ఉపన్యాసం

వికీపీడియా నుండి
(ఉపన్యాసాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
A lecture on linear algebra at the Helsinki University of Technology
A lecture on statistics at the University of KwaZulu-Natal

ఉపన్యాసంను ఆంగ్లంలో లెక్చర్ అంటారు. విద్యను నోటి ద్వారా బోధించడాన్నే ఉపన్యాసం అంటారు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేక సమాచారాన్ని నోటితో బోధించడానికి లేక ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన విద్యే ఉపన్యాసం. ఉదాహరణకు కళాశాల లేదా విశ్వవిద్యాలయం యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులకు నోటి ద్వారా విద్యను బోధించడం. ఉపన్యాసం ఇచ్చే వ్యక్తిని ఉపన్యాసకుడు అంటారు. ఉపన్యాసకుడిని ఆంగ్లంలో లెక్చరర్ అంటారు. చరిత్ర, నేపథ్యం, సిద్ధాంతాలు, సమీకరణాలు వంటి క్లిష్టమైన సమాచారాన్ని తెలియజేయడానికి ఉపన్యాసాలను ఉపయోగిస్తారు. సాధారణంగా విద్యాగదిలో లెక్చరర్ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు విద్యార్థులందరికి కనపడే విధంగా వారందరికి ముందువైపున నిలబడి ఉపన్యాసమిస్తాడు.

రాజకీయ ఉపన్యాసాలు

[మార్చు]

రాజకీయ ఉపన్యాసకుడిని రాజకీయనాయకుడు అంటారు. ఇతను తమ పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ఉపన్యాసమిస్తాడు.

వ్యాపార ఉపన్యాసాలు

[మార్చు]

వ్యాపార ఉపన్యాసకుడిని వ్యాపారవేత్త అంటారు. ఇతను తన సంస్థలో తయారైన వస్తువులను అమ్ముకుని తను లాభపడటానికి తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపన్యాసాలిస్తాడు.

సుత్తికొట్టడం

[మార్చు]

అవసరమైన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అనవసరమైన, సందర్భానికి సంబంధం లేని మితిమీరిన ఉపన్యాసాన్ని సుత్తికొట్టడం అంటారు. సుత్తిలేని ఉపన్యాసాలు ఇంపుగా ఉండవు, అందుకే బోరు కొట్టకుండా పిట్టకథలు, చమత్కారాలతో సుత్తికొడతారు. సుత్తి అనే పదం స్తుతి పదం నుంచి ఉద్భవింవించింది. స్తుతించడం అనగా ప్రార్థించడం అని అర్ధం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రసంగం

"https://te.wikipedia.org/w/index.php?title=ఉపన్యాసం&oldid=3052661" నుండి వెలికితీశారు