రాజకీయాలు
(రాజకీయనాయకుడు నుండి దారిమార్పు చెందింది)
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
రాజకీయాలు అనగా సమూహాలుగా నివసిస్తున్న ప్రజలు నిర్ణయాలు చేసేందుకు మార్గం. తెగలు, నగరాలు, లేదా దేశాలుగా ప్రజలు సమూహాలుగా కలిసిమెలసి జీవించేందుకు ప్రజల మధ్య ఒప్పందాలు చేయడానికి రాజకీయాలు ఉన్నాయి. పెద్ద సమూహాలలో, దేశాల వంటి వాటిలో కొంతమంది ఇటువంటి ఒప్పందాలు చేయడానికి చాలా సమయం వెచ్చిస్తారు. వీరిని రాజకీయ నాయకులు అంటారు. రాజకీయనాయకులు,, కొన్నిసార్లు ఇతర ప్రజలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల అధ్యయనమును రాజకీయ శాస్త్రం, రాజకీయ అధ్యయనాలు, లేదా ప్రభుత్వ పరిపాలన అంటారు. రోజువారీ జీవితంలో రాజకీయాలు అనే పదం దేశాల పరిపాలన విధానాన్ని,, ప్రభుత్వ నియమాలు, చట్టాల తయారీ మార్గాలను సూచించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇతర గ్రూపులలో, చాలా పెద్ద సంస్థలలో, పాఠశాలలు, మతసంస్థల వంటి వాటిలో కూడా రాజకీయమనే పదప్రయోగం కనిపిస్తుంది.