Jump to content

శ్రీ నన్నయ భట్టారక పీఠం

వికీపీడియా నుండి
ఆదికవి నన్నయ విగ్రహం

తెలుగు భాషా, సాహిత్య సముద్ధరణ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన సాహిత్య వేదిక శ్రీ నన్నయ భట్టారక పీఠం. తెలుగు భాషను ఒక క్రమరీతిలో మలచి, అక్షర రూపాన్ని అందంగా తీర్చిదిద్ది, మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగు లోనికి అనువదించి, ఆదికవిగా ప్రసిద్ధిగాంచిన నన్నయ భట్టారకుని పేరు మీద 1931 సంవత్సరంలో నన్నయ భట్టారక పీఠం స్థాపించబడింది. భాషా, సాహిత్య సముద్ధరణ కోసం ఆంధ్రదేశంలో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (హైదరాబాద్ ) వాణీ నిలయం (వేటపాలెం, గుంటూరు జిల్లా), గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి) వంటి సాహిత్య సంస్థల కోవలోనికి చెందినదే శ్రీ నన్నయ భట్టారక పీఠం కూడా.

పీఠం స్థాపన

[మార్చు]

శ్రీ నన్నయ భట్టారక పీఠం 1931లో రిజిస్టర్ నెంబరు S 21 / 1953 ద్వారా ప్రారంభించబడింది. పోతాప్రగడ రామారావు, పామర్తి వేంకట రమణా రావు, అధ్యక్ష కార్యదర్శులుగా ఏర్పడిన ఈ సంస్థ అనేకమంది సమర్ధులైన అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యములో వైవిధ్య భరితమైన అనేక సాహితీ కార్యక్రమములు నిర్వహించింది. ఈ పీఠం యొక్క కార్యక్రమాల్లో అనేకమంది ప్రముఖ తెలుగు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

అభినవ కృష్ణరాయ -డా.జి.ఎస్.వి.ప్రసాద్-అధ్యక్షులు
దస్త్రం:నన్నయ భట్టారక పీఠం కార్యవర్గ సభ్యుల గ్రూప్ ఫోటో.jpg
కార్య వర్గ సభ్యులు

కార్యక్రమాలు

వివిధ సందర్భాలలో భోజకాళిదాసీయము, భువనవిజయం, వేంగీ వైభవం, కవనవిజయం, గౌతమీ విజయం, వంటి అనేక సాహిత్య రూపకములను తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఉండ్రాజవరం, రేలంగి వంటి చోట్ల ప్రదర్శించటం జరిగింది. పీఠం అధ్యక్షుడు జీ.ఎస్వీ.ప్రసాద్, గరికపాటి నరసింహారావు, వద్దిపర్తి, కడిమెళ్ళ, కోట వంటి సహస్రావధానులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రతి ఉగాదికి వార్షికోత్సవాలతో పాటు తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు "డా.జీ.ఎస్వీ.ప్రసాద్ సాహిత్య పురస్కారం" పీఠం ప్రదానం చేస్తోంది. పద్య కావ్యాలను ప్రోత్సహిస్తూ "తంగిరాల వేంకట కృష్ణ సోమయాజి పద్యగ్రంథ పురస్కారం", "ఆధునిక కవి బాలగంగాధర తిలక్ పురస్కారం" ఈ పీఠం ఇస్తున్నది. ఇవేకాక చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు ఆర్థిక సహాయంతో రాష్ట్రవ్యాప్త పద్య రచన పోటీలను నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తోంది. ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో డా.ముళ్ళపూడి హరిబాబు సహాయంతో "ముళ్ళపూడి వెంకటరాయుడు స్మారక ఉపన్యాసం" నిర్వహిస్తోంది. డిసెంబరు నెలలో గమిని రాజా సహకారంతో అర్హులైన సాహితీమూర్తులకు "గమిని వెంకటేశ్వర్లు పురస్కారం" అందజేస్తోంది. తంగిరాల బాలగోపాలకృష్ణ సౌజన్యంతో ఒక సాహితీ కార్యక్రమం, విద్యార్థినీ, విద్యార్థులకు పద్యరచన పోటీలను నిర్వహించి విద్యార్థులలో సాహిత్యాభిలాషను కలుగజేయటానికి ప్రోత్సహిస్తోంది.

2004 లో మే 9 నుండి నుండి మే 25 వరకు కడిమెళ్ళ-కోట జంట కవుల సహస్రావధానాన్ని పీఠం నిర్వహించింది. 17 రోజులపాటుఇ జరిగిన ఈ అవధానంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి అనేకమంది కవి పండితులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. సాహితీ సంస్థలో సువర్ణాక్షరములతో లిఖించదగిన ఈ కార్యక్రమమునకు అపూర్వ స్పందన వచ్చింది.

