Jump to content

అడవి

వికీపీడియా నుండి


కాలిఫోర్నియా లోని కోనిఫెరస్ అడవి.
స్లోవేనియాలో ఆకురాల్చే విశాలమైన (బీచ్) .
వాషింగ్టన్‌లోని శాన్ జువాన్ ద్వీపంలో ఒక అడవి.
జపాన్‌లోని ఒసాకా అడవి.

అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.

నిర్వచనం

[మార్చు]

సామాన్యంగా వృక్షాలు దట్టంగా ఉండే ప్రదేశాన్ని అడవి లేదా అరణ్యం అంటారు. కానీ అడవికి సంపూర్ణమైన నిర్వచనం లేదు.[1]

కోనిఫెరస్ అడవులు

[మార్చు]

కోనిఫెరస్ అడవులు (Coniferous Forests) శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. ఎక్కువ వర్షపాతం, పటిష్ఠమైన రుతు శీతోష్ణస్థితులు, చాలాకాలం కొనసాగే అతి శీతాకాలం, కొద్దికాలం ఉండే వేసవికాలం, ఈ అడవులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఖండాలను కలుపుతూ వరుసగా పెరుగుతాయి. ఉత్తర అమెరికా, యూరేసియా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్, సైబీరియా దేశాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. సతతహరిత వృక్ష జాతులైన పైన్, స్ప్రూస్, ఫర్ మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి. చెవుల పిల్లులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, ఉడతలు, హైలా, రాఅనా, అనేక జాతుల పక్షులు, పెద్ద శరీరంతో ఉండే సకశేరుకాలు మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మృత్తిక పలుచగా హ్యూమస్ రహితంగా ఉంటుంది. మట్టి సారవంతమై ఉండదు. కోనిఫెర్ ల గింజలు జంతువులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.

ఆక్కూరలిచ్చే సమశీతోష్ణ అడవులు

[మార్చు]

ఆక్కూరలిచ్చే సమశీతోష్ణ అడవులు (Tropical Deciduous Forests) శీతోష్ణస్థితి సమంగా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ చెట్లు వెడల్పు ఆకులతో ఉంటూ, వర్షాకాలంలో ఆకులు రాల్చి, చలికాలంలో పత్రరహితంగా ఉండి, వసంతకాలంలో తిరిగి చిగుర్చుతాయి. ఇవి ఉత్తర అమెరికా, ఐరోపా, తూర్పు ఆసియా, చిలీ, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన దేశాలలో ఉన్నాయి. అతి శీతలంగా ఉండే చలికాలం, సంవత్సరానికి 80-180 సెం.మీ. వర్షపాతం, 10-20 డిగ్రీల వేడిమి ఈ అడవుల ముఖ్య లక్షణాలు. చెట్లు 40-50 మీ. ఎత్తు పెరుగుతాయి. ఓక్, బీచ్, కాడన్ ఉడ్, ఎల్మ్ వంటి పెద్ద వృక్షాలు ఉంటాయి. నాచులు, శైవలాలు, లైకేన్లు వృక్ష కాండాలమీద పెరుగుతాయి. జింకలు, ఎలుగుబంట్లు, ఉడతలు, నక్కలు, వడ్రంగి పిట్టలు, తాబేళ్లు, బల్లులు, పాములు ముఖ్యమైనవి. క్షీరదాలలో పందులు, పర్వత సింహాలు ఉంటాయి.

సతతహరిత సమశీతోష్ణ అడవులు

[మార్చు]

సతతహరిత సమశీతోష్ణ అడవులు (Tropical Evergreen Forests) మధ్యధరా ప్రాంతానికి చెందిన శీతోష్ణ పరిస్థితులలో పెరుగుతాయి. పొడిగా ఉండే ఎండాకాలం, అతిచల్లని శీతాకాలం ఉండటం దీని లక్షణం. ఈ వృక్షాలకు చిన్నగా సూది ఆకారంలో ఉండే ఆకులు గానీ, కొద్ది వెడల్పుగా ఉండే ఆకులు గానీ ఉంటాయి. దీనిలో మహావృక్షాలు ఉండవు. చెట్లు 3.8 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ అడవులు ఎక్కువగా కాలిపోతుంటాయి. అందువల్ల ఇక్కడి చెట్లు త్వరగా పునరుత్పత్తి చేసుకోగలిగే అనుకూలనాలతో ఉంటాయి.) కంచర గాడిదలు, జింకలు, కుందేళ్ళు, అడవి ఎలుకలు, బల్లులు ఇక్కడ ఉండే ముఖ్యమైన జంతువులు. వేగంగా పరుగెత్తే ఖురిత జంతువులు, దుమికే జంతువులు, ఇక్కడ నివసించే ముఖ్యమైన శాకాహార జీవులు.

