తణుకు
తణుకు | |
— మండలం — | |
పశ్చిమ గోదావరి పటములో తణుకు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో తణుకు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°45′25″N 81°40′39″E / 16.756879°N 81.677456°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండల కేంద్రం | తణుకు |
గ్రామాలు | 8 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 90,430 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 82.40% |
- పురుషులు | 86.02% |
- స్త్రీలు | 78.82% |
పిన్కోడ్ | 534211 |
తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డుతో 72,348 జనాభాతో ఉండేది 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ లో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు మరియు వీరభద్రపురం విలీనం చేశారు అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధి 24.83 కి.మీ గా పెరిగి 34 వార్డు లో 90,430 మంది జనాభా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మరియు పాలకొల్లు తర్వాత తణుకు ఐదవ పెద్ద పట్టణంగా ఉంది.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాతం అసురుల (రాక్షసులు) యొక్క రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుచున్నది. పరిసర ప్రాంతాలలో ఈ కథనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లభ్యమవుచున్నాయి. అవి కొన్ని ఇక్కడ పొందు పరిచాము. ప్రస్తుత పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు) గానూ, ప్రస్తుత చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం) గానూ, అప్పటి ధాన్యాగారమే ఇప్పటి వడ్లూరు గానూ, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం) గానూ, బహుశా ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు.
ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే చాలా గ్రామాలకు పేరు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్ర పురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామమం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు.ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో గుడులు (ఆలయాలు) ఉండడం మనము గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ, అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. ఇవన్నీ ఎలా ఉన్ననూ తణుకు యొక్క ప్రశస్తి పురాణాలలో కూడా ఉన్నట్లు పండితులు చెబుతారు. ఆదికవి నన్నయ ఇక్కడే యాగం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు.[1]
భౌగోళికము[మార్చు]
- తణుకు 16o 45' ఉ, 81o 42' తూర్పు అక్షాంశ, రేఖాంశముల మధ్య ఉంది.
చరిత్ర[మార్చు]
గోస్తని నది పుణ్యజలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది.[2][ఆధారం చూపాలి]. వర్తమానంలో తణుకు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంది. వ్యవసాయకంగాను, పారిశ్రామికంగాను, విద్య, వైద్య రంగాలలోను తణుకు ఎంతో అభివృద్ధి చెందింది[ఆధారం చూపాలి]. తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం, వేల్పూరు గ్రామం రాజకీయ చైతన్యానికి, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞాన వినియోగానికి జిల్లా మొత్తంలో ముందువరుసలో ఉన్నాయి[ఆధారం చూపాలి]. భారతదేశంలో మొదటి సారిగా రాకెట్ ఇంధనం తయారి పరిశ్రమ తణుకులోనే ఏర్పాటు చేయడం జరిగింది/
తణుకులో కవులు[మార్చు]
- ఆది కవి నన్నయ్యభట్టు
- ముదిగంటి జగ్గన్న శాస్త్రి
- కళాప్రపూర్ణ పండిత పెనుమత్స సత్యనారాయణరాజు (తెలుగు రాజు)
- ఘండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి
- రంగినీని సత్యనారాయణ రాజు (రసరాజు)
- డా.వేదుల సూర్యనారాయణ శర్మ
- వేదుల సూరి
- పామర్తి రమణ
- డా.తంగిరాల సుబ్బారావు
- తాళ్లభట్టు పాపరాజు
- టి.వి.కె సోమయాజులు
- కొప్పర్తి వెంకటరమణమూర్తి
- పడాల సత్యనారాయణరెడ్డి
- కోట వేంకట లక్ష్మీనరసింహం - సహస్రావధాని
- అక్కిపెద్ది రామ సూర్యనారాయణ - అష్టావధాని
- రవి నాగ వెంకట శాస్త్రి రంగావఝుల
- రామారావు యిర్రింకి
- బి.వి.వి.ప్రసాద్ (హైకూ కవి,)
తణుకులో సాంస్కృతిక సేవా రంగాలు[మార్చు]
- శ్రీ నన్నయ భట్టారక పీఠం
- స్త్రీ సమాజం
- రామకృష్ణ సేవాసమితి
- శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సోసైటి
- రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు
- తణుకు లయస్స్ క్లబ్
రవాణా వ్యవస్థ[మార్చు]
రైలు రవాణా[మార్చు]
తణుకులో రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్, నిడదవోలు మధ్య ఉంది. ఇది సింగల్ లైన్, విద్యుదీకరణ లేదు. దాదాపు 20 పాసింజర్ & 10 ఎక్స్ప్రెస్ రైళ్లు తణుకు ద్వారా వెళ్ళి హైదరాబాదు, చెన్నై, బెంగుళూర్, విశాఖపట్నం, ముంబై స్టేషనులకు కనెక్ట్ అవుతాయి.
రోడ్డు రవాణా[మార్చు]
తణుకులో ఉన్న జాతీయ రహదారి-16 చెన్నై నుండి కలకత్తాకు కనెక్ట్ చేసి ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా ప్రధానంగా స్టీల్, బొగ్గు, చమురు, మేజర్ నిర్మాణ సామగ్రి వాహనాలు రోజువారీ వెళ్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యెుక్క ప్రధానమైన ఉత్పత్తి స్టీల్.
పరిశ్రమలు[మార్చు]
|
విద్యాలయాలు[మార్చు]
సంపూర్ణ అక్షరాస్యతకు మార్గదర్శి తణుకు.అక్షరాస్యతా వార్తలలో తణుకు పట్టణం ప్రత్యేక స్థానంలో ఉంది.2000 సెప్టెంబర్ 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది.2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు.ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.
