వడ్డూరి అచ్యుతరామ కవి
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వడ్డూరి అచ్యుతరామ కవి Vadduri Atchutarama Kavi | |
---|---|
![]() వడ్డూరి అచ్యుతరామ కవి
బిరుదు: సహజ కవితా విశారద. | |
జననం | వడ్డూరి అచ్యుత రామారావు అక్టోబర్ 19, 1916 కొయ్యలగూడెం, పశ్చిమగోదావరి జిల్లా |
మరణం | అక్టోబర్ 1996 కన్నాపురం మహాలయ శుక్లపక్ష ఏకాదశి |
మరణ కారణము | వృద్ధాప్యం వల్లనే |
వృత్తి | ఉపదేశ్ అను పక్షపత్రికకు సంపాదకులు. |
ప్రసిద్ధి | తెలుగు కవులు |
మతం | హిందూ మతము |
పిల్లలు | 10; 6 అబ్బాయిలు, 4 అమ్మాయిలు |
తండ్రి | వడ్డూరి సోమరాట్కవి |
తల్లి | శేషమాంబ |
వడ్డూరి అచ్యుతరామ కవి లేదా అచ్యుత రామారావు (ఆంగ్లం: Vadduri Atchutarama Kavi) ప్రముఖ తెలుగు కవులు, పండితులు, స్వాతంత్ర్య సమరయోధులు, పురాణ ప్రవచకులు.[1]
జీవిత సంగ్రహం[మార్చు]
చిన్ననాడు[మార్చు]
శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు 1916 అక్టోబర్ 16 వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జన్మించారు.[ఆధారం చూపాలి] వారి తండ్రి గారు శ్రీ వడ్డూరి సోమరాజు గారు కరిణీకం, వ్యవసాయం చేస్తూ కవిత్వం కూడా వ్రాసేవారు తీరిక సమయాలలో పురాణ ప్రవచనాలు చెప్పేవారు. ఆయన రచించిన భక్తవత్సల శతకం పద్యాలను వారి కుమారుడు ఐన అచ్యుత రామారావు గారు ఫెయిర్ చేసేవారు అలా తరచూ పద్యాలను వ్రాయడం వలన చిన్నతనంలోనే ఆయనకు కూడా పద్యాలు వ్రాయాలని కోరిక కలిగి శ్రీ వినాయకుని పై తోలి పద్యం వ్రాసి నాన్న గారికి చూపితే వారు చూసి మెచ్చుకుని బాగుంది నాయనా నువ్వు శ్రీ దేవిభాగవతం, రామాయణం, భాగవతం చదవమని మంచి జరుగుతుందని పద్యాలు ఇంకా బాగా వ్రాయగలవు అని దీవించారు. తొలిసారిగా శ్రీగణేశ పురాణం వ్రాశారు.
స్వాతంత్ర్య సమరం[మార్చు]
తరువాత కొంతకాలానికి స్వాతంత్య్ర ఉద్యమం లో భాగంగా ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధిజీ పిలుపు మేరకు ఆయన కాకినాడలో సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటీష్ వారిని ఎదిరించి తంజావూరు జైలులో శిక్ష అనుభవించారు. బ్రిటీష్ వారిపై ఏవగింపును పెంచే ఎన్నో గేయాలు వ్రాశారు. తరువాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి దగ్గర ఉన్నారు ఆయన ఆరోగ్యం క్షీనిస్తుండగా ప్రభుత్వం ఏమి పట్టించుకోక పోవడంతో ఈయన ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించారు. శ్రీ పొట్టిశ్రీరాములు గారికి పరిచర్యలు చేసినవారిలో ఈయన ఒకరు.[ఆధారం చూపాలి] శ్రీరాములు గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా తరువాత నిరాహారదీక్ష చేయడానికి పూనుకోబోతుండగా శ్రీరాములు గారు మరణించడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు.
