వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి

డా.వి.వై.వి.సోమయాజిగా సుప్రసిద్ధులు
జననం
వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి

(1947-10-03) 1947 అక్టోబరు 3 (వయసు 76)
జాతీయతభారతీయుడు
విద్యMA,Mphil,Phd.11-07-1989 లో డాక్టరేట్ పట్టాపొందారు.
వృత్తితెలుగు లెక్చరర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పద్యరచనలు శ్రీ సిద్ధాపుర హనుమత్ సుప్రభాతమ్,కుహేళిక,రాజరాజేశ్వరినక్ష్త్రమాల,ఆంధ్రోదాహరణము
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ గారితో 12-06-1971 లో వివాహం
పిల్లలుసుబ్రహ్మణ్య రవి ప్రసాద్,శ్రీ దేవి
తల్లిదండ్రులుతండ్రి వడ్డూరి అచ్యుత రామకవి,తల్లి :శ్రీమతి సీతామహాలక్ష్మి
పురస్కారాలు1994 లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్,1995 లో రాస్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్
భర్తృహరిగా వి.వై.వి సోమయాజి నటించినప్పుడు తీసిన ఫోటో
1991 మార్చి నెలలో జరిగిన జానపద గిరిజన కళోత్సవం సభ శ్రీ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం విజయవాడ

వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి తెలుగు కవి, పురాణ ప్రవచకులు, ఆకాశవాణి విజయవాడ ప్రయోక్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి గారి ప్రజాదరణ పొందిన పేరు డాక్టర్ . వి.వై.వి.సోమయాజి. ఈయన అక్టోబరు 3, 1947 లో పశ్చిమ గోదావరి జిల్లా లోని కన్నాపురం లో వడ్డూరి సీతామహలక్ష్మీ, వడ్డూరి అచ్యుతరామకవి దంపతులకు జన్మీచారు. అతను తండ్రి వడ్డూరి అచ్యుతరామ కవి ప్రముఖ తెలుగు కవులు, స్వాతంత్ర్య సమరయోధులు. వేంకటేశ్వర సోమయాజి గారి వివాహం తే.12.06.1971 న శ్రీమతి అన్నపూఋణ గారితో జరిగింది. ఆమె సంస్కృత పండితులు, ఉపవిద్యా శాఖాధికారిగా పనిచేసారు. వీరికి ఇద్దరు పిల్లలు వారు సుబ్రహ్మణ్య రవి ప్రసాద్, శ్రీదేవి. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, ఆకివీడు, తణుకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులుగా పనిచేశారు, తరువాత పాలకొల్లు, తణుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి 31 . 05 .2౦౦5 లో పదవీ విరమణ చేశారు.

ఈయన విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రతీరోజు ఉదయం ప్రసారం అయ్యే సూక్తి సుధ కార్యక్రం చాలాకాలం నిర్వహించారు, జానపద సాహిత్యం కార్యక్రమం నిర్వహించారు, ఎన్నో సాహితీ కార్యక్రమాలలో పాల్గొన్నారు, తణుకు లోని ప్రముఖ సాహితీ పీఠం నన్నయ భట్టారక పీఠం లో కార్య వర్గ సభ్యులుగా ఉండి ఎన్నో సాహితీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

వ్యాసరచన[మార్చు]

1990 డిశంబరు ఆంధ్రాయూనివర్సిటీలో అంబేద్కర్ శతజయంతి సందర్భంగా జరిగిన సెమినార్ లో పాల్గొన్నారు. 1991 మార్చిలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన దక్షిణ ప్రాంత జానపద కళల సదస్సులో పాల్గొన్నారు.కోస్తా ఆంధ్రాలోని జానపద, గిరిజన కళారూపాలు సేకరణ, పరిరక్షణ అను పరిశోధన వ్యాస సమర్పించారు.ఈయన క్రింది వ్యాసాలను వ్రాసారు.

