ఇళ్ళ మోహన్ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
IllaMohanprasad Photo

ఇళ్ళ మోహన ప్రసాద్ తెలుగు రచయిత, కవి.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1948 నవంబరు 22 న వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో నరసింహమూర్తి, మంగాధనలక్ష్మీ దంపతులకు జన్మించాడు. ఎం.ఎ.చదివి తరువాత ఎం.ఇ.డి పూర్తిచేసాడు. అతను జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసాడు. అతను కవితం రాసేవాడు. అతను శ్రీ నన్నయ భాట్టారక పీఠం కార్యవర్గ సభ్యుడు. అతను వరలక్ష్మీని వివాహమాడాడు. అతను ఆంధ్ర పద్య కవితా సదస్సుకు ఉపాధ్యక్షునిగా, ప్రణతి సాహిత్య సాంస్కృతిక సంస్థ గౌరవాధ్యక్షునిగా, కళాంజని సాహిత్య విభాగానికి సలహాదారునిగా, తిలక్ సాహిత్య పరిషత్ కు ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించాడు. ఇతనిని "కవిశ్రీ" అనే బిరుదు ఉంది. అతను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకున్నాడు. అతను రేడియో ప్రసారాలలో కవితలు-కథానికలు, నాటికలు, పాటలు, సమస్యా పూరణలు వంటి కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

రచనలు[మార్చు]

  • మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర, దేశభక్తి గేయాలు,
  • మువ్వల సవ్వడి-బాలల సాహిత్యం గేయమాలిక,
  • మనసు కురిసిన ముత్యాలు (కవితా సంపుటి)
  • గీతారామము (భక్తి జ్ణాన తత్వ గీతాలు)
  • సిరి చంద్రిక -శతకము

టెలివిజన్ ప్రసారాలు[మార్చు]

అతను టెలివిజన్ కార్యక్రమాలైన స్వర్ణకమలాలు కథకు సంభాషణలను, శాతవాహన చరిత్ర సీరియల్ కు సంభాషణలు, పెళ్ళి చూపుల్లో పెళ్ళి నాటిక రాసాడు.

సాహితీ సేవలు[మార్చు]

  • సాహిత్యపథం లోసారస్వత విద్యా విషయక సావనీర్ ప్రచురణకు ప్రధాన సంపాదకునిగా పనిచేసి "కవిశ్రీ"బిరుదు పొందాడు.
  • గుంటూరు వినియోగదారుల సంఘంవారు నిర్వహించిన రాష్త్రస్థాయి కవితల పోటీలో "జాగృతి" కవితకు బహుమతి పొందాడు.
  • అక్షరదీక్ష నృత్యగీతికలకు జిల్లాకలెక్టెర్, యోజన విద్యాడైరెక్టర్ హస్తాలమీదుగా నగదు, ప్రశంసాపత్రములను పొందాడు.
  • శ్రీ తిరుపతి సంగీతరాయ నృత్యసాహిత్య నాటిక కళాసమితి నిర్వహించిన "మద్యపాననిషేధం" పద్యకవితాపోటీలో రాష్ట్రస్థాయి ప్రథమబహుమతి పొందాడు.
  • పెనుగొండ "రమ్యసాహితీసమితి" సాహిత్యసంస్థ నుండి దాత్యనామవత్సరం ఉగాదికవితల పోటీలో ప్రథమస్థానంలో నిలచి జ్ఞాపికతోసన్మానింపబడ్డాడు.
  • మహాత్మాగాంధీ శతజయంతి సందర్భంగా "అలీన విద్యార్ధి భవిష్యత్ ఫెడరేషన్" భీమవరం వారినుండి బహుమతి పొందాడు.
  • స్వతంత్రభారతి స్వర్ణోత్సవాలు సందర్భంగా "స్వర్ణభారతి" దేశభక్తి గీతానికి రాష్ట్రస్థాయిలో ప్రథమబహుమతి పొందాడు .
  • సుమధుర సంగీత విద్వాన్ పద్మభూషణ్ గానగంధర్వ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి సంగీత బాణీకి రాష్ట్రప్రభుత్వ పథకాలపై పాట రచించి భాగ్యనగరం సచివాలయం ప్రచారవిభాగంవారి నుండిప్రశంసాపత్రం పొందాడు.
  • నవంబరు 12వ తేదీనాడు తణుకు శ్రీ నన్నయ భట్టారకపీఠంలో కవిశ్రీ మోహన్ ప్రసాద్ గారు రచించిన సిరిచంద్రిక పద్యకావ్యాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయనను ఘనంగా వారిని వారి శ్రీమతిని సత్కరించారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • సిరిచంద్రిక గ్రంథావిష్కరణ శ్రీనన్నయభట్టారక పీఠంలో జరిగిన వార్తను ఆంధ్రజ్యోతి తలుగు దినపత్రిక 12-11-2017లో ప్రచుచరింపబడింది.