వర్షాధార సమశీతోష్ణ అడవులు

[మార్చు]

వర్షాధార సమశీతోష్ణ అడవులు (Temperate Rain Forests) ఉష్ణోగ్రత, వర్షపాతం సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుంది. వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పొగమంచు బాగా దట్టంగా అలుముకొని ఉండి, వర్షం కంటే ఎక్కువగా నీటిని భూమికి అందిస్తుంది. ఇవి ఉత్తర అమెరికా లోని పసిఫిక్ తీరంలోను, ఆస్ట్రేలియా, టాస్మానియా లోను ఉన్నాయి. రెడ్ ఉడ్ వృక్షాలు, యూకలిప్టస్ బాగా పెరుగుతాయి.

వర్షాధార ఉష్ణమండల అడవులు

[మార్చు]

వర్షాధార ఉష్ణమండల అడవులు (Tropical Rain Forests) భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణోగ్రత, తేమ రెండూ కూడా ఎక్కువగా స్థిరంగా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. సంవత్సర వర్షపాతం 200-225 సెం.మీ. ఏడాది పొడవునా సమంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, దక్షిణఆఅసియా, మలయా, బోర్నియా, న్యూగినీ, ఆస్ట్రేలియా లలో ఉన్నాయి. ఈ రకం అడవులలో వృక్ష జాతుల్లో వైవిధ్యం బాగా కనిపిస్తుంది. వృక్షాలు బాగా దగ్గర దగ్గరగా, చాలా ఎత్తు పెరిగి దట్టమైన అడవులుగా ఏర్పడతాయి. ఆకురాల్చే చెట్లు ఉన్నా అన్నీ ఏకకాలంలో ఆకులను రాల్చవు గనుక ఈ ఆడవులు సతతహరితంగా ఉంటాయి. ఆకులు మందంగా, ముదురు రంగులో ఉంటాయి. ఇక్కడ అకశేరుకాలు సమృద్ధిగా ఉంటాయి. పురుగులు, నత్తలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలె పురుగులు, కీటకాలు జలగలు ప్రముఖంగా చెప్పుకోదగ్గవి. సకశేరుకాలలో వృక్షవాసులు, నిశాచరులు ఎక్కువ. భారతదేశంలో ఈ అడవులలో ఏనుగులు, పెద్ద పులులు, సాంబార్ జింక, మచ్చల జింక మొదలైన క్షీరదాలు ఉన్నాయి.

రుతుబద్ధ ఉష్ణమండల అడవులు

[మార్చు]

రుతుబద్ధ ఉష్ణమండల అడవులు (Tropical Seasonal Forests) లో సంవత్సరపు వర్షపాతం చాలా ఎక్కువ. అయితే దీనిలో తేమతో కూడినది గాను లేదా తేమ లేనిది గాను విభజించబడి ఉంటుంది. ఇవి దక్షిణ, మధ్య అమెరికాలో తూర్పు దక్షిణ ఆసియాలో, పశ్చిమ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఉష్ణమండల ద్వీపాలలో ఉంటాయి. వీనిలో వృక్షాలు 40 మీ. ఎత్తు వరకు పెరుగుతాయి.అతి ఎత్తులో ఆకురాల్చే వృక్షాలు, కొద్దిగా కిందుగా సతత హరిత వృక్షాలు ఉంటాయి. ఈ విధంగా ఇవి రెండు అంతస్తులుగా అమరి ఉంటాయి.ఇక్కడ టేకు, వెదురు చెట్లు బాగా పెరుగుతాయి.

అడవుల ఉపయోగాలు

[మార్చు]

ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది.[2]

  • జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.
  • వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.
  • వరదలు రాకుండా నివారిస్తాయి.
  • కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి. దీనిని గృహనిర్మాణంలో, చాలా పరిశ్రమలలో ముడి పదార్థముగా వినియోగిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

అడవి జంతువుల అక్రమ రవాణా

మూలాలు

[మార్చు]
  1. Lund, H. Gyde (coord.) 2006. 'Definitions of Forest, Deforestation, Afforestation, and Reforestation'. Gainesville, VA: Forest Information Services. Available from : http://home.comcast.net/~gyde/DEFpaper.htm
  2. ప్రీతిపాల్ సింగ్ పుస్తకం ఎన్ ఇంట్రొడక్షన్ టు బయోడైవర్సిటీ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి&oldid=4373102" నుండి వెలికితీశారు