  1. సూక్తి సుధలు.
  2. వివాహ విధి
  3. నాయికా నాయకులు
  4. కరుణశ్రీ కవితా వైభవం,
  5. చాటుకవితా చమత్కృతి
  6. గీత చెప్పిన ఆహార విజ్ఞానం,
  7. మహాభారతం-విద్యా వ్యవస్థ, సాహిత్య ప్రసంగాలు:
  8. భాగవద్రామానుజులుజీవిత వైభవం
  9. పెరియాళ్వార్ -వాత్స్యల్య భక్తీ
  10. గజేంద్ర మోక్షం
  11. నిత్య జీవితంలో భగవద్గీత
  12. క్వచిదపి కుమాతా భవతి
  13. గీత -భగవానుని ప్రతిజ్ఞ
  14. నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర, బాధ్యత
  15. స్తోత్ర వాజ్మయం -శంకరుల భక్తీ తత్త్వం
  16. విష్ణు సహస్రం -నారాయణ తత్త్వం
  17. జానపద విజ్ఞానం పరిచయం
  18. హాస్య కవిత్వం
  19. రామాయణం విశ్వ శ్రేయం
  20. లలిత కళలు జాతీయ సమైక్యత
  21. మాతృభాషా బోధన
  22. వ్యక్తిత్వ వికాశం -ఉన్నత విద్యార్థుల మానసిక పరిస్థితులు
  23. విద్యా సంస్థల అభివృద్ధిలో సమాజం పాత్ర
  24. భాషానైపుణ్యం (25) జానపద గేయాలు
  25. జానపద గద్య కథనాలు

అందుకున్న బహుమతులు[మార్చు]

  • 1994 లో జిల్లా స్థాయి ఉత్తమో పాధ్యాయ అవార్డు
  • 1995 లో రాష్ట్రస్థాయి ఉత్తమోపాధ్యాయ అవార్డు
  • పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రాంత జానపద కొల్లేటి పాటలపై M Phil
  • తెనాలి రామలింగని కథల పై బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారి పర్యవేక్షణ లో డాక్టరేట్ పట్టా పొందారు.11 .౦7 .1989.

పద్య రచనలు[మార్చు]

  1. శ్రీ సిద్దాపుర హనుమత్ సుప్రభాతం
  2. కుహేళిక
  3. శ్రీ రాజరాజేశ్వరి నక్షత్ర మాల
  4. ఆంధ్రోదాహరణము,

పరిశోధనా వ్యాసాలు[మార్చు]

  1. కొల్లేటి పాటలు ఒక పరిశీలనము (ఎం ఫిల్ పట్టా కోసం)
  2. తెనాలి రామలింగని కథలు - సవిమర్శక పరిశీలనం (P.hd) పట్టాకోసం.

రేడియో కార్యక్రమాలు[మార్చు]

ఆకాశవాణి విజయవాడ నుండి 20 సంవత్సరాలకు పైగా భారత, రామాయణముల నుండి పురాణ ప్రవచనములు, యువవాణి ప్రసంగాలు, రేడియో రూపకాలు:

  1. చెంచులక్ష్మి -నరశింహుల సంవాదం
  2. చెంచులక్ష్మి వివిధ కళారూపాలతో
  3. పూటకో వేషం -రోజుకోవూరు (జానప భిక్షుక గాయకులూ)
  4. నాయికా నాయకులు
  5. తెనాలి రామలింగని హాస్య ప్రియత్వం.

అధ్యయనం[మార్చు]

  1. 1984 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన U.G.C flocklore సమ్మర్ పాఠశాల లో నెలరోజులు పాల్గొనుట.
  2. 1985లో ఢిల్లీలో CCRT వారి భారతీయ సంస్కృతి కళలు శిక్షణ పొందుట.
  3. రాజమండ్రి, భీమవరం, ఆకివీడు, మార్టేరు, తణుకు లలో జిల్లా విద్యాదికారులు నిర్వహించిన వర్క్ షావులు, సెమినార్ లలో పాల్గొనుట.
  4. 1986లో నూతన విద్యా విధానం పై శిక్షణ పొందుట.

