved 16 October 2016.