సాహిత్య సేవ[మార్చు]
రామకవి గారి నాల్గవ కుమార్తెకు పుట్టు వెండ్రుకలు తీయించడానికి ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఆపిల్ల గుక్కపట్టి ఏడుస్తూ ఎంతసేపటికీ ఏడుపు ఆపకపోతే ఈయన స్వామివారి సన్నిధిలోకి వెళ్లి స్వామివారికేసి తదేకంగా చూస్తుండగా ఆయన మనసులో స్వామీ నేను ఎన్నోపద్యాలు ఎవరేవరిమీదో వ్రాశాను కాని కలియుగ దైవమైన నీమీద ఒక్కపద్యమైన వ్రాయలేకపోయాను అని మనసులో అనుకుని తదేకంగా స్వామి వారికేసి చూడగా స్వామి వారి నేత్రములనుండి కాంతి పుంజములు వెలువడి ఈయన హృదయానికి తాకగా అప్పుడే ప్రేరణ కలిగి ఆ స్వామివారి సన్నిధి లోనే కాగితం తీసుకుని ఆశువుగా ఒక పద్యం స్పురించగా మొదలు పెట్టి "శ్రీమద్వేంకట శైలమందువిభవ శ్రీ మీర నామ్చరియున్ బామా రత్నము మంగ మంబయును సంసేవించి సేవింపగ "అని మొదలు పెట్టి వ్రాయగా అది శ్రీ వెంకటేశ్వర భక్తిమాలగా రూపు దిద్దుకుంది. తొలిపద్యం వ్రాయాలని ప్రేరణ కలగిన క్షణమే తన కుమార్తె ఏడుపు టక్కున ఆగిపోయింది. ఇది ఒక ఆశ్చర్యము.
ఒకనాడు ఏలూరులో ఈ శతకము లోని పద్యాల నాచేతిలోని పుస్తకము లాగి చదివిన వారి మిత్రులు, స్వాతంత్య్ర సమరవీరుడు, కవి శ్రీ నంబూరి దూర్వాస మహర్షి నన్ను తీసుకునిపోయి జిల్లాపరిషత్ అధ్యక్షులు, పండితాభిమాని అయిన శ్రీ అల్లూరి బాపినీడు గారి వద్ద అయ్యా శ్రీ పోతనామాత్యుని పద్యములను జ్ఞప్తికి తెచ్చు పద్యములు ఈ నామిత్రుడు అచ్యుతరామ కవి వ్రాసినారు అని కొన్ని పద్యములు చదువనారంభించగా చదువుతున్న నంబూరి వారిని ఆగమని పరిషత్ కార్యాలయములోని మిగతా సిబ్బందిని కూడా పిలిచి వారందరి ఎదుట అచ్యుతరామ కవి గారిని చదవమనిరి. ఆనాటి ఆ సన్నివేశము ఎంతో ఆనదకరమై చదవగా ఈపద్యాలు నాథగ్గర చదవడం కాదు నేను తిరుమలలో శ్రీ స్వామివారి సన్నిధిలో చదివించి వినాలని కోరికగా ఉంది 10 రోజులలో శ్రీ నీలం సంజీవరెడ్డి గారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వస్తున్నారు మేమందరమక్కడికి పొడలచితిమి మిమ్ములను తీసుకువెళ్ళి ఆచటివారు, మేము స్వామి సన్నిధిలో ఉండగా మీరూ చదవాలి అని చెప్పి ఈయనను కూడా తిరుమల తీసుకుని వెళ్ళి శ్రీ స్వామివారి సన్నిధిలో చదివే భాగ్యం కలిగించారు శ్రీ సంజీవరెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఆనాటి శుభోదయ సమయమున ప్రభాత సేవ వేళకు వారితో స్వామివారి సన్నిధిలో ఉండడం, మరునాడు శ్రీ స్వామివారి సుప్రభాత సేవకి వెళ్లి సంస్కృతంలో ఉన్న సుప్రభాతం విని ఆదేవనగర లిపిలో ఉన్న సుప్రభాతం తెలుగు ప్రజలదరికి అర్ధం అయ్యేలా ఆ సుప్రభాతాన్ని తెలుగులోకి అనువదించాలని కోరిక కలిగి శ్రీ స్వామి వారి అనుగ్రహంతో తెలుగులోకి అనువదించారు. అదివిన్న తిరుమల కార్యనిర్వహణాధికారి ఈయనకు ఈయనచే రచించబడిన శ్రీనివాసకథా సుధాలహరి అను శ్రీనివాస కల్యాణము