అధ్యాపనం[మార్చు]

  1. 1988 లో నూతన విద్యావిధానం పై జరిగిన 40రోజులు జరిగిన శిక్షణలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొని వివిధ అంశములు బోధించుట.
  2. 1992 లో అనియత విద్య పై జరిగిన 10 రోజులు శిక్షణ లో రిసోర్స్ పర్సన్ గా పాల్గొనుట.
  3. Operation Black Board సంబంధించిన శిక్షణా తరగతులలో గెస్ట్ లెక్చర్ ఇచ్చుట విద్యార్థులలో రచనన శక్తిని పెంచుటకు సచిత్ర సాహిత్య వార్షిక పత్రికలు తయారు చేయించుట.
  4. విద్యార్థుల చే కవి సమ్మేళనములు, భువన విజయములు, మాదిరి అష్టావధానములు నిర్వహింప చేయుట.

చేపట్టిన గౌరవ పదవులు[మార్చు]

  1. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో లోకల్ ఆడిషన్ కమిటీ సభ్యునిగా డిరెక్టర్ జనరల్ -అల్ ఇండియా రేడియా, న్యూ ఢిల్లీ వారిచే నియామకము పొందుట
  2. డాక్టర్ .BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదు వారిచే డిగ్రీ 3వ సంవత్సరం వారికి అకడమిక్ కౌన్సిలర్గా నియామకము పొందుట.

ఆంధ్రోదాహరణము[మార్చు]

రచయిత మాట

ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలు మన రాష్ట్రంలో జరిగిన శుభ సందర్భముగా నావంతు పూజా పుష్పంగా ఆంధ్ర మాతకు సమర్పించిన లఘు కావ్యమిది . ఇందులో కవిత్వాంశం లేక పోయినా ఒక తరం వరకూ గల ఆంధ్ర దేశపు ఔన్నత్యాన్ని ఛందో బద్ధం చేశాననే తృప్తి నాకుంది. అప్పటి ఈ నా రచనకు ఈరోజు వెలుగు చూచే భాగ్యం కలిగింది. దీనిని సహృదయంతో ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. వి.వై .వి సోమయాజి..12 . 12. 1986.

ఇందులో పద్యాలు ...

ప్రధమా విభక్తి పద్యము

కలదీ దక్షిణ భారత క్షితిని రంగత్తుంగ శృంగాడ్యమై
విలసజ్జీవ నదీనద ప్రకరయై, విమలయై ,విచ్చేఖరావాసయై
ఫలవద్వ్రుక్ష నిషెవ్యయై,విమలయై భాసిల్లు నాంధ్రోర్వి, శ్రీ
తల దృక్కాంతిని జూడ దేవతలు ధౌతంబౌ యశః పూర్ణయై !!

కళిక

ఒక్క పిలుపున పలుకు వేంకన ఊర్జితంబుగ నిలుచు ధామము
రక్కసుల దునుమాడి భక్తుల రక్ష సేసిన రాము వాసము
శిఖర దర్శన మాత్రముననే చింతలడపెడి శివుని వాటిక
సుఖము శాంతుల గూర్చి మనుజుల చొక్కజేసెడి రత్నపేటిక

గౌతమీ కృష్ణాది నదులతో కలగి మెలగెడి పరమ పావని
భూతలంబును సుఖ మయంబుగ పూని చేసెడి భవ్య సురవని
మూడు కాలములందు పంటలు మురిప మలరగ నిడేడి ధారుణి
ఏడుగడయై ప్రజల గాయుచు నిహము గెంటేడి దివ్య తారణ !!

ఉత్కళిక

లలిత కళలను నేర్చి నట్టియు, కులవధూటుల గాంచినట్టియు
గానసుధలను చిలికి నట్టియు, మానమునకే బ్రతుకు నట్టియు
సుతుల గాంచిన ధన్యగర్భగ, నతుల నందేడి రత్న గర్భగ
వాసి గాంచెను కలిమి నెసగుచు, భాసురంధ్రావనిగ పొసగుచు !!