తణుకు గోస్తనీ నదీ తీరాన 1995 మే 11 న నన్నయ భట్టారకుని కాంస్య విగ్రహ ప్రతిష్ఠ చేసింది. నాటి శాసన సభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు సహాయ సహకారములతో తణుకు పురపాలక సంఘము ఆర్థిక సహకారముతో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసింది.

ప్రధానకార్యదర్శి సుశర్మ పీఠం నెలకొల్పిన విగ్రహం గురించి పద్య రూపంలో ఇలా చెప్పారు:

ఎన్నడో నన్నపార్యుడు మహేశ్వరు సన్నిధి గోస్తనీతటిన్

సన్నుత కీర్తి యజ్ఞమును సల్పెను తణ్కుపురాన దానికిన్

మన్నన నిచ్చి పెద్దలభిమానముతో నెలకొల్పినట్టి మా

నన్నయ గారి విగ్రహమునన్ వెలిగెన్ దరహాస చంద్రికల్!

సారంగు లక్ష్మీనరసింహారావు రచించిన "నన్నయ"అనే పరిశోధనా గ్రంథాన్ని "ఆరాధన" అనే పేరుతొ నన్నయ విగ్రహావిష్కరణోత్సవ సంచికను ఇదివరలో పీఠము ప్రకటించింది.

1980 సంవత్సరంలో బాల గాంధర్వ షణ్ముఖి ఆంజనేయ రాజుతో “భువన విజయం” అనే రూపకాన్ని ప్రదర్శించి రసజ్ఞుల ప్రశంస లందుట జరిగింది. అదే బాటలో డా.జి.యస్వీ.ప్రసాద్ రాజుగా భువనవిజయం, ఇంద్రసభ, వేంగీ వైభవం, విజయనగర సామ్రాజ్య వైభవం వంటి రూపకాలు ఎన్నో వేశారు. 1980 లోనే నన్నయ భట్టారక పీఠం స్వర్ణోత్సవ కార్యక్రమాల్ని డా.సి.నారాయణరెడ్డి ముఖ్య అతిధిగా నిర్వహించారు.

1990 లో చెరువు సత్యనారాయణ శాస్త్రి "వారం వారం సాహితీ సమారాధన"అనే కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనేకమంది వర్ధమాన కవులను ప్రోత్సహించి స్థానిక కవులకు మార్గదర్శకులయ్యారు. 1990, 1992 మధ్య ఓలేటి పార్వతీశం, ప్రయాగ రామకృష్ణ వంటి సాహితీ వేత్తలను ఆహ్వానించింది.

ప్రతి మాసం సాహితీ కార్యక్రమాలతో పాటుగా బాల బాలికలను ప్రోత్సహించు నిమిత్తం పద్య పఠన పోటీలు, కోస్టల్ ఆగ్రో అధినేత సి.హెచ్.కె.విశ్వేశ్వరరావు గారి సౌజన్యంతో రాష్ట్రస్థాయి పద్యకవితల పోటీలు ఏటా నిర్వహిస్తోంది. ఇంతే కాకుండా నన్నయ భట్టారక పీఠం ప్రముఖ సాహితీ వేత్తలకు పురస్కారాలు ప్రదానం చేస్తోంది. డా.జి.యస్వీ.ప్రసాద్ సాహితీ పురస్కారం, ముళ్ళపూడి వెంకట్రాయుడు స్మారక పురస్కారం, తిలక్ పురస్కారం, తంగిరాల వేంకటకృష్ణ సోమయాజి పద్య గ్రంథ పురస్కారం, గమిని రాజా గారి సౌజన్యంతో గమిని వెంకటేశ్వర్లు సాహితీ పురస్కారం, తంగిరాల గోపాలకృష్ణ సాహితీ పురస్కారం ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరికి ప్రధానం చేస్తోంది.

గరికిపాటి నరసింహారావు గారికి గమిని వేంకటేశ్వర్లు స్మారక సాహితీ పురస్కారంతో సత్కారం

2015 జూన్ 13 శనివారం నాడు పీఠం ఆధ్వర్యంలో జరిగిన సాహితీ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు ప్రసంగించారు. “అనుబంధాలు- ఆత్మీయతలు “ అనే అంశంపై రామాయణ, భాగవత, భారతాలు, ఇంకా ఇతర గ్రంథాల నుంచి, ఉపనిషత్తుల నుంచి పద్యాలను, శ్లోకాలను చదివి వాటిలోని అనుబంధాలు-ఆత్మీయతలు ఎలా ఉండేవో చక్కగా విశదీకరించి మధ్యలో హాస్య చతురోక్తులతో ప్రసంగం సుమారు 3 గంటల పాటు రక్తి కట్టించారు. ’మాతృదేవోభవ’అని తల్లిని గురించి ఆయన చదివిన పద్యం ఆకట్టుకొన్నది.