ప్రవచనం ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు ఇలా 10 రోజులు కార్యక్రమాలలో నెల్లూరు జిల్లాకు చెందిన భక్తులు విని ఈయనను ఇందూపూరు, బుచ్చిరెడ్డిపాలెం లో, జొన్నవాడ లో గల శ్రీ కామాక్షితాయి ఆలయంలో దేవిభాగవతం పురాణ ప్రవచనం చెప్పవలసిందిగా కోరగా అంగీకరించి సుమారు ఒక నెల రోజులు దేవిభాగవతం చెప్పారు అక్కడి అమ్మవారు శ్రీ కామాక్షితాయి ఆలయ స్థలపురాణం ఆధారంగా శ్రీ శివకామేశ్వరి కళ్యాణం అనే గ్రంథం రచించారు . ఇది ఈయన మాధవ సేవ ==శారదా విద్వన్మంజరి కార్యదర్శిగా== కాకినాడ జగన్నాధపురం శారదా విద్వన్మంజరి పేరుతో గల ఒక ఉత్తమ సాహిత్య సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉండి మహామహోపాద్యాయ కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి 75 వ జన్మ దినోత్సవం ఘనంగా జరిపించారు.వారికి విగ్రహ నిర్మాణానికి ఏర్పడిన సంస్థకు కూడా వీరే ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా సభలు జరిపించారు .కాకినాడ న్యాయవాది వీరి మిత్రులు P.V.M.భీమశంకరం B A B L ఇరువురు కలిసి ఈ ఉద్యమాలు నడిపించి మహాకవులు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు,శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి,బుద్దా శేషగిరిరావు గార్ల వంటి పండితోత్తములకు,కవివరేణ్యులకు శారదా విద్వన్మంజరి ఆద్వర్యమున సన్మానములు జరిపించారు.గాంధీగారి పిలుపుపై 1937 లోనే ఇంగ్లీషు విద్యకు స్వస్తి చెప్పి ఒక వంక రాజకీయాలు ఒకవంక సారస్వత సేవ చేయుచు 1940 1942 ఉద్యమం లో పనిచేసి "స్వరాజ్యసాధనం "అనే పద్యకావ్యాన్ని వ్రాసి అనాటి మహోద్యమం లో ప్రచారం చేసినారు.(ఆరాజకీయాలు ఇక్కడ అప్రస్తుతం ) మాతృసేవా ఫలితము,కవిపండితుల సేవా,అమ్మ ఆశీర్వాదము కారణంగా కవి కంఠీరవ కాకరపర్తి కృష్ణశాస్త్రి గారు,శ్రీ P.V.M.భీమశంకరం గారి ఆద్వర్య్యమున జరుపబడిన సభలో "సహజ కవితా విశారద" అనె బిరుదు ప్రసాదించి సన్మానము చేసారు.
మానవ సేవ[మార్చు]
1) పోలవరం తాలూకాలో 'బందకట్టు 'అను నీటి రిజర్వాయరు తగాయిదా గురించి గిరిజన రైతుల తరపున లక్కవరం జమిందారులు, దిప్పకాయలపాడు భూస్వాములతో పోరాడి, సత్యాగ్రహాలు చేసి, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించి గిరిజనుల, గిరిజనేతరుల వేలాది ఎకరాలు భూమికి నీటి హక్కు కలిగించిన అన్నదాత .నిరాహారదీక్ష నోటీసుతో పూజ్య బాపూజీ, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం పంతులు గారికి లేఖ వ్రాశారు. కొవ్వూరు R D O శ్రీ గంగాళం భీమశంకరం గారు ప్రభుత్వం తరపున శ్రీ కొప్పుల సత్యనారాయణ గారు సమస్య లంగీకరించుట శ్రీ కళా వెంకటరావు గారు అప్పటి రెవెన్యూ మంత్రి GO.MS 1902/8-8-1947 ఉత్తర్వుల ద్వారా గిరిజనులకు "బండకట్టు " నీటి హక్కు కల్పించారు.