ద్వితీయా విభక్తి పద్యము

భావింతున్ సతతంబు నిర్మల మతిన్, భాస్వద్యశో వార్నిధిన్,
భావాతీత గుణోదధిన్, సిరులతో భాసిల్లు మేల్ శేవధిన్,
జీవాధార సుధాపయోధి, బుధరాడ్జీమూత పాధోనిధిన్,
కైవారంబులుసల్పి మ్రొక్కు లిడుదున్ కల్యాణి నాంధ్రిన్ హృదిన్ !

కళిక

శాతవాహన చక్రవర్తుల సరస గాధలు వినిన ధన్యను
ప్రీతిమై పల్లవుల శిల్పపు రీతి నెఱగిన లోక మాన్యను
రాజరాజ నరేంద్రు కొల్వున రక్తి భారతి మెఱగు సుమతిని
రాజితంబుగ కాకతీయుల రమ్య శిల్పము లరయ సుదతిని

విజయనగర ప్రభువరేణ్యుల విజయ గానము వినిన ధాత్రిని
ప్రజల బిడ్డల రీతిగాంచిన ప్రజల కొలువుల నందు నేత్రిని
నాయక క్ష్మాపాలవర్యుల నయ విశేషము గాంచు ధీరను
గాయకాళికి జన్మ భూమిగ ఘనత గాంచిన మేటి ధరను !!

ఉత్కళిక

రామకృష్ణుని దివ్య బోధలు రామచంద్రుని రమ్య గాధలు
నన్నపార్యుని రమ్య కవితలు అన్నమయ్య పదాల ఘనతయు
పోతనార్యుని భక్తి భావము వీతరాగుల దివ్య జీవము
లావహిమ్చిన దివ్యభరణిని చేవగలిగిన భవ్య ధరణిని

తృతీయా విభక్తి పద్యము

 వెలసెను ధర్మ భూమిపయి వేడ్కలు మీరగ నాంధ్రమాత మే
 లోలసేడు మూర్తితోడ,సిరులొల్కెడు,ప్రాకృత శోభతోడ,సొం
 పలరెడు సంతుతోడ పరమాన్నము లిచ్చెడు భూమితోడ,సం
 సంకుల కలనిస్వనంబులను కూర్మిని వెల్గెడి పక్షిరాజితోన్

కళిక

 లేపాక్షి బసవయ్య లేత నవ్వులతోడ
 పాపాల బోద్రోలు పరమ శంకరు తోడ
అమరావతీ నగర యచ్ఛ విభవము తోడ
కమనీయ శిల్పాల కాంతి పుంజము తోడ
శిల్పి నాగార్జునుని చేతి నిపుణత తోడ
పోల్పెసగు రత్నాల పొదుగు నుదధుల తోడ
ఆర్య గౌతమ బుద్దు నమరబోధల తోడ
కార్య శూరులు గల్గు కమ్ర భూముల తోడ

ఉత్కళిక

త్యాగయ్య కీర్తనల రాగ ప్రవాహముల
సాతాని జియ్యరుల గీతాల మధు ఝరుల
రామదాసుని రామ నామ పీయూషముల
రవణించు భువి తోడ భవ మీదు గుఱి తోడ!

చతుర్ధ్హీ విభక్తి పద్యము

వినతులు సల్పరారే పృధివీస్థలి మిన్నగ వాసిగన్న నీ
ఘనతర భూమికై పరమకారుణి కాత్మక సుస్వభావకై
అనయము వేడ్కగొల్పు వినయాదిక సద్గుణ వారమొప్పగా
దనరెడు సంతుగన్న ఘనతన్ విలసిల్లెడు నాంధ్రమాతకై

మూలాలు[మార్చు]

[[1991 మార్చి 24 నుండి మార్చి 26 వరకు విజయవాడ శ్రీ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో జరిగిన కోస్తా జిల్లాల జానపద గిరిజన కళోత్సవం లో పాల్గొన్నప్పటి చిత్రం ]]

ఇతర లింకులు[మార్చు]

25 మార్చి 1991 కృష్ణా జిల్లా ఈనాడు దినపత్రికలో ప్రచురింపబడింది