Jump to content

వ్యాసం (సాహిత్య ప్రక్రియ)

వికీపీడియా నుండి
(వ్యాసాలు నుండి దారిమార్పు చెందింది)

ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు ముఖ్య స్థానం ఉంది.

చరిత్ర

[మార్చు]
మిత్రవాక్యం వ్యాసం రచయత వాకాటి పాండురంగారావు

ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా తెలుగు రచయితలు వ్యాసాలను రాసారు. దీనిలో వ్యసాల విశ్లేషణ సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.వ్యాసం అనేది మొదటగా ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించాడు.ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు. తెలుగు లో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.ఈ ప్రమేయం సంకలనమే హితసూచిని'.ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.

ఉపన్యాసం,సంగ్రహం,ప్రమేయం అనే పేర్లు అనంతరం 20వ శతాబ్దంలో వ్యాసం అనే పేరు స్థిరపడింది.వ్యాసాలు అధికంగా రచించింది కందుకూరు వీరేశలింగంపంతులు. తొలితెలుగు వ్యాసరచయిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనమ్మ.

వ్యాస రచన

[మార్చు]

ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.

వ్యాసంలో భాగాలు;
ప్రారంభం;

ప్రారంభం వైవిధ్యంగా వుండాలి. మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు.

నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం;

దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకుతెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి. వ్యాసంలో ముఖ్యాంశాలను క్లుప్తంగా, వ్యాసా భాగాలను పరిచయంచేయాలి. విషయం కొత్తగా అనిపించినవారికి, ఇది చదివితే మిగతా వ్యాసం అర్థం అవడానికి సులువువతుంది.

విషయ విశ్లేషణ

విషయంలో ముఖ్యమైనవాటిని విస్తరించాలి. గణాంకాలు అవసరమైనపుడు వాడాలి. (ఉదా: అక్షరాస్యత పై వ్యాసంలో, దేశాల, రాష్ట్రాల అక్షరాస్యత గణాంకాలు, వర్గాల వారీగా, కాలానుగుణంగా మార్పుల గణాంకాలు రాయాలి. విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన వివరించాలి.

అనుకూల, ప్రతికూల అంశాలు

ప్రతిపాదనకు అనుకూల, ప్రతికూల అంశాలు రాయాలి.

సూచనలు

సంబంధిత ప్రయోగాల వివరణలు రాయాలి.

ముగింపు

వ్యాస సారాంశాన్ని రాయాలి. దీనిలోసూక్తులు, సుభాషితాలను వాడవచ్చు.

భాష తీరు

వాడుక భాషలో, సాధ్యమైనంతవరకు భాషా దోషాలు రాకుండా రాయాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాల పేర్లలో తప్పులుండకూడదు.

సామాన్య పదాలదోషాలు
  • ఒత్తులు
  • అచ్చుకి బదులు హల్లు వాడటం ఉదా: వకడు (తప్పు) ఒకడు (ఒప్పు)
  • హల్లుకి బదులు అచ్చు వాడటం. ఉదా: ఎంకయ్య (తప్పు) వెంకయ్య (ఒప్పు)
  • చ, శ, ష,‌ స - లలో పొరపాటు పడటం .ఉదా: వేషం, శనగలు, పరీక్ష (ఒప్పు )
  • సంయుక్తాక్షరాలో దోషం. ఉదా: మధ్యాహ్నం (ఒప్పు), మజ్జాన్నం (తప్పు) మద్దాన్నం (తప్పు); న్యాయం (ఒప్పు), నాయం (తప్పు)

వాక్య నిర్మాణం దోషాలు

[మార్చు]

పొడుగు వాక్యాలు వాడితే స్పష్టత లేక అర్థం చేసుకోవటం కష్టం. చిన్న వాక్యాలు వాడాలి. కర్త వచనాన్ని బట్టి క్రియని చేర్చాలి. ఇతర భాషా పదాలు సాధ్యమైనంతవరకు తక్కువగా వాడాలి. 'విజయం' బదులుగా 'సక్సెస్' ఎందుకు వాడటం. వాడుకలో వున్న పరభాషా పదాలు (రోడ్డు, టికెట్, బజారు, వసూలు) ఉపయోగించవచ్చు.

ఇవీ చూడండి

[మార్చు]

ప్రఖ్యాతి చెందిన వ్యాసాలు-రచయితలు

[మార్చు]
సంఖ్యవ్యాసంరచయిత
1సంగ్రహాలు అనేపేరుతో వ్యాసాలు రచించిందిపరవస్తు వేంకటరంగాచార్యులు.
2బేకన్ ఉపన్యాసాలు అనేపేరుతో వ్యాసాలు రచించినదికళాంచి రామనుజాచార్యులు.
3.సాక్షి వ్యాసాలు రచించిందిపానుగంటి లక్ష్మీనరసింహ (సాక్షి వ్యాసాలలో ఉన్న ప్రధాన పాత్ర జంగాల శాస్త్రీ)
4తెలుగు వ్యాస పరిణామంతిరుమల రామచంద్ర
5మాణిక్యవీణవిద్వాన్ విశ్వం
6స్త్రీ కళాకల్లోలనిజియరీ సూరి
7మిత్రవాక్యంవాకాటి పాండురంగారావు
8ఇల్లాలి ముచ్చట్లుపురాణం సీత
9నుడీ నానుడితిరుమల రామచంద్ర
10వ్యాస చంద్రికగురజాడ అప్పారావు
11ప్రాదెనుగుకమ్మగిడుగు రామమూర్తిపంతులు
12ఆంధ్రభాషాపండిత బిషక్కుభేషజంగిడుగు రామమూర్తిపంతులు
13వ్యాస వాణివేలూరి శివరామశాస్త్రీ
14సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలుజి.వి.సుబ్రహ్మణ్యం
15సాహిత్యంలో దృక్పదాలుఆర్.యస్.సుదర్శనం
16తెలుగుపై ఆంగ్లభాషా ప్రభావంకె.వీరభద్రారావు
17తెలుగు సాహిత్య విమర్శయస్.వి.రామారావు
18కవిసేన మేనఫెస్టోగుంటూరు శేషేంద్ర శర్మ
19గౌతమీ వ్యాసాలుపింగళి లక్స్మీకాంతం (ఆంధ్ర సాహిత్య శిల్ప సమీక్ష పుస్తకం)
20ఊహాగాణంలత
21ఆంధ్రసాహిత్య సంగ్రహంకవిత్వవేధి (కలం పేరు)
22కఠోర షడ్జమాలువసంత కర్ణబిరాన్
23మినీ కవిత విప్లవంకె.సత్యనారాయణ
24కాల జ్ఞానం (వార్తాపత్రిక వ్యాసాల సంకలనం)[1]వేముల ప్రభాకర్

మూలాలు

[మార్చు]
  1. ↑ "కాలజ్ఞానం - వేముల ప్రభాకర్".

వెలుపలి లంకెలు

[మార్చు]
  • వ్యాస రచనలో మెళకువలు, డా:ద్వానా శాస్త్రి, ఉద్యోగ సోపానం 2010, పేజీలు 555-557