జమీన్ రైతు
![]() జమీన్ రైతు | |
రకం | వారపత్రిక |
---|---|
రూపం తీరు | టాబ్లాయిడ్ |
ప్రచురణకర్త | నెల్లూరు వెంకట్రామానాయుడు(తొలి), నెల్లూరు డోలేంద్రప్రసాద్ |
సంపాదకులు | నెల్లూరు వెంకట్రామానాయుడు (తొలి), నెల్లూరు డోలేంద్రప్రసాద్ |
స్థాపించినది | 1930 |
భాష | తెలుగు |
కేంద్రం | నెల్లూరు |
జాలస్థలి | http://www.zaminryot.com/index.html |
జమీన్ రైతు తెలుగు వారపత్రిక, నెల్లూరు నుండి వెలువడుతోంది. 1928లో ఎన్. వెంకట్రామానాయుడు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పత్రిక మొదట జమీందారీ రైతు అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా జమీన్ రైతుగా మారింది.[1] రైతుల పక్షమున వారి హక్కులకై జమీందారులతో సంప్రతించి, వాదించి, అవసరమైనప్పుడు ఆందోళన చేసి పేదరైతుయొక్క ఆర్థిక స్థితిని బాగుచేయడం ముఖ్యోద్దేశంగా ఈ పత్రిక ప్రారంభమైనది. నెల్లూరు వెంకట్రామానాయుడు సంపాదకుడిగా 1950 వరకు ఉన్నాడు. తరువాత నెల్లూరు శ్రీరామమూర్తి ఈ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ప్రస్తుతం నెల్లూరు డోలేంద్రప్రసాద్ సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో ఆత్రేయ, రావూరి భరద్వాజ, బంగోరె మొదలైన వారు పనిచేశారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పత్రిక అయినా ఈ పత్రిక రాజకీయ, సామాజిక వార్తలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. కథలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు, ధారావాహిక నవలలను కూడా ప్రకటించింది. పాత పత్రికలను అంతర్జాలంలో అందుబాటులో వుంచిన పత్రికలలో అత్యధికకాలంనుంచి (1930 మార్చినుండి )[2] వున్న పత్రిక ఇదే.
రచయితలు[మార్చు]
ఈ పత్రికలో బెజవాడ గోపాలరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, ఆత్రేయ, ఎన్.జి.రంగా, కళా వెంకట్రావు, కె.సభా, దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువా, స్థానం నరసింహారావు, చంద్రశేఖర కణ్వశ్రీ, చుండి జగన్నాథం, వెంపటి సత్యం, నాదెళ్ల రామకృష్ణశాస్త్రి, మరుపూరు కోదండరామిరెడ్డి,ఉండేల మాలకొండారెడ్డి, ఎస్.వి.భుజంగరాయశర్మ, వల్లభనేని కాశీవిశ్వనాథం, పురిజాల వెంకటప్పారావు, నారిశెట్టి ఇన్నయ్య అక్కిరాజు రమాపతిరావు తదితరుల రచనలు ప్రచురించబడ్డాయి.
శీర్షికలు[మార్చు]
- కథాతరంగం
- పినాకినీతీరం
- మేము-మీరు
- జనవాణి
- నెల్లూరు ముచ్చట్లు
- శివారెడ్డి పద్యాలు
- పంచాంగం
- ఊరూ పేరు
- చిత్రసమీక్ష
- రైతులోకం
- పుస్తకసమీక్ష
- ఇదీ సంగతి
- హైదరాబాదు లేఖ
- ఉన్నమాట
- ఈ వారం...
- సభలు - సమావేశాలు
- మాటకచేరి
- లోకవృత్తం
- కూనిరాగాలు
- లోకాభిరామాయణం మొదలైనవి
మూలాలు[మార్చు]
- ↑ G. Somasekhar. "The Role Telugu Press In The Indian Freedom Movement Chapter 2" (PDF). shodhganga.inflibnet.ac.in. శోధ్ గంగ. Retrieved 27 December 2017.
- ↑ "పాత సంచికలు". జమీన్ రైతు.