ఉత్పల సత్యనారాయణాచార్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.

జీవిత విశేషాలు[మార్చు]

వీరు ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న జన్మించాడు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

ఈయన రచన శ్రీకృష్ణ చంద్రోదయమునకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్ర్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదనంద గోహిని ప్రముఖమైనవి.

మరణం[మార్చు]

సత్యనారాయణాచార్య 2007, అక్టోబర్ 23న హైదరాబాదులో అనారోగ్యముతో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]