పీఠం సభ్యులు

[మార్చు]

ప్రజాసేవ చేయుచు ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన పోతాప్రగడ రామారావు ప్రథమ అధ్యక్షులుగా పామర్తి రమణమూర్తి ప్రథమ కార్యదర్శిగా పీఠం తరపున అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి రావు సత్యనారాయణ, పెన్మత్స సత్యనారాయణ రాజు (తెలుగు రాజు), వేదుల సూర్యనారాయణ శర్మ, నిడదవోలు మృత్యుంజయ రావు, తెన్నేటి కోదండ రామయ్య, యర్రమిల్లి భానుమతి పీఠం కార్యక్రమాలి నిర్వహించిన వారిలో కొందరు. 1975 జనవరి 25 వ తేదీన స్థానిక న్యాయవాది వారణాసి విశ్వేశ్వరరావు అధ్యక్షులు గాను, యం.వి.సూర్యనారాయణ మూర్తి, (ఓరియంటల్ కళాశాల కులపతి ) కార్యదర్శి గా ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1976 లో ప్రముఖ న్యాయవాది బి.యస్.ఆర్.ఆంజనేయులు అధ్యక్షులుగా, వేదుల సూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కార్యక్రమాలు నిర్వహించారు. 1980 లో బి.యస్.ఆర్ ఆంజనేయులు అధ్యక్షులుగా సుశర్మ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడి నన్నయ భట్టారక పీఠం స్వర్ణోత్సవ కార్యక్రమాల్ని డా.సి.నారాయణరెడ్డి ముఖ్య అతిధిగా నిర్వహించారు.

1988 నుండి 1990 వరకు తణుకు పట్టణంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు డా.వత్సవాయి వెంకటరాజు అధ్యక్షులుగా, ప్రముఖకవి రసరాజు ప్రధాన కార్యదర్శిగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. 1990 -1992 వరకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సాహిత్యాభిమాని మల్లిన రామచంద్రరావు అధ్యక్షులుగా, డా.సి.యస్.శాస్త్రి, ప్రధానకార్యదర్శిగా సాహితీ సేవలందించారు. 1992-1994 వరకు ప్రముఖ ఆడిటర్ జె.ఎస్.సుబ్రహ్మణ్యం అధ్యక్షులుగా, సుశర్మ ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 1994 నుండి డా.జి.యస్వీ.ప్రసాద్ అధ్యక్షులుగా, సుశర్మ ప్రధానకార్యదర్శిగా సంస్థ కార్యక్రమాలకు తోడుగా, ఆర్ధిక పుష్టిని చేకూర్చుటకు కృషి చేసారు. అనంతరం డా. తాతిన రామబ్రహ్మము అధ్యక్షులుగా దానికి వన్నెను చేకూర్చుట జరిగినది. ప్రస్తుతం డా.జి.యస్వీ.ప్రసాద్ అధ్యక్షులుగా, సుశర్మ ప్రధానకార్యదర్శిగా "అమృతోత్సవ" కార్యక్రమాలు మార్చి30 నుండి ఏప్రిల్ 4 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది.

పూర్వ అధ్యక్షులు

[మార్చు]
  • పోతాప్రగడ శ్రీరామారావు
  • వారణాశి విశ్వేశ్వర రావు
  • బి.ఎస్.ఆర్.ఆంజనేయులు
  • డా.వత్సవాయి వెంకట్రాజు
  • మల్లిన రామచంద్రరావు
  • జే.ఎస్.సుబ్రహ్మణ్యం
  • డా.తాతిన రామబ్రహ్మం

పూర్వ ప్రధాన కార్యదర్శులు

[మార్చు]

ప్రముఖ దాతలు

[మార్చు]

ఎందరో పురప్రముఖులు, తణుకు లయన్స్ క్లబ్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు పీఠం కార్యక్రమాల నిర్వహణలో తోడ్పడుతున్నాయి.

