రెవెన్యూ డివిజను
![]() | ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
![]() | This article or section is being initially created, or is in the process of an expansion or major restructuring. You are welcome to assist in its construction by editing it as well. If this article or section has not been edited in several days, please remove this template. If you are the editor who added this template and you are actively editing, please be sure to replace this template with {{in use}} during the active editing session. Click on the link for template parameters to use.
This article was last edited by యర్రా రామారావు (talk | contribs) 4 నెలల క్రితం. (Update timer) |
రెవెన్యూ విభాగం, అనేది కొన్ని భారతీయ రాష్ట్రాలలోని పరిపాలనా విభాగం.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజనల్ అధికారి నేతృత్వం వహిస్తాడు.[1]ఇది కొన్ని మండలాలు లేదా తహసీళ్లు కలిగి ఉన్న భౌగోళిక ప్రాంతం.మండలాలు లేదా తహసీళ్లుపరిధిలో జనాభా , విస్తీర్నం, పరిపాలన సౌలభ్యం ప్రాతిపదికన కొన్ని గ్రామాలను కలిగి ఉంటుంది.రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తన అధికార పరిధిలోని మండలాలు లేదా తహసీళ్లు కలిగి ఉన్న భౌగోళిక ప్రాంతానికి చెందిన కొన్ని ఆర్థిక, పరిపాలనా అధికారాలు కలిగిఉంటాడు.
చరిత్ర[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అందులో కోస్తా జిల్లాలనందు 36 రాయలసీమ జిల్లాల నందు 14 ఉన్నాయి. ఇవి రెవిన్యూ డివిజినల్ అధికారి (ఆర్.డి.వో. లేదా సబ్ కలెక్టర్ ) పాలనలో ఉంటాయి. ఒక్కో డివిజన్ లో కొన్ని మండలాలు ఉంటాయి. మండలాల్లో తహసీల్దారులు (పూర్వం ఎం.ఆర్.ఓ) ఉంటారు. భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, భూసేకరణ, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, పంచాయతీల పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామాలు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు కలెక్టర్ తరుపున తహసీల్దారుల లాగానే హాజరవుతూ ఉంటారు. ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులు ఈ అధికారే సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు. 1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 11 లక్షల మందికి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.ఓ. పరిధిలో ఉంటున్నారు. ఐ.ఏ.ఎస్. అధికారుల్ని ముందు రెవిన్యూ డివిజినల్ అధికారులుగానే నియమిస్తారు. అప్పుడు వాళ్ళను సబ్ కలెక్టర్ అంటారు. ప్రతి జిల్లాలో సబ్ కలెక్టర్ కోసం ఒక రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఏ.పి.పి.యస్.సి. ద్వారా గ్రూప్1 పరీక్షలు పాసై వచ్చే డిప్యూటీ కలెక్టర్లను రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. తహసీల్దారులకు కూడా ప్రమోషన్ ఇచ్చి రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. పూర్వం బ్రిటీష్ పాలకులు భూమిశిస్తు వసూళ్లకోసం నియమించుకున్న వారే కలెక్టర్లు. ఇప్పుడు భూమిశిస్తు వసూళ్ల ప్రాధాన్యత తగ్గిపోయి సంక్షేమ కార్యక్రమాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్లు జిల్లాల ప్రగతి రథ సారధులయ్యారు. కలెక్టర్ల సహాయకులే ఈ సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్.డీ.ఓలు. రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది. రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి. హైదరాబాదు చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు. అలా కాకుండా ప్రతి శాసన సభ్యులు నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే భౌగోళిక సరిహద్దులు శాసన సభ్యులుకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు. ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు. శాసన సభ్యులులకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి. ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గం రెండు మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకాకుండా ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా, మరీజనాభా ఎక్కువైతే కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేలా పునర్వ్యవస్థీకరించటానికి ప్రభుత్వం ల్యాండ్ రెవిన్యూ కమీషనర్ అధ్యక్షతన కమిటీని నియమించింది. (వార్త 28.7.2008).
- జాయింట్ కలెక్టర్ ల పై పనిభారం తగ్గించేందుకు 24 అదనపు జాయింట్ కలెక్టర్లు (నాన్ కేడర్) ను నియమించారు.
అప్పగించిన బాధ్యతలు:
- జిల్లా స్థాయిలో సాంఘిక, బీసీ, మహిళా, శిశు, వికలాంగ, గిరిజన, మైనారిటీ, యువజన సంక్షేమానికి సంబంధించిన పథకాలు.
- బలహీనవర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు భూసేకరణ
- బలహీనవర్గాల గృహనిర్మాణం
- దేవాదాయ, విద్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు
- వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖల పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణ
- కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడం.
కొత్త రెవెన్యూ డివిజన్లుకు మార్గదర్శకాలు[మార్చు]
- ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10-15 మండలాలు, 2-3 శాసనసభ నియోజక వర్గాలు ఉంటాయి. చిట్టచివరి మండలం కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి.
- గిరిజన ప్రాంతాల్లోనైతే ఈ దూరం 50-60 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలి.వీలైతే ఏజెన్సీ మండలాలన్నీ ఒక రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకురావాలి, పట్టణ ప్రాంతాల్లో 7-9 మండలాలతోనే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి.
- డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాలకు మధ్యలో ఉండాలి. (ఈనాడు2.6.2011)
రెవిన్యూ డివిజన్లులో దొరికే సమాచారం[మార్చు]
- భూముల కబ్జాదారుల వివరాలు, ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నభూమి వివరాలు.
- భూములపై కోర్టులో పెండింగ్ కేసులు.
- పట్టాదారు పుస్తకాలు, రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలు.
- కుల,నివాస,ఆదాయ,పహాణీ, అడంగళ్ ధ్రువీకృత పత్రాలు.
- మిగులు భూముల వివరాలు.
- అసైన్డ్ భూముల జాబితా, యజమానుల వివరాలు.
- ఆపద్భందు పథకం అర్హతలు, నమూనా దరఖాస్తు పత్రాలు.
- ముఖ్యమంత్రి సహాయ నిధి అర్హతలు, లబ్ధిదారుల వివరాలు.
- ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు చెల్లించిన పరిహారం, రైతుల పేర్లు, చిరునామాలు.
- భూభారతి పథకం సర్వే వివరాలు.
- ప్రభుత్వ భూముల వివరాలు.భూసేకరణ వివరాలు,
- బడుగు, బలహీన వర్గాల కోటాలో నివాస స్థలాలు పొందిన లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, అర్హతలు.
- ప్రభుత్వ భూముల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారుల వివరాలు.
- సినిమా హాళ్లలో కనీస వసతుల వివరాలు
- బాలికా సంరక్షణ పథకం (జీపీఎస్)
- పాముకాట్లు, అగ్ని ప్రమాదాలు, చెట్లు మీద పడటం తదితర కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు వ్యక్తిగత ప్రమాద బీమాపథకం (పీఏఐఎస్)
- ఆయుధ లెసెన్సులు కలిగి ఉన్న వారి వివరాలు
- గ్రీవెన్స్‌సెల్‌లలో ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు
- కరవు నిధుల ఆడిట్ వివరాలు, డైక్లాడ్ సమాచారం
- ప్రధానమంత్రి సహాయ నిధి, లబ్ధిదారుల వివరాలు
- ఆపద్బంధు తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు
- శాంతిభద్రతల సమీక్ష వివరాలు, తనిఖీ నివేదికలు
- స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సమాచారం
- తహశీల్దార్ --- కార్యాలయాలలోని
- చౌక ధరల దుకాణాల వివరాలు
- అసైన్డ్ భూములు, పట్టాదారు పాసు పుస్తకాల సమాచారం
- గనుల వివరాలు, రిజర్వు స్థలాలు, జమాబంధి వివరాలు
- రెవెన్యూ రికార్డులు,1968 ఏపీ నాలా చట్టానికి సంబంధించిన సమాచారం
- గ్రామ రెవెన్యూ అధికారి .. కార్యాలయాలలోని
- 11 రకాల 'గ్రామ లెక్క'లతో కలుపుకుని మొత్తం 18 రకాల రికార్డుల వివరాలు
- అడంగల్ / పహాణీ, రేషన్ కార్డులున్న వారి చిరునామాలు
మినీ జిల్లాలు[మార్చు]
- ప్రస్తుతం ఆంధ్రలో 36 రెవిన్యూడివిజన్ కేంద్రాలు,రాయలసీమలో 14 రెవిన్యూడివిజన్ కేంద్రాలు మొత్తం 50 రెవిన్యూడివిజన్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకోసం అరవై రెవిన్యూడివిజన్లుగా చేసి వాటినే మినీ జిల్లాలుగా ప్రకటించబోతోంది.రెవెన్యూ డివిజన్‌ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.ఇప్పటివరకూ కేవలం రెవెన్యూ వ్యవహారాలకే పరిమితమైన ఆర్‌డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఇకపై ఆర్‌డీవోలు రెవెన్యూ డివిజన్‌లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్‌డీవో పరిధికి సమానంగా మారుస్తున్నారు.జిల్లా స్థాయిలో ఉండే అన్ని ప్రభుత్వ, సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు, వివిధ విభాగాలన్నీ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారులు నాలుగేసి వందల మంది ఉన్నారు. (ఆంధ్రజ్యోతి 25.10.2016)
ఆన్‌లైన్‌లో రెవిన్యూ సేవలు[మార్చు]
భూమి రికార్డులు, జమాబందీ, పాస్ పుస్తకాలు ధ్రువపత్రాలు, పాస్ పుస్తకాలు,కుల,నివాస,ఆదాయ ధ్రువపత్రాలు వంటి రెవెన్యూలోని కీలక సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందజేస్తున్నారు.భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్ శాఖకు, తహసిల్దార్లకు ఏమాత్రం సమన్వయం, సమాచారం ఉండడం లేదు. దీంతో, రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ప్రభుత్వానిదా? అసైన్‌మెంట్‌దా? పోరంబోకా? అన్నది తెలియడం లేదు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి.అందువలన తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయాలని భూముల క్రయ, విక్రయాల్లో రెండు శాఖల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Land Revenue Administration | Lands Of Maharashtra". www.landsofmaharashtra.com. Retrieved 2020-11-11.