2) "గుండుదెబ్బల కెదురేగి గుండె లిచ్చి రక్షక భటాలి లాఠీల రాటుదేలి భారత మాత విముక్తికి పాటుపడిన తొల్లిటి స్వాతంత్ర్య వీర యోధు లముమేము" అని వ్రాసిన సీస పద్యములోని ఈ గీతం మరువరానిది నిత్యసత్యమైనది 1942 సంవత్సరం ఆగస్టు లో క్విట్ ఇండియా తీర్మానం అనుసరించి బాపట్ల తాలూకా చీరాల వాస్తవ్యులు శ్రీ నాళం రామచంద్రరావు B.A.L.L.B గారు చేసిన విప్లవ చర్యకు ఆయనను పట్టిచ్చిన వారికి 1000/- రూపాయలు బహుమతి ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం 1942 లో ప్రకటించగా 36 రోజులు తన నివాసం లో రక్షణ ఇచ్చిన విప్లవ వీరుడు శ్రీ అచ్యుతరామ కవి . ఆ తరువాత 1944 లో నాళం వారిని పట్టుకున్నారు కాని రామచంద్ర రావు గారికి HOURBER ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు :- (నంబూరి దూర్వాస మహర్షి అచ్యుతరామ కవి గారి మిత్రులు).
3) పోలవరం తాలూకా ఏజెంసీ ముఖద్వారమైన కన్నాపురం గ్రామం లో నివసించడం వలన ఆప్రాంత ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలనే దృక్పధంతో శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు సంపాదకులుగా 1974 సంవత్సరం లో "ఉపదేశ్ " అను జాతీయ పక్ష పత్రికను స్థాపించి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చి ఆరోజుల్లోనే పోలవరం ప్రాజెక్ట్ కడితే ఎన్నివేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఎంతో అంచనా పంపి ఎన్నో విజ్ఞాపనలు పంపేవారు . కొంతకాలం కొయ్యలగూడెం ప్రెస్ నుండి ప్రచురణ సాగింది. ప్రెస్ లో సంకేతిక లోపం వలన ఆ పత్రిక నిర్వహణ తణుకు లోని శ్రీ వెంకటేశ్వర ప్రింటింగ్ ప్రెస్ నుండి ప్రచురణ సాగింది . మకాం కన్నాపురం లోను ప్రచురణ తణుకు నుండి సాగించడం కష్టం అవడం వలన పత్రిక నిర్వహణ నిలిచి పాయింది.
4 . 1 9 6 8 వ సంవత్సరం లో రైతు పై ప్రభత్వం నిర్బంధముగా లెవీ విధించి ధాన్య సేకరణ ఉత్తర్వులిడినారు ఆ సంవత్సరం వర్షములు లేక పంటలు లేక మెట్ట ప్రాంతాల రైతులు బాధ పడుట లెవీ చెల్లించలేక ప్రభుత్వము వారికి విజ్ఞప్తి చేసిననూ చెల్లించక తప్పని స్థితి వచ్చి బాధ పడుచున్నారు. ఈయన చిన్నతనం నుండి స్వాతంత్ర్యోద్యమంలో, ఉప్పుసత్యాగ్రహం లో, క్విట్ఇండియా ఉద్యమ కార్యకర్తగా పనిచేసినందున పూర్వపు జాతీయ నాయకులందరు సన్నిహితులు కావడం చేత ఈయననే రైతులు లెవీ బాధ తప్పించమని కోరిరి . జగన్నాధపురం (పశ్చిమగోదావరి జిల్లా ) వాస్తవ్యులు, రైతు నాయకులు,రైతు సంఘాద్యక్షులు శ్రీ వేములపల్లి సనకసందనది మహా ముని గారి నాయకత్వంలో శ్రీ K .L .వీర్రాజు గారు,శ్రీ కంభంమెట్టు పెదరామారావు గారు మొదలగు 10 మంది రైతు బృందంతో హైదరాబాదు వెళ్లి రెవెన్యూ శాఖా మాత్యులు శ్రీ V .B .రాజు గార్కి జిల్లాలో మెట్ట ప్రాంతాల వర్షపు లెక్కలు వివరాలు చూపి నివేదిక సమర్పించగా మెట్ట ప్రాంతాల లో లెవీ వెంటనే రద్దు చేసి ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి కృతజ్ఞతగా రైతు నాయకులైన శ్రీ వేములపల్లి సనకసందనాది మహాముని గారు శ్రీ లలితా సహస్త్ర స్తోత్ర మంజరి ముద్రింప చేశారు .
కుటుంబం[మార్చు]
వీరి వివాహం సీతామహాలక్ష్మితో జరిగింది. వీరికి 10 మంది సంతానం; 6 గురు అబ్బాయిలు, 4 అమ్మాయిలు. వీరి కుమారుడు వి.వై.వి.సోమయాజి కూడా కవి, రచయిత, రేడియో ప్రవక్తగా సుప్రసిద్ధులు.