  1. యమ్.వి.కృష్ణారావు, Ex.M L A నన్నయ కాంస్య విగ్రహ స్థాపనకు మూలకారకులు
  2. సి.హెచ్.కె.విశ్వేశ్వర రావు, రాష్ట్ర పద్యకవితా విజేతల బహుమాన ప్రదాత
  3. గమిని వెంకట సుబ్బారావు (రాజా) గమిని వెంకటేశ్వర్లు సాహితీ పురస్కార కర్త
  4. తంగిరాల వెంకట కృష్ణ సోమయాజులు, పద్య గ్రంథ పురస్కార కర్త

పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు

[మార్చు]

పీఠం ప్రతీ మాసం ఒక సాహితీ సమావేశం నిర్వహిస్తూ తెలుగు సాహిత్యంలో కవి పండితులైన వారిచే సాహితీ ప్రసంగములు ఏర్పాటు చేస్తోంది. గతంలో కీ.శే.చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి, వేదాంతకవి, భమిడిపాటి కామేశ్వరరావు, తిలక్, పింగళి, కాటూరి మొదలైన పండితులు మహోన్నతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. పీఠాన్ని సందర్శించి, ప్రసంగించిన ఉద్దండ సాహితీ మూర్తులలో కొందరు:

ఆస్థాన కవులు, ప్రముఖులు

[మార్చు]

నన్నయ భట్టారక పీఠం ప్రదానము చేయు పురస్కారాలు

[మార్చు]
పురస్కారం పురస్కార దాతలు
*దేవరకొండ బాల గంగాధర తిలక్ పురస్కారం ఆచార్య తంగిరాల సుబ్బారావు, డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి, తిలక్ కుమారులు
తంగిరాల వెంకట కృష్ణ సోమయాజి పద్య గ్రంథ పురస్కారం తంగిరాల వెంకట కృష్ణ సోమయాజి
డా.జి.యస్వీ.ప్రసాద్ సాహితీ పురస్కారం డా.జి.యస్వి.ప్రసాద్
గమిని వెంకటేశ్వర్లు సాహితీ పురస్కారం గమిని రాజా
తంగిరాల పాలగోపాల కృష్ణ -సాహితీ పురస్కారం
డా.వి.వై.వి.సోమయాజి స్మారక కవిసమ్మేళనం వడ్డూరి.అన్నపూర్ణ
వేదపండిత పురస్కారం డా.వత్సవాయి వెంకట రాజు
పంచాగ పఠన పురస్కారం డా.తాతిన రామబ్రహ్మము .
రాష్ట్రస్థాయి పద్యకవితల చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు .
బాలబాలికల పద్య పఠన పురస్కారాలు డా.పి.రుక్మిణీనాధశాస్త్రి, కే.వి.రామయ్య, జి.అరుణకుమారి
ఫై.రమణమూర్తి -సాహితీ పురస్కారం
ఆరిమిల్లి వేంకటరత్నం సాహితీ పురస్కారం ఆరిమిల్లి రాధాకృష్ణ