పాఠశాలలు[మార్చు]
- శతవసంతాల పాఠశాల జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల
- శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల
- శ్రీ తిమ్మరాజు ఉన్నత పాఠశాల
- ఎస్.ఎఫ్.ఎస్. (సెయింట్ ఫ్రాన్సిస్ డే సేల్స్) హై స్కూల్
- మాంటిస్సోరి స్కూలు
- భారతీ విద్యాలయం
- శశి విద్యాసంస్థలు
- గురజాడ విద్యానికేతన్
- రవీంద్రభారతి పాఠశాల
- అక్షర పాఠశాల
- మున్సిపల్ పాఠశాలలు, మొదలైనవి.
కళాశాలలు[మార్చు]
- శ్రీమతి నడింపల్లి వర్దనమ్మ తిరపతి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల
- శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటిక్నిక్ కళాశాల (SMVM)
- ఆకుల శ్రీ రాములు ఇంజినీరింగ్ కళాశాల
- ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
- శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాల
- శ్రీమతి కొండేపాటి సరోజినిదేవి మహిళా కళాశాల
దేవాలయాలు[మార్చు]
సిరిసంపదలతో,వ్యవసాయ,పారిశ్రామిక రంగాలలో పరిపుష్టిగా ఉన్న తణుకు పట్టణం, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.
- కపర్దీశ్వరస్వామి ఆలయం
- శ్రీ కేశవస్వామి వారి దేవస్థానము
- సిద్దేశ్వరస్వామి ఆలయం
- వేంకటేశ్వరస్వామి దేవాలయం
- శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయం
- సూర్య దేవాలయం
- సాయిబాబా గుడి
- వినాయకుని గుడి
- కన్యకాపరమేశ్వరి ఆలయం
- జైన దేవాలయం
- శ్రీ రామసుబ్రహ్మణ్యశ్వరస్వామి దేవాలయం
- ముత్యాలమ్మ గుడి
- రామాలయం
- పామర్తి వారి గుడి (నటరాజ స్వామి ఆలయం)
- యల్లారమ్మ దేవాలయం (మండపాక)
- శ్రీ ఈశ్వరమ్మ ఆలయం (వేల్పూరు )
పండుగలు[మార్చు]
తణుకులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
- సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
- కేశవశ్వామి తిరునాళ్ళు : తిరునాళ్ళు, రథోత్సవం, గరడ వాహన సేవ
- ముత్యాలమ్మ జాతర
- ఉగాది: తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
- వినాయక చవితి: బాధ్రపద శుద్ధ చవితి. ఆగష్టు/సెప్టెంబర్ నెలలలో వస్తుంది.
- దసరా: ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబర్ నెలలో వస్తుంది.
- దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబర్ నెలలో వస్తుంది .
- శ్రీరామనవమి: చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
- సుబ్రహ్మణ్య షష్టి
తణుకులో బ్యాంకులు[మార్చు]
- ఇండియన్ బ్యాంక్ (1938)
- ఆంధ్రాబ్యాంక్ (1954)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1957)
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1959)
- ది వైశ్యా బ్యాంక్ (1976)
- విజయా బ్యాంక్ (1976)
- జిల్లా సహకర కేంద్ర బ్యాంక్ (1976)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు (1979)
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1993)
- ది లక్ష్మి విలాస్ బ్యాంక్ (1993)
- భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (1996)
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (1997)
- ది వాణి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (1999)
- కోస్టల్ బ్యాంక్ (2001)
- కెనరా బ్యాంక్ (2003)
- యూనిటి ట్రాస్ట్ ఆఫ్ ఇండియా (2005)
- యు.టి.ఐ.బ్యాంక్
- హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్
- ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంక్
- కారొఎరేషన్ బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- ఇండస్ ఇండ్ బ్యాంకు
రెస్టారెంట్లు[మార్చు]
1) జే.కే
2) శంకర్ విలాస్ ప్యూర్ వెజిటేరియన్
3) స్కందపుర్వజ
4) తాజ్ దర్బార్
5) గ్రీన్ ల్యాండ్
6) హొటల్ రవీంద్ర ప్యూర్ వెజిటేరియన్
7) అవధాని ప్యూర్ వెజిటేరియన్ కర్రీపాయింట్, పాత అర్బన్ పోలీస్ స్టేషను ప్రక్కన
8) అనుపమ రెస్టారెంట్
9) చిట్టూరి హెరిటెజ్
10) విజయా మెస్
11)శంకర కర్రీ పాయింట్
కాటరింగ్:[మార్చు]
భీమాస్ కాటరింగ్
సినిమాథియేటర్లు[మార్చు]
- శ్రీ వీరనారాయణ
- లక్ష్మి
- మిని లక్ష్మి
- శ్రీచిత్ర
- వెంకటేశ్వర
- నరేంద్ర
- మినీ నరేంద్ర
- ప్రత్యూష
- మినీ ప్రత్యూష
- ప్రత్యూష డిజిటల్
తణుకు చిత్రపటం[మార్చు]
తణుకు చిత్రాలు[మార్చు]
ఇతర సమాచారం[మార్చు]
- తణుకు గ్రామ దేవత : ముత్యాలమ్మ
- తణుకు పిన్ కోడ్ : 534211
- తణుకు టెలిఫోన్ యస్.టి.డి కోడ్ : 08819
- తణుకు ఆర్టీసీ, షాట్ కట్ కోడ్ : TNK
- తణుకు రైల్వే కోడ్ : TNKU
వికీమాపియా లో తణుకు[మార్చు]
- ↑ బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35. Check date values in:
|date=
(help) - ↑ "About Tanuku Municipality | Tanuku Municipality". tanuku.cdma.ap.gov.in. Archived from the original on 2020-01-27. Retrieved 2019-12-18.