రచనలు[మార్చు]

This file is a candidate for speedy deletion. It may be deleted after బుధవారము, 4 డిసెంబర్ 2013.
- శ్రీ శ్రీనివాస కథా సుధాలహరి అను శ్రీనివాస కల్యాణం (1961)
- శ్రీ శివకామేశ్వరీ కల్యాణం అను శ్రీ లలితోపాఖ్యానము (1968)
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం - తెలుగు అనువాదం (1960)
- శ్రీ వేంకటేశ్వర భక్తిమాల (1961)
- శ్రీ పట్టసాచాల క్షేత్ర మహత్త్మ్యం (1961)
- శ్రీ లలితా మహేశ్వరీ స్తోత్రమాల (శ్రీ లలితా సహస్రనామ సంకలితము సీస పద్యకావ్యం) (1968)
- శ్రీ హనుమస్తవరాజము
- సుందరకాండ నిత్యపారాయణ
- వందేభారతమాతరం అనే దేశభక్తి గేయం (1953)
- చిక్కడపల్లి వేంకటేశ్వర సుప్రభాతం
- శ్రీ లలితా మహేశ్వరీ స్తోత్ర శతకం
- శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర శతకం
- శ్రీ ఆదిత్యస్తోత్ర నక్షత్రమాలిక
- ఉమా రామలింగేశ్వర శతకం
- అంటరానివారు ఎవరు?
- ర్యాలి క్షేత్ర మహత్త్మ్యం
- స్వరాజ్య సాధనము (1936)
- అధికారి హితోపదేశము (1953)[2]
- జాతీయపతాక వందనం
- జాతీయ గీతామంజరి
- త్రివర్ణ పతాక వందనం
- బాలల దసరా గీతాలు
మూలాలు[మార్చు]
- ↑ అంటరానివారు ఎవరు? గ్రంథం ముందుమాటలో కనుమర్తి లక్ష్మీ వీర్రాజు
- ↑ భారత డిజిటల్ లైబ్రరీ లో అధికారి హితోపదేశము పుస్తకం.[permanent dead link]
[[శ్రీ శివకామేశ్వరీ కల్యాణం గ్రంథ సమీక్ష శ్రీ యామిజాల పద్మనాభ స్వామి -ఆంధ్రపత్రిక 22.07.1986 లో ప్రచురించబడింది]] [[డిశంబరు 27- 2015 న శ్రీ నన్నయ భట్టారక పీఠం లో జరిగిన శ్రీ లలితాదేవి వైభవం ప్రవచనం లో శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి రచించిన శ్రీ లలితా మహేశ్వరీ సహస్రనామ స్తొత్రం లోని పద్యాలను శ్రీ డా.గన్నవరపు శంకర శర్మగారు ప్రస్తావించారు]]
[[25-10-2016 మంగళవారం సాయంత్రం 6-30 గంటలకు శ్రీ నన్నయ భట్టారక పీఠం ఆధ్వర్యంలో శ్రీ వడ్డూరి అచ్యుత రామకవి శత జయంతి సందర్భంగా వారి కుమారుల సౌజంన్యంతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఆదిత్య హృదయ హృదయం ప్రసంగం అనంతరం వారి కుమారులు రామకృష్ణ,సత్యనారాయణ వరప్రసాద్,ఉమారామలింగేశ్వర రావు, పీఠం అధ్యక్ష్యులు డా.జి.యస్వీ.ప్రసాద్,శ్రీ సుశర్మ గార్లు రఘునాధ శర్మ గారిని ఘనంగా సన్మానించినప్పుడు తీసిన ఫోటో.]] [[25-10-2016 మంగళవారం ఈనాడు దినపత్రిక పశ్చిమగోదావరి జిల్లా ఎడిషన్ లో వడ్డూరి అచ్యుత రామ కవి గురించి ఉద్యమ స్పూర్తి-కవితా దీప్తి అనే ప్రత్యేక కధనం ప్రచురితమైనది ఆపేపర్ కటింగ్ కూడా పెట్టడం జరిగింది ]]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- మూలాలు లోపించిన వాక్యాలు కల వ్యాసాలు
- Articles that include images for deletion
- తెలుగు కవులు
- 1916 జననాలు
- 1996 మరణాలు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లా ప్రవచనకర్తలు
- పశ్చిమ గోదావరి జిల్లా కవులు