మహారాజ పోషకులు

[మార్చు]
  1. గమిని రాజా
  2. సుశర్మ
  3. గమిని బాబ్జి
  4. డా.శ్రీవి.వెంకటరాజు
  5. మల్లిన.రామచంద్ర రావు
  6. డా.ఆర్.సూర్యరాజు
  7. బి.శ్రీమన్నారాయణ
  8. పుణ్యమూర్తుల రమణ మూర్తి
  9. చిలుకూరి విశ్వేశ్వర రావు
  10. డా.డి.వెంకటరావు
  11. డా.తాతిన రామబ్రహ్మము
  12. వి.సోమసుందరం
  13. డా.జీ.యస్వీ.ప్రసాద్
  14. డా.కె.సత్యనారాయణ రాజు
  15. జె.ఎస్.సుబ్రహ్మణ్యం
  16. వి.ఎస్.ఆర్.శర్మ
  17. గమిని రాంబాబు
  18. జీ.ఎస్.వి.నరసింహారావు
  19. చిట్టూరి. ప్రసాద్ చౌదరి
  20. జి.ఎల్.ఎన్.మూర్తి
  21. డా.ఆళ్ళ సుబ్బారావు
  22. నాదెళ్ళ రామకృష్ణ
  23. తంగిరాల పాల గోపాలకృష్ణ
  24. పి.సూర్య బలరామశాస్త్రి
  25. డా.చిట్టూరి వేంకటేశ్వర రావు
  26. డా.మల్లిన కృష్ణారావు
  27. డా.ఎన్.అచ్యుతరామయ్య
  28. డా.వి.సోమశేఖర్
  29. వి.లక్ష్మీనారాయణ
  30. డా.టి.రామచంద్రరావు
  31. వంక రవీంద్రనాథ్
  32. వై.టి.రాజా
  33. డా.యం.రఘు
  34. డా.ఎం.రామచంద్ర మూర్తి
  35. వి.లక్ష్మీనారాయణ
  36. కోసూరి గాంధీ,
  37. డా.పి.త్రిమూర్తులు
  38. డా. సి.వెంకటాద్రి
  39. డా.జి.ఆర్.భాస్కర రావు
  40. చిట్టూరి సుబ్బారావు,
  41. డా.బి.రమేష్ చంద్రబాబు
  42. పి.వి.నరసింహమూర్తి
  43. అనపర్తి ప్రకాశరావు
  44. డా.దమ్మలపాటి బ్రహ్మానందం
  45. శ్రీమతి వడ్డూరి అన్నపూర్ణ
  46. డా.టి.వి.కె.సోమయాజులు
  47. డాక్టర్ జె.ప్రభాకరరావు
  48. వి.రాజేశ్వర రావు
  49. డా.మరడాని రంగారావు
  50. ఎ.ఎస్.ఆర్.అవధాని
  51. దాసరి సూర్యారావు
  52. వానపల్లి బాబూరావు
  53. భోగవల్లి సుబ్బారావు
  54. బూరుగుపల్లి గోపాలకృష్ణ
  55. వి.ఎస్.గంగాధర శాస్త్రి
  56. వల్లేపల్లి వెంకట సుబ్బారావు
  57. డా.బి.బి.రామయ్య
  58. పి.వి.ఎన్.విశ్వనాధ కుమార్
  59. సి.హెచ్.రామకృష్ణ
  60. ఆరిమిల్లి రాధాకృష్ణ
  61. డా.పీసపాటి రుక్మిణీనాధ శాస్త్రి
  62. డా.ఆర్.వి.సూర్యనారాయణ
  63. ప్రొ.టి.వి.సుబ్బారావు

పీఠం గురించి ప్రముఖులు చెప్పిన మాటలు

[మార్చు]

భారతీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి

[మార్చు]

కూర్తాళం పీఠాధిపతి, భారతీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి ఇలా అన్నారు: నన్నయ భట్టారక పీఠము తణుకులో చేస్తున్న సారస్వత సేవ అసామాన్యమైనది. అనేక ప్రాంతాల నుండి పండితులను ఆహ్వానించి వారిచే ఉపన్యాసాలు చెప్పించడం, స్ఠానికంగా ఉన్న రచయితలను కలుపుకొనిపోతూ సామరస్య, సౌమనస్య పూరితమైన సాహిత్య వాతావరణాన్ని నిర్మించటంలో ఈ సంస్ఠ విజయవంతమైనదనటంలో యెటువంటి సందేహము లేదు. వాజ్మయంలోని వివిధ ప్రక్రియల ప్రదర్శనలు ఇక్కడ జరుగుతూ మంచి చైతన్యాన్ని తీసుకువస్తున్నవి. ప్రతిభా సంపన్నులైన జి.యస్వీ.ప్రసాద్, సుశర్మ వారి ఆప్తులు ఈ పీఠం వృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలలో సాధించిన విజయాలను హృదయగతం చేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళటానికి బహుకాల సేవా సూచికగా భవ్య సారస్వత సంచిక ప్రచురించటానికి పూనుకొనటం చాలా ముదావహం. ఈ ప్రయత్నం సఫలం కావాలని ఈ సంస్ఠ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను.

డా.సి.నారాయణ రెడ్డి

[మార్చు]

2006 జనవరి 26 న సినారె ఇలా అన్నారు: తెలుగు అక్షర జగత్తుకు కావ్యరూప కల్పన చేసిన వాగనుశాసనులు నన్నయ భట్టారకులు. నన్నయ పేర వెలసిన సాహిత్య సంస్ఠ నన్నయ భట్టారక పీఠం 75 సంవత్సరాలుగా గణనీయ సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడం అత్యంత ప్రశంసనీయం. 1980 లో ఈ పీఠం స్వర్ణోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొన్న స్మృతులు ఇంకా నాలో ముద్రితంగా ఉన్నాయి. ఒక సాహిత్య సంస్ఠను 75 సంవత్సరాలుగా అర్ధవంతంగా నిర్వహించడం సాధారణ విషయం కాదు. 75 సంవత్సరాలుగా ఈ పీఠం అస్తిత్వానికి కారకులైన వారిని ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న డా.ప్రసాద్ గారిని, ప్రధాన కార్యదర్శి సుశర్మ గారిని హార్దికంగా అభినందిస్తున్నాను.

మూలాలు, బయటి లింకులు, వనరులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]